E-Paper
Advertisement

మీ కారు మీపై నిఘా పెడుతోందా? డ్రైవర్లు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

మీ కారు మీపై నిఘా పెడుతోందా? డ్రైవర్లు ఈ నిజాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Smart Cars and Privacy Risks: ఒకప్పుడు కారు అనేది ప్రయాణానికి ఉపయోగించే వెహికల్ మాత్రమే. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లేటెస్ట్ కార్లు కేవలం రోడ్లపై నడిచే యంత్రాలు కాదు.. స్మార్ట్ టెక్నాలజీతో నిండిన కంప్యూటర్లుగా మారిపోయాయి. ఈ సౌకర్యాల వెనుక కొన్ని షాకింగ్ థ్రెట్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం..

ప్రతి విషయం రికార్డు

ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న చాలా కార్లలో జీపీఎస్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కెమెరాలు, సెన్సార్లు, బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్స్ లాంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మెరుగుపరుస్తాయి. అయితే, అదే సమయంలో మీ గురించి పలు వివరాలను రికార్డు చేస్తుంటాయి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ మార్గంలో ప్రయాణిస్తున్నారు? ఎంత వేగంగా డ్రైవ్ చేస్తున్నారు? తరచూ వెళ్లే ప్రదేశాలు ఏంటి? లాంటి వివరాలు కారులోని సిస్టమ్‌ల ద్వారా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. ఫోన్‌ ను కారుతో కనెక్ట్ చేస్తే కాంటాక్ట్‌ లు, కాల్ హిస్టరీ, కొన్ని సందర్భాల్లో ఇతర వ్యక్తిగత వివరాలు కూడా స్టోర్ అవుతాయి.

కొన్ని లేటెస్ట్ కార్లలో డ్రైవర్‌ ను పర్యవేక్షించే కెమెరాలు కూడా ఉంటాయి. ఇవి డ్రైవర్ అలసట, ఏకాగ్రత లేకపోవడం లాంటి విషయాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి. అయితే భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుంది?

కారు సేకరించిన ఈ సమాచారం ఎక్కడికి వెళ్తుంది? అనే ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. సాధారణంగా ఈ డేటా వెహికల్ తయారీ సంస్థల సర్వర్లలో స్టోర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ సంస్థలు, డేటా రీసెర్చ్ సంస్థలు,  ఇతర భాగస్వాములతో కూడా పంచుకునే అవకాశం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ప్రైవసీ ఎలా కాపాడుకోవాలి?

అయితే డ్రైవర్లు తమ గోప్యతను కొంతవరకు కాపాడుకోవచ్చు. నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.

⦿ కొత్త కారు కొనుగోలు చేసే ముందు ఆ వాహనం ఏ రకమైన డేటాను సేకరిస్తుందో తెలుసుకోవాలి.

⦿ తయారీ సంస్థ గోప్యతా విధానాలను పరిశీలించడం మంచిది. గతంలో డేటా లీక్‌లు, గోప్యతా వివాదాలు ఉన్నాయా? అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి.

⦿ కారు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ లో ఉన్న డేటా షేరింగ్ సెట్టింగ్‌ లను పరిశీలించాలి. అవసరం లేని పర్మిషన్స్ ను ఆఫ్ చేయడం ద్వారా కొంత డేటా కలెక్షన్ ను తగ్గించవచ్చు.

⦿ రూల్స్, కండీషన్స్ చదవకుండా యాక్సెప్ట్ చేయకూడదు. కనీసం డేటా వినియోగానికి సంబంధించిన వివరాలను  పరిశీలించాలి.

⦿ మీ గురించి కంపెనీ దగ్గర ఏ సమాచారం ఉందో తెలుసుకోవాలంటే ప్రైవసీ రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే డేటా క్లియర్ చేయాలని కోరవచ్చు.

ఈ రోజుల్లో టెక్నాలజీ వల్ల సౌకర్యాలు పెరిగినా, గోప్యతను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమైంది. అందుకే స్మార్ట్ కార్లను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సమాచారం ఎలా ఉపయోగించబడుతుందో తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Read Also: హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటా, సియెర్రాకు పోటీ తప్పదా?

Related News

నో పొల్యూషన్ సర్టిఫికేట్.. నో పెట్రోల్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

వాగన్ ఆర్ మాత్రమే కాదు.. భారత్‌లోకి రానున్న 5 ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు ఇవే!

హోండా 0 ఆల్ఫా ఎలక్ట్రిక్ SUV లాంచ్ డేట్ ఫిక్స్.. క్రెటా, సియెర్రాకు పోటీ తప్పదా?

టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 వచ్చేసింది.. కొత్తగా ఏమేం మారాయంటే?

భారత్‌ లో గ్రీన్ SM ఎలక్ట్రిక్ క్యాబ్ సర్వీసులు షురూ.. ఓలా, ఉబర్‌ కు ఇక చుక్కలే!

తలకిందులుగా వేలాడితే ఫ్రీ బైక్.. వైరల్ అవుతున్న షోరూమ్ ఛాలెంజ్!

కొత్త కారు కంటే పాత SUVలకే ఎక్కువ క్రేజ్.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్!

Big Stories

×