E-Paper
Advertisement

పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Advertisement

Petrol and Diesel Rates Today: ఇవాళ (మే 9) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఊగిసలాటకు గురవుతున్నప్పటికీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం వినియోగదారులపై అదనపు భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచుతున్నాయి. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను సమీక్షించే విధానం అమల్లో ఉన్నప్పటికీ, ఈ రోజు మాత్రం ఎక్కువ నగరాల్లో ధరలు యథాతథంగానే ఉన్నాయి.

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా..

మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో ప్రపంచ చమురు మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి ప్రాంతంపై ఆందోళనలు పెరగడంతో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, దేశీయంగా వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేంద్ర వర్గాలు సూచిస్తున్నాయి.

ఇవాళ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.72 కాగా, డీజిల్ రూ.87.62గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.104.21, డీజిల్ రూ.92.15. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.107.46 కాగా, డీజిల్ రూ.95.70గా కొనసాగుతోంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ధరలు గత కొన్ని రోజుల మాదిరిగానే ఉన్నాయి.

ఇంధన ధరలు రాష్ట్రాల వారీగా భిన్నంగా ఎందుకుంటాయి?

ఇంధన ధరలు రాష్ట్రాల వారీగా భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణం పన్నులు. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర వ్యాట్, స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు ప్రతి రాష్ట్రంలో వేరుగా ఉండటంతో ధరల్లో తేడాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ ముడి చమురు ధరలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.

Advertisement

ఇటీవల ఇండియన్ ఆయిల్ తన ప్రీమియం XP100 పెట్రోల్ ధరను పెంచింది. అలాగే ప్రైవేట్ కంపెనీలు  షెల్, నయారా ఎనర్జీ కూడా కొన్ని నగరాల్లో ధరలను పెంచాయి. ముఖ్యంగా బెంగళూరులో ప్రైవేట్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగితే భవిష్యత్తులో ధరల సవరణలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులు తమ నగరంలోని తాజా ఇంధన ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్, BPCL, HPCL సంస్థలు ఇందుకు ప్రత్యేక మొబైల్ సేవలను అందిస్తున్నాయి. ఇండియన్ ఆయిల్: సిటీ కోడ్ + RSPని 9224992249, BPCL: RSPని 9223112222,  HPCL: HP Priceను 9222201122కు SMS పంపి పెట్రోల్, డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు.

Read Also: టాటా To ఎంజీ.. రూ.15 లక్షల లోపు టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

Big Stories

Advertisement
×