Oke Okkadu: ఒకే ఒక్కడు … 1999 నవంబర్ 7న శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అర్జున్ చేసిన ఒక్క రోజు సీయం పాత్ర ఎంత పాపులర్ అయిందో అందరికి తెల్సిందే. అయితే ఇపుడు ఈ పాత్రని శంకర్ డిజైన్ చేయడానికి కారణం ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అంటూ సంచలన కామెంట్స్ చేసుకొచ్చాడు నటుడు కిర్రాక్ ఆర్పీ.
క్రేజీ మ్యాటర్ లీక్ చేసిన ఆర్పీ
రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చాలా అట్టహాసంగా జరిగిన సంగతి తెల్సిందే. అధినేత చంద్రబాబు టీడీపీ జెండా ఆవిష్కరించి, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. నారా లోకేష్ తో పాటు పార్టీ ముఖ్య నేతలంతా హాజరైన ఈ వేడుకలో కిర్రాక్ ఆర్పీ కూడా సందడి చేశాడు. అక్కడే మైక్ అందుకుని ఒక క్రేజీ మ్యాటర్ లీక్ చేశాడు.
Also read :సిగ్గుతో తలదించుకుందాం.. ఆ దారుణంపై బాలీవుడ్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్
‘ఒకే ఒక్కడు’కి ఇన్స్పిరేషన్ చంద్రబాబు నాయుడు
“ఈ విషయం ఇప్పటివరకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు కానీ.. అప్పట్లో సంచలనం సృష్టించిన పాన్ ఇండియా సినిమా ‘ఒకే ఒక్కడు’ తీయడానికి ఇన్స్పిరేషన్ నారా చంద్రబాబు నాయుడు గారే! ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. ఇది పక్కా నిజం. ఒక్క రోజు సీఎం అయితే ఏం జరుగుతుందనే పాయింట్ తో ఆ సినిమా తీశారు. తమిళ వాళ్లు మన చంద్రబాబు సార్ విజన్‌ని చూసి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకున్నారు” అంటూ ఆర్పీ చెప్పుకొచ్చాడు. ఆర్పీ ఈ మాటలు చెబుతున్నప్పుడు పక్కనే ఉన్న నారా లోకేష్ ముసిముసి నవ్వులు నవ్వుతూ తలాడించడం విశేషం.
అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమా, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని రూపొందించబడిందని డైరెక్టర్ శంకర్ మరియు నిర్మాతలు కూడా వెల్లడించారు. – కిర్రాక్ ఆర్పీ#DirectorShankar #OkeOkkadu #Arjun #AndhraPradesh #ChiefMinister #ChandrababuNaidu #KirrakRP pic.twitter.com/gWdatw8XgN
— Swetcha Daily News (@SwetchaNews) May 27, 2026
Also read :Big Tv Kissik Talks: కన్నీళ్లు తెప్పిస్తున్న శివ స్టోరీ.. ప్రియాంక జైన్ తో పెళ్లి పై క్లారిటీ…
ఎంతవరకు నిజముందో శంకరే క్లారిటీ ఇవ్వాలి
నిజానికి క్రోనాలజీ చూస్తే.. ‘ఒకే ఒక్కడు’ సినిమా 1999 నవంబర్ 7న రిలీజ్ అయింది. కరెక్ట్ గా అదే టైంలో అంటే 1995 నుండి 1999 వరకు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైటెక్ సీఎంగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో గెలిచి రెండోసారి సీఎం అయ్యారు. శంకర్ కి కూడా సమకాలీన రాజకీయాలపై గ్రిప్ ఎక్కువ కాబట్టి, ఆర్పీ మాటల్లో ఎంతవరకు నిజముందో శంకరే క్లారిటీ ఇవ్వాలి.
ఇంకెన్ని కాంట్రవర్సీలకి దారి తీస్తుందో
ఇక ‘ఒకే ఒక్కడు’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ లోకి వెళ్తే.. ఒక సామాన్య జర్నలిస్ట్ కి ఒక్క రోజు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వస్తే సమాజాన్ని ఎలా మార్చాడు అనేదే కథ. అనిల్ కపూర్ హీరోగా హిందీలో ‘నాయక్’ (2001) పేరుతో కూడా రీమేక్ అయి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఆ రోజుల్లో ఈ సినిమా రిలీజ్ అప్పుడు వేరే వివాదం నడిచింది. ఇందులో సీఎం పాత్రలో నటించిన రఘువరన్ లుక్, హెయిర్ స్టైల్ అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కరుణానిధిని పోలి ఉండటంతో కరుణానిధి అనుచరులు అప్పట్లో రచ్చ చేశారు. థియేటర్ల దగ్గర గొడవలు జరిగాయి. అవన్నీ దాటుకుని వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు ఆర్పీ చేస్తున్న ఈ కామెంట్స్ ఇంకెన్ని కాంట్రవర్సీలకి దారి తీస్తుందో !