E-Paper
Advertisement

MG నుంచి 2 కొత్త SUVలు.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

MG నుంచి 2 కొత్త SUVలు.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!
Advertisement

MG to Launch 2 New SUVs in India: భారత ఆటోమొబైల్ మార్కెట్లో సత్తా చాటేందుకు JSW MG మోటార్ ఇండియా అదిరిపోయే ప్లాన్స్ చేస్తోంది. 2027 నాటికి మొత్తం ఆరు కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ లైనప్‌ లో ముఖ్యంగా రెండు కొత్త SUVలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వాటిలో ఒకటి ప్రీమియం ఫుల్ సైజ్ SUV కాగా, మరొకటి లేటెస్ట్  ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్. ఇవి రెండూ మే, అక్టోబర్ నెలల్లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.

⦿ MG మెజెస్టర్

ఈ కారు ఫుల్ సైజ్ ప్రీమియం SUVగా రూపొందించబడింది. దీని ధర సుమారు రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ధరలో టయోటా ఫార్చ్యూనర్‌, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్ లాంటి కార్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ SUVలో 2.0 లీటర్, నాలుగు సిలిండర్ల ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది సుమారు 215 bhp శక్తిని అందిస్తుంది. హయ్యర్ వేరియంట్లలో 4WD సిస్టమ్ ఉంటుంది. ఇందులో లో రేంజ్ ట్రాన్స్‌ ఫర్ కేస్, డిఫరెంట్ ఆఫ్ రోడ్ మోడ్‌లు, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ లాంటి ఫీచర్లు ఉంటాయి. ఇది 810 మిల్లీమీటర్ల లోతు వరకు నీటిలో  దూసుకెళ్తుంది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా 6, 7 సీటింగ్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

Advertisement

డిజైన్ విషయానికి వస్తే, గ్లోబల్ మోడల్  Maxus D90 ఆధారంగా రూపొందించబడింది. LED లైటింగ్, అల్లాయ్ వీల్స్, బాడీ క్లాడింగ్ లాంటి స్టైలింగ్ ఎలిమెంట్స్ ప్రీమియం లుక్ ఇస్తాయి. 12.3 ఇన్‌ టచ్‌ స్క్రీన్, అదే సైజులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లాస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్, మసాజింగ్ సీట్లు, డ్యూయల్ వైర్‌ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా, ADAS లాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

⦿ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్

ఇక రెండో SUV ప్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్. ఇది చైనా మార్కెట్‌ లో ఉన్న వులింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా రూపొందుతోంది.  ఈ మోడల్‌ తో పాటు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం సుమారు 20.5 kWh ఉంటుంది. ఈ సెటప్‌తో కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే సుమారు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. పెట్రోల్, ఎలక్ట్రిక్ కలిపి మొత్తం రేంజ్ 1000 కిలో మీటర్లకు పైగా ఉండే అవకాశం ఉంది.

Advertisement

ఈ కారు కేవలం 10 సెకెన్లలో 0 నుంచి 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం సుమారు 170 కిలో మీటర్లు ఉంటుంది. కంపెనీ ఈ మోడల్‌కు పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఆ వెర్షన్‌ లో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సుమారు 500 వరకు రేంజ్ ఇస్తుందని తెలుస్తోంది.

Read Also: హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మోడల్స్ పై ఏకంగా రూ. 2.12 లక్షల తగ్గింపు!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×