E-Paper
Advertisement

Chandrababu: పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు.. దావోస్ సదస్సులో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు

Chandrababu: పారిశ్రామిక దిగ్గజాలతో వరుస భేటీలు.. దావోస్ సదస్సులో బిజీ బిజీగా సీఎం చంద్రబాబు
Advertisement

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) – 2026 సదస్సులో పాల్గొనేందుకు నేడు జ్యూరిచ్ చేరుకున్నారు. అయితే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటనకు లక్ష్యంగా పెట్టుకున్నారు.

జ్యూరిచ్ చేరుకున్న సీఎం బృందం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులతో కూడిన ఎనిమిది మంది సభ్యుల బృందం నేడు ఉదయం 10:50 గంటలకు జ్యూరిచ్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ వారికి ప్రవాస తెలుగువారు, విమానాశ్రయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటన జనవరి 19 నుండి 22 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.

Advertisement

పారిశ్రామిక చర్చలు
అయితే మధ్యాహ్నం 2:30 గంటలకు స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్‌తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్-స్విస్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. అనంతరం ఎరోస్ మీడియా వరల్డ్ వ్యవస్థాపక డైరెక్టర్ కిశోర్ లుల్లా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం విడివిడిగా సమావేశమై రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక సానుకూలతలను వివరించనుంది.

నేడు సాయంత్రం 4 గంటలకు జ్యూరిచ్‌లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. సుమారు 20 దేశాల నుండి వచ్చే ఎన్ఆర్ఐ (NRI)లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా. రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలుగు ప్రజల భాగస్వామ్యం, ‘ప్రజలే నా బలం’ అనే నినాదంతో అభివృద్ధి ప్రణాళికలను ఆయన వారికి వివరించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం బృందం రోడ్డు మార్గంలో దావోస్‌కు బయలుదేరుతుంది.

Advertisement

దావోస్‌లో కీలక కార్యక్రమాలు
రేపటి నుండి దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో చంద్రబాబు అత్యంత బిజీగా గడపనున్నారు. ఈ పర్యటనలో ఆయన మొత్తం 36 అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో 3 దేశాధినేతలతో సమావేశాలు, 16 మంది గ్లోబల్ సీఈవోలతో ముఖాముఖి భేటీలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్లీనరీ సెషన్లు ఉన్నాయి. గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, ఐబీఎం ఛైర్మన్ అరవింద్ కృష్ణ వంటి ప్రముఖులతో ఆయన భేటీ కానున్నారు.

Also Read: పసిడి ప్రియులకు షాక్.. ఊహించని రీతిలో పెరిగిన ధరలు.. ఎంతో తెలుసా?

దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా ఒక ఏపీ లాంజ్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ “ఇండియా అట్ ది సెంటర్ ఆఫ్ జియోగ్రఫీ గ్రోత్ – ఏపీ అడ్వాంటేజ్” అనే థీమ్‌తో పెట్టుబడిదారులను ఆకర్షించనున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాలలో ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×