E-Paper
Advertisement

దౌలతాబాద్‌లో దారుణం.. ఓ మహిళకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చి నగలు చోరి..!

దౌలతాబాద్‌లో దారుణం.. ఓ మహిళకు బైక్ పై లిఫ్ట్ ఇచ్చి నగలు చోరి..!
Advertisement

Fake Lift: స్వేచ్ఛ బ్యూరో: లిఫ్ట్ ఇస్తానని మాయమాటలు చెప్పి మహిళను మోసం చేసి బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన ఘటన దౌల్తాబాద్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తొగుట సీఐ లతీఫ్ తెలిపిన వివరాల ప్రకారం… ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం సుమారు 8 గంటల సమయంలో ఓ మహిళ ఆటో కోసం ఎదురుచూస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తి తన మోటార్ సైకిల్‌పై గొడుగుపల్లి గ్రామానికి వెళ్తున్నానని చెప్పి ఆమెను నమ్మబలికి ఎక్కించుకున్నాడు.

పెట్రోల్ అయిపోయిందని..

అనంతరం దీపాయంపల్లి గ్రామ శివారులోని కల్వర్ట్ వద్దకు చేరుకున్న తర్వాత బైక్‌లో పెట్రోల్ అయిపోయిందని చెప్పి బండి ఆపాడు. ఈ సమయంలో మహిళను మాయమాటలతో దారి మళ్లించి ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు తాడు, 2 గ్రాముల బంగారు చెవి కమ్మలు, అలాగే 20 తులాల వెండి కాళ్ల పట్టీలు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. రామరం గ్రామం, రాయపోల్ మండలానికి చెందిన ఎరుకలి శ్రీను (30), తండ్రి యెల్లయ్యను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 3 తులాల బంగారు తాడు, 2 గ్రాముల బంగారు చెవి కమ్మలు, 20 తులాల వెండి కాళ్ల పట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: వివాదాల కొండ‌… ఆమె మ‌ళ్లీ నోరు విప్పారు! స‌ర్కార్ త‌ల‌ప‌ట్టుకుంది!

కేసు దర్యాప్తులో..

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని చెప్పినప్పుడు వారి మాటలు నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన దౌల్తాబాద్ ఎస్సై గంగాధర అరుణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ విక్రమ్ రెడ్డి, కానిస్టేబుళ్ళు నాగరాజు, స్వామి లను సీఐ అభినందించారు.

Advertisement

Also Read: బిగ్ అలర్ట్.. ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ రద్దు

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×