Kamran Akmal On Bhuvneshwar Kumar: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( IND VS NZ) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ నాలుగు సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అలాగే దేశవాలి క్రికెట్ లో అదరగొట్టిన భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar)… ఈ సిరీస్ లో మాత్రం తేలిపోయాడు. దీంతో పాకిస్తాన్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. రెండు మ్యాచ్లలో 99 పరుగులు ఇస్తారా…? ఇదేం దిక్కుమాలిన బౌలింగ్ అంటూ ఆగ్రహించారు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చూస్తే తనకు నవ్వొస్తోందని హేళన చేశారు. ఇలాంటి ముసలి క్రికెటర్లు రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అంటూ చురకలు అంటించారు. దీంతో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ పై కమ్రాన్ అక్మల్ (Kamran Akmal) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
న్యూజిలాండ్ టి20 సిరీస్ నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ చెత్త బౌలింగ్ ప్రదర్శన పై కమ్రాన్ అక్మల్ హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వాళ్లకు గౌతమ్ గంభీర్ కరెక్ట్ అంటూ ఫైర్ అయ్యారు. ఇన్ని రోజులపాటు భువనేశ్వర్ కుమార్ ను టీమిండియాలోకి రాకుండా గౌతమ్ గంభీర్ నిజంగానే అడ్డుకున్నాడని గుర్తు చేశారు. అతని ప్రదర్శన ఐపీఎల్ వరకేనని… అంతర్జాతీయ క్రికెట్ లో పెద్దగా ఉండదని ముందే గ్రహించి గంభీర్ ఇలాంటి ప్లాన్ చేశాడని తెలిపారు.
కానీ అనవసరంగా గౌతమ్ గంభీర్ణులు విలన్ చేసి.. భువనేశ్వర్ కుమార్ ను చాలామంది జోకారని ఆగ్రహించారు. రియాలిటీలో రెండు మ్యాచ్లు ఆడిన భువనేశ్వర్ కుమార్ 99 పరుగులు ఇచ్చాడని ఆగ్రహించారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇలా పరుగులు ఇస్తే… టీమిండియా కొంప మునిగడం గ్యారంటీ అని హెచ్చరించారు. తన దృష్టిలో 30 సంవత్సరాలు దాటిన మౌనర్లు రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అంటూ సూచనలు చేశారు. టీమిండియాలో ఉన్న కొత్త బౌలర్లను గంభీర్ అద్భుతంగా వాడుకుంటున్నాడని కమ్రాన్ అక్మల్ వ్యాఖ్యానించారు.
భువనేశ్వర్ కుమార్ పై చాలా మంది విమర్శలు చేస్తుంటే టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాత్రం అండగా నిలిచారు. ఇన్ని రోజులు ఐపీఎల్ కు అలవాటు పడిన భువనేశ్వర్ కుమార్ కు కాస్త సమయం ఇవ్వాలని కోరారు. రెండు మ్యాచ్ లు ఆడిన అతడిని తక్కువగా అంచనా వేయకూడదని తెలిపారు. భవిష్యత్తులో అతని ప్రదర్శన మెరుగుపడుతుందని వ్యాఖ్యానించారు. 99 పరుగులు ఇచ్చాడని అతన్ని అనవసరంగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. మూడో టి20లో అతడు వికెట్లు తీస్తే మళ్లీ మెచ్చుకుంటారని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నారు.