E-Paper
Advertisement

MG Warranty: ఐదేళ్ల అన్ లిమిటెడ్ వారెంటీ, ఫ్రీ సర్వీసింగ్.. ఎంజీ మోటార్స్ అదిరిపోయే ఆఫర్!

MG Warranty: ఐదేళ్ల అన్ లిమిటెడ్ వారెంటీ, ఫ్రీ సర్వీసింగ్.. ఎంజీ మోటార్స్ అదిరిపోయే ఆఫర్!
Advertisement

MG Majestor Gets 5-Year Unlimited Warranty: JSW MG మోటార్ ఇండియా మెజెస్టర్ కొనుగోలు చేసే వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో తొలి  D+ సెగ్మెంట్ SUVగా అందుబాటులోకి రానున్న ఈ కారుకు సంబంధించి బండిల్డ్ ఓనర్ షిప్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. 5-5-5 ప్రోగ్రామ్ అని పిలువబడే ఈ ప్యాకేజీ కింద, వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, సర్వీస్ బెనిఫిట్స్ ఒకే ఆఫర్ లో అందుబాటులో ఉంచింది. దీని ద్వారా దీర్ఘకాలిక యాజమాన్య ఖర్చులు తగ్గనున్నాయి.

కొనుగోలుదారులు తరచుగా పనితీరు, అధునాతన సాంకేతికతపై భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఈ ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండే 5-5-5 ప్లాన్ 5 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ వారంటీని అందిస్తుంది. 5 సంవత్సరాల ఉచిత రోడ్‌ సైడ్ అసిస్టెన్స్, ఐదు లేబర్ ఫ్రీ సర్వీస్ లు అందించడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఆప్షనల్ యాడ్ ఆన్స్, పొడిగించిన వారంటీ ప్యాకేజీల మాదిరిగా కాకుండా, ఈ ప్రయోజనాలు Majestorలో ప్రామాణికంగా అందిస్తుంది.

దేశ వ్యాప్తంగా సర్వీస్ కవరేజ్

Advertisement

కస్టమర్ల కోసం వారంటీ కవరేజ్‌పై కిలోమీటర్ పరిమితి లేకపోవడం, దేశం అంతటా ఐదు సంవత్సరాల బ్రేక్‌ డౌన్ సపోర్టు కారణంగా ఓనర్లు కొనుగోలు చేసిన కొత్తలో సర్వీస్ ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీ ముఖ్యంగా అధిక ప్రయాణాలు చేసే వినియోగదారులు, సుదూర ప్రయాణికులు, ఆఫ్ రోడ్ ఔత్సాహికులకు సంబంధించినది. వాళ్లు కారు  వినియోగానికి సంబంధించి తొలి సంవత్సరాలలో ఎక్కువ ఖర్చులను చేయాల్సి వచ్చే అవకాశం ఉంటుంది.

MG మెజెస్టర్ గురించి..

MG మెజెస్టర్ 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ద్వారా నడుస్తుంది. ఇది 215.5 PS పవర్, 478.5 Nm టార్క్‌ ను అందిస్తుంది. 2WD, అధునాతన 4WD కాన్ఫిగరేషన్లలో అత్యుత్తమంగా 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ తో వస్తుంది. MG మెజెస్టర్ ఎక్కువ సామర్థ్యం కోసం రూపొందించబడింది. ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్‌లు, ​​10 ఆఫ్ రోడ్ మోడ్‌ లతో కూడిన అడ్వాన్స్‌ డ్ 4WD సిస్టమ్, ఎక్స్‌ ట్రీమ్ టెర్రైన్ మాస్టరీ కోసం క్రాల్ కంట్రోల్ మోడ్‌తో పాటు 219 mm గ్రౌండ్ క్లియరెన్స్, 810 mm వాటర్ వేడింగ్ సామర్థ్యంతో వస్తుంది. లెవెల్ 2 ADASతో కూడా తొలి D+ SUV గా, మెజెస్టర్ అధునాతన భద్రత, సాంకేతికతతో వస్తుంది.

MG మెజెస్టర్ బుకింగ్స్ ఓపెన్..

Advertisement

MG మెజెస్టర్ కోసం ముందస్తు రిజర్వేషన్లు మొదలయ్యాయి. రూ. 41,000 చెల్లించి బుక్ చేసుకునే అవకాశం కల్పించింది కంపెనీ.  షోరూమ్ డిస్ ప్లే, టెస్ట్ డ్రైవ్‌లు ఏప్రిల్ 2026లో ప్రారంభమవుతాయి. డెలివరీలు మే 2026లో ప్రారంభమవుతాయి.  5-5-5 కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రామ్ ప్రయోజనాలతో పాటు భారతదేశపు తొలి D+ SUVకి ముందస్తు యాక్సెస్ పొందే అవకాశం కల్పిస్తుంది.

Read Also: కొత్త లెక్సస్ ES లాంచ్ డేట్ ఫిక్స్, వావ్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

Big Stories

Advertisement
×