E-Paper
Advertisement

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!
Advertisement

Top 5 Cute and Practical Micro Cars: దేశ వ్యాప్తంగా నగరాల్లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మైక్రో కార్లకు మంచి ఆదరణ లభిస్తోంది. చిన్న సైజు, తక్కువ మెయింటెనెన్స్  ఖర్చు, ఈజీ డ్రైవింగ్ కారణంగా ఈ వాహనాలు పట్టణ ప్రయాణాలకు మంచి ఆప్షన్ గా మారుతున్నాయి.  దేశంలో ఇప్పటికే ఎంజీ కామెట్ ఈవీ లాంటి మోడళ్లు మంచి స్పందన పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మన మార్కెట్లో కూడా విడుదలైతే మంచి ఆదరణ పొందే అవకాశం ఉన్న ఐదు ఆసక్తికర మైక్రో కార్ల గురించి తెలుసుకుందాం.

1.మైక్రోలినో 2.0

ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ మైక్రోలినో 2.0కు దక్కుతుంది. పాత BMW ఇసెట్టా డిజైన్‌ను గుర్తు చేసే ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకమైన ఫ్రంట్ డోర్‌ తో ఆకట్టుకుంటుంది. ఇద్దరు ప్రయాణికులు కూర్చునేలా రూపొందించిన ఈ కారు నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. సన్‌ రూఫ్, ఎయిర్ కండిషనింగ్ లాంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి. 5.5 kWh, 10.5 kWh, 15 kWh బ్యాటరీ ఆప్షన్స్ తో వచ్చే ఈ కారు గరిష్టంగా 228 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. చిన్న బ్యాటరీ కారణంగా తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జింగ్ పూర్తవుతుంది.

2.విన్‌ఫాస్ట్ VF3

Advertisement

విన్‌ఫాస్ట్ VF3 చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ SUV తరహా డిజైన్‌ లో ఉంటుంది. బాక్సీ లుక్, రౌండ్ హెడ్‌ ల్యాంప్స్ దీనికి స్పెషల్ లుక్ ను అందిస్తాయి. నాలుగు సీట్లు, 10 అంగుళాల టచ్‌ స్క్రీన్, పలు భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 18.4 kWh బ్యాటరీతో పనిచేసే ఈ కారు సుమారు 215 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. భారత్ మొబిలిటీ ఎక్స్‌ పోలో ఇప్పటికే ఈ మోడల్ ప్రదర్శించబడటంతో, భారత మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది.

3.ఫియట్ టోపోలినో- సిట్రోయెన్ అమీ

ఫియట్ టోపోలినో పూర్తిగా సిటీ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన చిన్న ఎలక్ట్రిక్ కారు. క్లాసిక్ ఫియట్ 500 స్టైల్‌ ను గుర్తు చేసే ఈ మోడల్‌ లో పనోరమిక్ గ్లాస్ రూఫ్, స్మార్ట్ క్యాబిన్ లేఔట్, సింపుల్ డ్యాష్‌ బోర్డ్ ఉన్నాయి.  ఇదే ప్లాట్‌ ఫామ్‌ పై రూపొందిన సిట్రోయెన్ అమీ కూడా భిన్నమైన డిజైన్‌ తో ఆకట్టుకుంటుంది. ఈ రెండు మోడళ్లలో 6 kWh బ్యాటరీ ఉండగా, సిటీలో రోజువారీ ప్రయాణాలకు సరిపడే రేంజ్‌ ను అందిస్తాయి.

4.బావోజున్ యెప్

Advertisement

చిన్న SUV రూపంలో కనిపించే బావోజున్ యెప్ కూడా క్రేజీ ఆప్షన్. ఎంజీ కామెట్ ఈవీకి సంబంధించిన ప్లాట్‌ ఫారమ్‌ పైనే రూపొందిన ఈ మోడల్‌ లో ఆధునిక ఇంటీరియర్, డ్యూయల్ స్క్రీన్ సెటప్, డిజిటల్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 28.1 kWh బ్యాటరీతో పనిచేసే ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 303 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ లిస్టులో ఎక్కువ రేంజ్ కలిగిన కార్లలో ఇది ఒకటి.

5.వులింగ్ హాంగ్‌గ్వాంగ్ మినీ EV

ఈ జాబితాలో నాలుగు డోర్లు కలిగిన ఏకైక మోడల్ వులింగ్ హాంగ్‌ గ్వాంగ్ మినీ EV. చిన్న కుటుంబాలకు అనువుగా రూపొందించిన ఈ కారులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్, రియర్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 16.2 kWh బ్యాటరీతో వచ్చే ఈ కారు సుమారు 205 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Read Also: 25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×