E-Paper
Advertisement

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌
Advertisement

Sunil Gavaskar:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య లార్డ్స్ ( Lord’s, London) వేదిక చివరి వన్డే జరుగుతోంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన రెండు జట్లు… సిరీస్ పై కన్నేశాయి. అయితే ఈ కీలక మ్యాచ్ లో టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టిన బుమ్రా గాయం బారిన పడ్డాడు. దాదాపు 900 రోజుల పాటు వన్డేలకు దూరమైన బుమ్రా (Jasprit Bumrah )… ఇంగ్లాండ్ తో రెండు వన్డేలు ఆడిన తర్వాత గాయం బారిన పడడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) సీరియస్ అయ్యారు. రెండు మ్యాచ్ ల‌కే గాయం (Jasprit Bumrah Injury ) బారిన పడితే… 2027 వన్డే వరల్డ్ కప్ ఎలా ? గెలుస్తామని బుమ్రా పరువు తీశారు. ఇలా ప్రతిదానికి గాయపడితే కష్టమేనన్నారు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

అస‌లు బుమ్రాకు ఏమైంది ?

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా మూడో వ‌న్డే జరుగుతున్న నేపథ్యంలో డేంజర్ బౌలర్ బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. నిన్న ప్రాక్టీస్ చేస్తుండగా బుమ్రా మోకాలికి గాయమైంది. ఈ క్రమంలో మూడవ వన్డేకు ఆయన దూరమయ్యాడు. దీంతో అత‌ని స్థానంలో ప్రిన్స్ యాద‌వ్ ను తీసుకున్నారు. దీనిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. బుమ్రా కెరీర్ లో ఎక్కువ శాతం గాయాలే ఉన్నాయని బాంబు పేల్చాడు. వన్డే వరల్డ్ కప్ వస్తున్న నేపథ్యంలో బుమ్రాకు గాయం కావడం టీమిండియా కు ఎదురుదెబ్బ అంటూ వ్యాఖ్యానించారు. ఇంగ్లాండ్ పై ఆడింది రెండు మ్యాచ్లే… అంతలోనే గాయం అయితే ఎలా ? అంటూ నిలదీశారు. రెండు మ్యాచ్ ల‌కు గాయం బారిన పడే బుమ్రాను తీసుకువెళ్లి, వరల్డ్ కప్ కొట్టలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు సునీల్ గవాస్కర్. దీనిపై టీమిండియా సెలక్షన్ కమిటీ అలాగే బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

968 రోజుల తర్వాత వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా

2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ నవంబర్ 19వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీమిండియా జట్టు తరుపున బరిలోకి దిగాడు బుమ్రా. ఆ తర్వాత వర్క్ లోడ్ ఎక్కువైందని వన్డేల నుంచి బుమ్రాను తప్పించారు. ఇక గంభీర్ తీసుకున్న చెత్త నిర్ణయాల వల్ల 968 రోజుల దాకా వన్డేల్లో అవకాశం రాలేదు. ఇక మొన్న ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ నేపథ్యంలో బుమ్రాను సెలెక్ట్ చేశారు. 968 రోజుల తర్వాత అవకాశం దక్కించుకున్న బుమ్రా అద్భుతంగానే రాణించాడు. కానీ ఇంతలోనే బుమ్రాకు గాయం అయింది.

Advertisement

Also Read: Ms Dhoni Ruling Team India: ధోని లేక సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×