E-Paper
Advertisement

ఫార్చ్యూనర్‌కు చుక్కలే.. రూ.41 వేలకే బుకింగ్స్ షురూ అయిన సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీ!

ఫార్చ్యూనర్‌కు చుక్కలే.. రూ.41 వేలకే బుకింగ్స్ షురూ అయిన సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీ!
Advertisement

MG Majestor: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మొత్తానికి ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఒక అదిరిపోయే లగ్జరీ ఎస్‌యూవీని దించేసింది. లాంగ్ జర్నీలను  ఎంజాయ్ చేయాలనుకునే కార్ల ప్రియుల కోసం ‘ఎంజీ మెజెస్టర్’ పేరుతో తన కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అసలు ఇండియాలోనే మొట్టమొదటి డి+ క్లాస్ ఎస్‌యూవీ ఇదేనంటూ కంపెనీ గట్టిగా చెప్తోంది. దీని లుక్స్, ఫీచర్లు చూస్తే ఎవరైనా సరే ముచ్చటపడాల్సిందే. ఈ రేంజ్ లగ్జరీ అండ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఉన్న ఈ కారు ప్రారంభ ధరను కంపెనీ రూ.40.99 లక్షలుగా ఫిక్స్ చేసింది. లాంచ్ చేయడమే ఆలస్యం.. కంపెనీ బుకింగ్స్‌ను కూడా ఓపెన్ చేసేసింది.

టయోటా ఫార్చ్యూనర్ మార్కెట్‌కు గండి కొట్టడమే టార్గెట్‌

Advertisement

కేవలం రూ.41,000 టోకెన్ అమౌంట్ కట్టేసి ఆన్‌లైన్‌లో గానీ, లేదా నేరుగా షోరూమ్‌కి వెళ్లి గానీ ఈ లగ్జరీ రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ.. ఈ మెజెస్టర్ అనేది కేవలం కారు మాత్రమే కాదని, అద్భుతమైన పర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్ ఫీచర్లు, గట్టి భద్రత కలిసిన ఒక ప్యాకేజీ అని చాలా నమ్మకంగా చెప్పారు. టయోటా ఫార్చ్యూనర్ లాంటి టాప్ కార్ల మార్కెట్‌కు గండి కొట్టడమే టార్గెట్‌గా ఈ మోడల్‌ను రంగంలోకి దించినట్టు క్లియర్ గా అర్థమవుతోంది.

Also read :సిగ్గుతో తలదించుకుందాం.. ఆ దారుణంపై బాలీవుడ్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్

Advertisement

దీని ధర రూ.40.99 లక్షలు

ప్రస్తుతానికి కంపెనీ కేవలం టాప్ ఎండ్ మోడల్‌కు సంబంధించిన రెండు వేరియంట్ల ధరలను మాత్రమే అనౌన్స్ చేసింది, మిగిలిన వేరియంట్ల రేట్లు ముందు ముందు అనౌన్స్ చేయనున్నారు . ఇందులో మొదటిది ఎంజీ మెజెస్టర్ 4×2 ఆటోమేటిక్ వేరియంట్. దీని ధర రూ.40.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. మన అవసరానికి తగ్గట్టుగా దీనిని 6-సీటర్ లేదా 7-సీటర్ ఆప్షన్లలో సొంతం చేసుకోవచ్చు. ఇక ఆఫ్-రోడింగ్ అంటే పడిచచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా తీసుకొచ్చిన మోడల్ ఎంజీ మెజెస్టర్ 4×4 ఆటోమేటిక్ వేరియంట్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.44.99 లక్షలు కాగా, ఇది కేవలం 7-సీటర్ ఆప్షన్‌లో మాత్రమే దొరుకుతుంది.

ఒక చిన్న లెక్క చూసుకుంటే..

ఇంత పెద్ద కారును ఒకేసారి అంత డబ్బు పెట్టి కొనడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి, కంపెనీ అదిరిపోయే ఈఎంఐ ఆప్షన్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఒక చిన్న లెక్క చూసుకుంటే.. రూ.40.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర ఉన్న 4×2 ఆటోమేటిక్ వేరియంట్.. రోడ్డుపైకి వచ్చేసరికి టాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ అన్నీ కలుపుకుని ఆన్-రోడ్ ధర సుమారు రూ.49 లక్షల దాకా అవుతుంది. ఎవరైనా ఒక కస్టమర్ రూ.10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి, మిగిలిన మొత్తాన్ని 10 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలపరిమితికి లోన్ తీసుకుంటే, నెలవారీ ఈఎంఐ సుమారు రూ.80,000 వరకు పడుతుంది. అదే లోన్ టైమ్‌ను 7 సంవత్సరాలకు పెంచుకుంటే నెలకు కట్టాల్సిన భారం తగ్గి ఈఎంఐ సుమారు రూ.64,000 అవుతుంది. అయితే మనం కట్టే డౌన్ పేమెంట్, బ్యాంక్ ఇచ్చే వడ్డీ రేట్లను బట్టి ఈ ఈఎంఐ అమౌంట్ మారుతూ ఉంటుందనేది గుర్తుంచుకోవాలి.

Also read :‘పెద్ది’ పర్సంటేజీ వివాదానికి మెగా ఎండ్ కార్డ్.. చిరంజీవి ఎంట్రీతో సీన్ రివర్స్!

2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌

ఇక ఈ కారు ఇంజిన్ పవర్ విషయానికి వస్తే, రోడ్డు మీద దూసుకెళ్లడానికి ఇందులో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను పెట్టారు. ఇది గరిష్టంగా 215.5 PS పవర్, 478.5 Nm లీటర్ల పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి తోడు అడ్వాన్స్‌డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండటం వల్ల డ్రైవింగ్ చాలా స్మూత్‌గా సాగిపోతుంది. ఈ కారు 2WD తో పాటు అడ్వాన్స్‌డ్ 4WD అనే రెండు డ్రైవ్ ఆప్షన్లలో వస్తోంది. ముఖ్యంగా ఇందులోని 4WD సిస్టమ్‌లో ఏకంగా 10 రకాల ఆఫ్-రోడ్ మోడ్స్ ఇవ్వడం గమనార్హం. ఇది ఎంత స్మార్ట్ అంటే.. ఆటో మోడ్‌లో ఉన్నప్పుడు నార్మల్ రోడ్లపై కేవలం 2WD మోడ్‌లోనే నడుస్తూ మైలేజ్ ఇస్తుంది, అదే రోడ్డు బాలేనప్పుడు లేదా అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా 4WD మోడ్‌లోకి షిఫ్ట్ అయిపోతుంది.

 సెట్ చేసుకునేలా త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ

కారు లోపల అడుగుపెడితే మాత్రం ఒక లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్‌లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ప్రీమియం బ్లాక్ కలర్ థీమ్‌తో ఇంటీరియర్‌ను చాలా క్లాస్‌గా డిజైన్ చేశారు. లాంగ్ జర్నీల్లో కూడా అలసట లేకుండా ప్రయాణించడానికి వెంటిలేటెడ్ అండ్ మసాజ్ ఫీచర్ ఉన్న లగ్జరీ లెదర్ సీట్లు ఇచ్చారు. ఇందులో డ్రైవర్ సీటును 12 రకాలుగా, ప్యాసింజర్ సీటును 8 రకాలుగా మనకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారు పైన పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, మన మూడ్‌కి తగ్గట్టు మార్చుకోవడానికి 64 రంగుల యాంబియంట్ లైటింగ్, కారులో ఎవరికి కావాల్సిన టెంపరేచర్ వారు సెట్ చేసుకునేలా త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉన్నాయి.

Also read :హాస్టల్ లైఫ్ బ్యాక్‌డ్రాప్‌లో క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్.. ఘనంగా ప్రారంభమైన ‘లఫూట్ గ్యాంగ్’!

డ్యాష్‌బోర్డ్‌పై డ్యూయల్ 12.3-ఇంచుల భారీ డిస్‌ప్లేలు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో పాటు ప్రయాణంలో థియేటర్ ఎఫెక్ట్ ఇచ్చేలా 12 జేబీఎల్ స్పీకర్లను అమర్చారు. డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్లు, ల్యాప్‌టాప్ లాంటివి చార్జ్ చేసుకోవడానికి 220V పవర్ అవుట్‌లెట్, ఇంకా ఏకంగా 75కు పైగా ఐస్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అన్నీ ఒకే చోట కావాలంటే ఎంజీ మెజెస్టర్ ఒక బెస్ట్ ఆప్షన్

చివరగా సేఫ్టీ విషయానికి వస్తే కంపెనీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. కారులో అత్యంత సురక్షితమైన లెవెల్-2 అడాస్ టెక్నాలజీని అందించారు. ఇది రోడ్డుపై వెళ్లేటప్పుడు ఆటోమేటిక్ స్టీరింగ్, బ్రేకింగ్, యాక్సిలరేషన్‌లో డ్రైవర్‌కు సాయం చేస్తూ ప్రమాదాలను అడ్డుకుంటుంది. వీటితో పాటు చుట్టుపక్కల అంతా స్పష్టంగా చూడటానికి 360-డిగ్రీ హెచ్‌డీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబీఎస్, ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, కారు బోల్తా పడకుండా చూసే రోల్‌ఓవర్ మిటిగేషన్ లాంటి పటిష్టమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ పెర్ల్ వైట్, కాంక్రీట్ గ్రే, మెటల్ బ్లాక్, మెటల్ యాష్ అనే నాలుగు సూపర్ కలర్ ఆప్షన్లలో దొరకనుంది. లగ్జరీ, పవర్, సేఫ్టీ అన్నీ ఒకే చోట కావాలనుకునే వారికి ఎంజీ మెజెస్టర్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

 

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×