E-Paper
Advertisement

అమెరికా టారిఫ్‌లు విధించినా తగ్గేదేలే.. ఆక్వా ఎగుమతుల్లో ఏపీ సరికొత్త రికార్డు!

అమెరికా టారిఫ్‌లు విధించినా తగ్గేదేలే.. ఆక్వా ఎగుమతుల్లో ఏపీ సరికొత్త రికార్డు!
Advertisement

CM Chandrababu: విశాఖపట్నం వేదికగా ఆక్వా రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రుల ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీలో ఆక్వా రంగానికి ఉన్న ప్రాధాన్యతను, భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు.

సంక్షోభం నుంచి అవకాశాల వైపు..

Advertisement

అంతర్జాతీయంగా అమెరికా టారిఫ్‌లు విధించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆక్వా రంగంలో సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. గత ఏడాది కంటే మిన్నగా కొత్త అంతర్జాతీయ మార్కెట్లకు భారత ఆక్వా ఎగుమతులు విస్తరించాయని, ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే సింహభాగమని ఆయన గర్వంగా ప్రకటించారు.

బ్లూ ఎకానమీ – మత్స్యకారుల సంక్షేమం

Advertisement

వ్యవసాయం తర్వాత ఆక్వానే అత్యంత పెద్ద పరిశ్రమగా అవతరించిందని, ‘లూ ఎకానమీ’ద్వారా రాబోయే రోజుల్లో పెద్ద ఆర్థిక విప్లవం రాబోతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని చెప్పారు. మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు 200 ఆధునిక (మోడ్రనైజ్డ్) బోట్లను ఏపీకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.

సాంకేతికత, ప్రాసెసింగ్ పెరగాలి

ప్రస్తుతం ఆక్వా ఉత్పత్తుల్లో కేవలం 12 శాతం మాత్రమే ప్రాసెసింగ్ జరుగుతోందని, సీ-ఫుడ్ ప్రాసెసింగ్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో ప్రొటీన్ ఆహారానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. ఆక్వా రంగంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్లకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు.

సవాళ్లు – కేంద్రానికి విజ్ఞప్తులు

ఆక్వా రైతులకు రూ.1.50లకే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని చెప్తూనే, ప్రస్తుతం పెరిగిపోయిన ఫిష్ ఫీడ్ ధరలపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఫిష్ మీల్ ఎగుమతులను 50 శాతానికి పరిమితం చేయాలని, సోయా విషయంలోనూ కేంద్రం సహకరించాలని కోరారు. అలాగే ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు (FTA) వేగవంతం కావాలన్నారు.

కృతజ్ఞతలు.. భవిష్యత్ హామీలు

కాకినాడ ఫిషింగ్ హార్బర్ కోసం రూ.72 కోట్లు కేటాయించినందుకు, భీమవరంలో బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్‌ను నోటిఫై చేసినందుకు కేంద్ర మంత్రికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కాకినాడ పోర్ట్ ఆధునీకరణను ప్రకటిస్తామని, ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ప్రాంతీయ కార్యాలయానికి 15 రోజుల్లో భూమి కేటాయిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల పుణ్యమా అని ఏపీ ఆక్వాలో దూసుకుపోతోందని, ప్రపంచంలోని ప్రతి కిచెన్‌లోకి ఇండియన్ ఆక్వా ఉత్పత్తులు వెళ్లడమే తమ లక్ష్యమన్నారు.

Also Read: మిర్యాలగూడలో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి!

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×