Tirupati accident: తిరుపతి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని ఊరందురు హైవేపై వేగంగా వెళ్తున్న ఓ అంబులెన్స్, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి అంబులెన్స్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది.
ఈ విషాద ఘటనలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారా లేక రోగి బంధువులా అన్న కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే శ్రీకాళహస్తిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
అతివేగం లేదా తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: విజయ్ ఓటమి పుకార్లు.. గొంతు కోసుకున్న అభిమాని!
ఆగి ఉన్న లారీని ఢీకొన్న అంబులెన్స్.. నలుగురు స్పాట్ లో మృతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఓరందూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
కోల్‌కతా నుంచి ఓ రోగిని చికిత్స నిమిత్తం బెంగళూరు అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఘటన
ప్రమాద సమయంలో అంబులెన్స్‌లో డ్రైవర్‌తో సహా ఆరుగురు
Ambulance… pic.twitter.com/q0gTGel7eN
— BIG TV Breaking News (@bigtvtelugu) May 4, 2026