Hardest Driving Skills: డ్రైవింగ్ అనేది జస్ట్ వెహికల్ నడపడం మాత్రమే కాదు. దానిలో నైపుణ్యం పొందడం ముఖ్యం. చాలా మంది స్టీరింగ్ పట్టడం, గేర్ మార్చడం, బ్రేక్ వేయడం ఈజీగా నేర్చుకుంటారు. కానీ, నమ్మకంగా, సేఫ్ గా డ్రైవ్ చేయాలంటే కొన్ని స్పెషల్ స్కిల్స్ అవసరం. వాటిలో కొన్ని చాలా కష్టంగా ఉంటాయి. మరికొన్ని మాత్రం కొద్దిగా ప్రాక్టీస్ తోనే నేర్చుకోవచ్చు. ఇంతకూ అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కష్టమైన స్కిల్స్ విషయానికి వస్తే, హైవేలోకి వేగంగా, సరిగ్గా ఎంటర్ అవ్వడం లాంటి విషయంలో చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అప్పటికే వేగంగా వెళ్తున్న వెహికల్స్ మధ్య అదే వేగంతో వెళ్లాలి. ఎలాంటి తడబాటుకు గురైనా ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది. కారు స్కిడ్ అయితే, దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టమైన పని. ఆ సమయంలో భయపడకుండా స్టీరింగ్ ను సరిగ్గా హ్యాండిల్ చేయడం చాలా ముఖ్యం.
సిటీలు, టౌన్ లలో పార్కింగ్ కూడా చాలా కష్టమైన పని. ఇరుకైన ప్రదేశాల్లో కారు పార్క్ చేయడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. దూరం అంచనా వేయడం, స్టీరింగ్ టైమింగ్ మధ్య సమన్వయం కావాలి. ట్రాఫిక్ లో సేఫ్ డిస్టెన్స్ పాటించడం కూడా ఈజీ కాదు. ముందు వాహనం దగ్గరగా వెళ్లాలనే తొందరను కంట్రోల్ చేసుకోవాలి.
అనుభవం పెరిగిన తర్వాతే వచ్చే మరో స్కిల్, ఇతర డ్రైవర్ల తప్పులను ముందుగానే ఊహించడం. అకస్మాత్తుగా లేన్ మార్చవచ్చు. బ్రేక్ వేయవచ్చు అని ముందుగానే గుర్తించాలి. రద్దీగా ఉన్న చోట్ల ఎడమ మలుపు తీసుకోవడం కూడా కష్టం. పాదచారులు, బైక్‌లు, కార్లును గమనించి నెమ్మదిగా వెళ్లాలి.
ఇరుకైన రోడ్లలో లేన్ లో సరిగ్గా ఉండటం కూడా కొంత కష్టమే. ముఖ్యంగా రాత్రి సమయంలో లేదంటే వర్షంలో ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ట్రాఫిక్ లో ఆగి ఆగి వెళ్లేటప్పుడు సడెన్ బ్రేక్ వేయకుండా స్మూత్ గా డ్రైవ్ చేయాలి. రౌండ్ అబౌట్ లలో డ్రైవింగ్ చేయడం, సైకిల్ తొక్కేవాళ్లు, పాదచారులతో రోడ్డును షేర్ చేసుకోవడం జాగ్రత్తగా నేర్చుకోవాలి.
ఇక ఈజీ స్కిల్స్ విషయానికి వస్తే, సిగ్నల్ ఇవ్వడం, అద్దాలను సరిగ్గా ఉపయోగించడం, సీట్ బెల్ట్ వేసుకోవడం, సరైన వేగంలో డ్రైవ్ చేయడం లాంటి బేసిక్స్ చాలా ముఖ్యం. పార్కింగ్ లైన్స్ లో వెహికల్ నిలపడం, లేన్ మార్చేటప్పుడు సిగ్నల్స్ ఇవ్వడం, నెమ్మదిగా బ్రేక్ వేయడం లాంటి అలవాట్లు త్వరగా నేర్చుకోవచ్చు. డ్రైవింగ్‌లో స్కిల్ అనేది ప్రాక్టీస్ తోనే వస్తుంది. మొదట కష్టంగా అనిపించే విషయాలు కూడా సమయం గడిచేకొద్దీ సులభంగా మారుతాయి.
Read Also: థార్.e To BE07.. మహీంద్రా నుంచి రాబోతున్న టాప్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!