Upcoming Electric Two-Wheelers November 2026: భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో నవంబర్ 2026లో పలు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. కొన్ని మోడళ్ల బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా, మరికొన్ని వెహికల్స్ అందుబాటులోకి రానున్నాయి. VLF, బొండాడ, ఏథర్, ఓబెన్ లాంటి సంస్థలకు చెందిన ఈ వాహనాల్లో ధర, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ లాంటి అంశాలు ఆకట్టుకోనున్నాయి.
VLF స్ట్రాడా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ స్కూటర్ డెలివరీలు నవంబర్ 2026లో మొదలయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారికి ఈ రేంజ్ ఉపయోగపడుతుంది. అయితే, రియల్ రైడింగ్ రేంజ్ అనేది రైడింగ్ పరిస్థితులను బట్టి మారే అవకాశం ఉంది.
బొండాడ T1 ఎలక్ట్రిక్ టూ వీలర్ నవంబర్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కమర్షియల్ గా అందుబాటులోకి రానుంది. దీని ధర జీఎస్టీతో కలిపి రూ.59,999గా వెల్లడించారు. ఈ వాహనాన్ని రోజువారీ అవసరాలు, ఇతర వ్యాపార అవసరాల రవాణా కోసం దీనిని రూపొందించారు. ఇందులో 200 కిలోల పేలోడ్ సామర్థ్యం, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 86 కిలోమీటర్ల ప్రయాణ రేంజ్ ఉంటాయి. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు మూడు గంటలు పడుతుంది.
ఏథర్ రెడక్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ నవంబర్ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.1 లక్షగా ఉండొచ్చని సమాచారం. స్పోర్టీ డిజైన్ తో రానున్న ఈ వాహనం గంటకు గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అయితే, దీని పూర్తి ఫీచర్లు, బ్యాటరీ సామర్థ్యం, ధర వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఓబెన్ O00 ఎలక్ట్రిక్ బైక్ కూడా నవంబర్‌లో మార్కెట్లోకి రావచ్చని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.80,000గా ఉండొచ్చని సమాచారం. ఇందులో 3.4kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని వెల్లడించారు. గరిష్ఠ వేగం గంటకు 110 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు.
ఈ నాలుగు వెహికల్స్ లో ధర, రేంజ్, వినియోగ అవసరాల పరంగా తేడాలున్నాయి. కొనుగోలు చేసే ముందు కంపెనీల అధికారిక ప్రకటనలు, బ్యాటరీ వారంటీ, ఛార్జింగ్ సదుపాయాలు, రియల్ రైడింగ్ రేంజ్ ని చెక్ చేయడం మంచిది.
Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ To డుకాటి.. నవంబర్‌లో రాబోతున్న 9 కొత్త బైక్ లు ఇవే!