New EV Cars in November 2026: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ అనుకూల వాహనాల వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 2026లో భారత మార్కెట్లోకి పలు కొత్త ఎలక్ట్రిక్ కార్లు వచ్చే అవకాశం ఉంది. లగ్జరీ SUVల నుంచి తక్కువ ధరలో లభించే కాంపాక్ట్ కార్ల వరకు ఐదు మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
లగ్జరీ ఎలక్ట్రిక్ SUV కోసం ఎదురుచూస్తున్న వారికి మెర్సిడెస్-బెంజ్ GLC ఎలక్ట్రిక్ బెస్ట్ ఆప్షన్ కానుంది. ప్రీమియం డిజైన్, అత్యాధునిక సాంకేతికతతో ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని అంచనా ధర సుమారు రూ.80 లక్షలు. నవంబర్ 4న ఈ కారు మార్కెట్ లోకి విడుదల కానుంది.
మహీంద్రా థార్‌కు ఉన్న ప్రత్యేకమైన గుర్తింపును ఎలక్ట్రిక్ వెర్షన్ లో చూడాలని కార్ లవర్స్ చాలా మంది కోరుకుంటున్నారు. థార్ E ఆఫ్ రోడ్ SUV విభాగంలో కొత్త ఆకర్షణగా మారే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.25 లక్షలు. నవంబర్ 15న విడుదల కావచ్చని తెలుస్తోంది.
లగ్జరీ ప్రయాణాన్ని కోరుకునే వారి కోసం డెంజా D9 ఎలక్ట్రిక్ మినీవ్యాన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విశాలమైన క్యాబిన్, ప్రీమియం సౌకర్యాలతో ఈ వెహికల్ ప్రత్యేకతను చాటుకోనుంది. దీని అంచనా ధర రూ.1.10 కోట్లు కాగా, నవంబర్ 15న విడుదల కావచ్చని భావిస్తున్నారు.
చిన్న సైజులో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఉపయోగపడే అవకాశం ఉంది. పట్టణ ప్రయాణాలకు అనుకూలంగా ఉండే ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ ధర సుమారు రూ.12 లక్షలు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కారు నవంబర్ లో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది.
హ్యుందాయ్ ఐయోనిక్ 6 ఎలక్ట్రిక్ సెడాన్ విభాగంలో ప్రీమియం మోడల్ గా నిలవనుంది. ప్రత్యేకమైన డిజైన్‌తో పాటు ఆధునిక ఫీచర్లు కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. దీని అంచనా ధర రూ.65 లక్షలు. విడుదల నవంబర్ 2026లో ఉండవచ్చని భావిస్తున్నారు.
Read Also: సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ రేంజ్.. నవంబర్ లో రానున్న 4 కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు ఇవే!