Lafut Gang: LRSఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సరికొత్త కాన్సెప్ట్ తో వినోదాన్ని పంచేందుకు టాలీవుడ్ లో ఒక సరికొత్త చిత్రం ప్రారంభమైంది. కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘లఫూట్ గ్యాంగ్’ అనే క్రేజీ టైటిల్ ను ఫిక్స్ చేశారు. అనురాగ్ అధర్వ రాజు ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ లో ఇటీవల కాలంలో పీరియడ్ కామెడీ డ్రామాలకు, హాస్టల్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారన్న సంగతి తెల్సిందే.
గతంలో వచ్చిన జాతి రత్నాలు, రీసెంట్ గా యూత్ ను ఆకట్టుకున్న హాస్టల్ బాయ్స్ తరహాలోనే ఈ ‘లఫూట్ గ్యాంగ్’ చిత్రం కూడా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక హైదరాబాదులోని ప్రముఖ రామానాయుడు స్టూడియోస్ లో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి.
ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టిన అలీ
ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని, విలక్షణ నిర్మాత బివిఎస్ రవి, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోస్ రాజ్ తరుణ్, ఆకాష్ పూరి, సీనియర్ నటుడు అలీ, యువ నటుడు రాహుల్ విజయ్, నటీమణులు దీప్శిక, అర్చన అయ్యర్, దర్శక నిర్మాత అనిల్ కడియాల తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్ కు తమ బెస్ట్ విషెస్ అందించారు. ముహూర్తపు షాట్ కు సీనియర్ నటుడు అలీ గారు క్లాప్ కొట్టగా, ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను అధికారికంగా ప్రారంభించారు. టాలీవుడ్ క్రేజీ హీరోలు రాజ్ తరుణ్, ఆకాష్ పూరి చేతుల మీదుగా చిత్ర దర్శకుడు, నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేసి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు.
also read :జోయా అఖ్తర్ ఆఫీస్‌లో భారీ చోరీ.. ఏకంగా 66 హార్డ్ డిస్క్‌లు మాయం, కోట్లలో నష్టం!
1990ల నాటి కాలేజీ రోజుల నేపథ్యంలో
ఈ చిత్రంలో రాఖి, రిత్విక్, అభినవ్, నందు, ఆంటోనీ కార్తిక్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. 1990ల నాటి కాలేజీ రోజుల నేపథ్యంలో, ఒక హాస్టల్ లో జరిగే గమ్మత్తైన సంఘటనలని కలగలిపి ఈ సినిమా తెరకెక్కనుంది. అల్లరి చిల్లరిగా తిరిగే ఒక యువకుల గ్యాంగ్ హాస్టల్ లైఫ్ లో ఎలాంటి అల్లరి పనులు చేశారు, వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు తిరిగాయి అనే అంశాలను దర్శకుడు అనురాగ్ అత్యంత ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించబోతున్నారు. 90ల నాటి నాస్టాల్జియాను గుర్తుచేస్తూ సాగే ఈ కథ అటు యూత్ కు, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఒక క్రేజీ ఎంటర్టైన్మెంట్ రైడ్ లా ఉంటుందని చెప్పుకొచ్చారు మేకర్స్.
సరికొత్తగా హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ
చిత్ర దర్శకుడు అనురాగ్ అధర్వ రాజు మాట్లాడుతూ, 1990ల టైం పీరియడ్ లో ఇప్పటివరకు ఎన్నో కథలు వచ్చినప్పటికీ, ఈ హాస్టల్ బ్యాక్ డ్రాప్ స్టోరీ సరికొత్తగా ఉంటుందని, థియేటర్ కి వచ్చే ప్రతి ఒక్కరినీ నవ్విస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. నిర్మాత కొండాపూర్ లక్ష్మికాంత్ రెడ్డి సినిమా ఓపెనింగ్ కి వచ్చి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధృవన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. కథ వినగానే చాలా ఇన్స్ పైరింగ్ గా అనిపించిందని, ఈ సినిమా ఆల్బమ్ తన కెరీర్ లోనే చాలా స్పెషల్ గా నిలిచిపోతుందని, త్వరలోనే పాటలతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తామని చెప్పారు. డీఓపీ వర్ధన్ మయూర్ కొయ్యాడ ఈ చిత్రానికి విజువల్స్ అందిస్తుండగా, థియేటర్ లో అందరూ ఎంజాయ్ చేసేలా కలర్ ఫుల్ గా సినిమా ఉంటుందని అన్నారు.
also read :మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీ ఫిక్స్?ఎంపీ సీటు ఖాయమైనట్లేనా?
జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్
ఈ చిత్రంలో నటిస్తున్న యంగ్ యాక్టర్స్ రాకీ, అభినవ్, ఆంటోనీ కార్తీక్, రిత్విక్, నందులు మాట్లాడుతూ, జాతి రత్నాలు లాంటి క్లీన్ ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లా ఈ సినిమా అందరికీ గుర్తుండిపోతుందని, కొత్త టాలెంట్ తో వస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటేష్ అత్తిలి మాట్లాడుతూ, వచ్చే జూన్ నెలలో ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని, సినిమా షూటింగ్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అభిమానులకు అందజేస్తామని స్పష్టం చేశారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి టిసి ప్రసన్నకుమార్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, శ్రీనివాస్ కంటైపాలెం, రాంబాబు కుశ రైటర్స్ గా పని చేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి డాన్స్ మూవ్స్ అందిస్తుండగా, వినయ్ వర్మ ప్రొడక్షన్ డిజైనర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా 1990ల నాటి హాస్టల్ వాతావరణాన్ని రీక్రియేట్ చేయబోతున్నారు. చిత్రానికి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ బాధ్యతలను చిత్త్రగ్రాహిణి మీడియా చూసుకుంటుండగా, పిఆర్ఓ గా హేమ మాలిని, పబ్లిసిటీ డిజైనర్ గా సంతోష్ చెర్రీ వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్ లో త్వరలోనే షూటింగ్ జరుపుకోబోతున్న ఈ ‘లఫూట్ గ్యాంగ్’ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు, హీరోయిన్ మరియు ఇతర నటీనటులని త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చింది మూవీ టీమ్.
also read :150 మిలియన్ల వ్యూస్.. గ్లోబల్ వైడ్‌గా షేక్ చేస్తున్న ‘ఆయా షేర్’.. నేచురల్ స్టార్ సరికొత్త హిస్టరీ