Podarillu Today Episode December 22nd : మీ అమ్మగారికి నచ్చినవే కొనాలి కదా నేనెందుకు ఇంకా అక్కడ మీ అమ్మకు ఉంటేనే సరిపోతుంది కదా అని మహా కౌంటర్ ఇస్తుంది.. మహా ఏంటి అలా మాట్లాడుతున్నావు రా వచ్చి చీరలు చూడు అనేసి అది అడుగుతాడు.. ఇక మహా ఆది బలవంతం చేయడంతో అక్కడికి వచ్చి చీరలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అటు మాధవ్ ఈ పెళ్లి సంబంధం చెడిపోయిందని బాధపడుతూ ఉంటాడు. నువ్వేం బాధపడకు అన్నయ్య నీకు ఇలాంటివి మంచి సంబంధం కూడా వస్తుంది. మాధవ్ నేనేమీ బాధపడడం లేదు.. కన్నాకి ఈ విషయం తెలిస్తే వాడు ఎక్కడ బాధపడతాడు అని అనుకుంటున్నాను అని మాధవ్ అంటాడు. గాయత్రి మాత్రం ఈ సంబంధం చెడిపోయిందని చాలా సంతోషంగా ఉంటుంది. అటు తాయారు సంబంధం గురించి తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది. నా శాపం ఊరికి పోదు వాళ్లకి జన్మలో పెళ్లి కాదు అలానే ఉంటారు అని అనుకుంటుంది.. లేకుంటే ఆ నారాయణ నా మాటనే కాదంటాడా నాకు ఆస్తులు వాటా ఇవ్వనంటాడా ఇప్పుడు ఎలా ఇవ్వడం నేను చూస్తాను.. ఆ ఇంటిని చూస్తే ఎవ్వరు కూడా పిల్లనివ్వడానికి ముందుకు రారు.. ఇక నారాయణ పిల్లలకి పెళ్లిళ్లు కావు అని అనుకుంటుంది.. మాధవ్ పెళ్లి సంబంధం చెడిపోయిందానికి ఇంట్లోనే వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చక్రి ఎలాగైనా సరే మహా మనసులో చోటు సంపాదించాలని అక్కడున్న షర్ట్లు అన్నిటిని ట్రై చేస్తూ ఉంటాడు. మహా మాత్రం అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పెద్దగా పట్టించుకోదు. ఏంటి కనీసం చూడను కూడా చూడలేదు అని అనుకుంటాడు. ఇక అక్కడున్న భూషణ్ వాళ్ళ అమ్మ అన్ని చీరలు చూస్తుంది. కానీ అక్కడ ఉన్న రెడ్ కలర్ సారీ అతను చూపించమని ఏ కలర్ అయినా చూపించండి ఈ రెడ్ కలర్ మాత్రం చూపించకండి అని అంటుంది. అవునా రెడ్ కలర్ ఇప్పుడు చూడు వీడ్ని ఆడుకుంటాను అని మహా అంటుంది. రెడ్ కలర్ సారీ చాలా బాగుంది అని అంటుంది.
రెడ్ కలర్ అంటే మా వాడికి ఇష్టం లేదమ్మా అందుకే నేను యెల్లో కలర్ సెలెక్ట్ చేసానని భూషణ్ వాళ్ళమ్మ అంటుంది. కానీ మహా మాత్రం నాకు రెడ్ కలర్ చాలా బాగా నచ్చింది తీసుకుంటే దీన్ని తీసుకోండి.. లేకపోతే ఈ చీరలు వద్దు వెళ్ళిపోదాం పదండి అని అంటుంది. ఏంటమ్మా షాపింగ్ ఇంకా ఎంతసేపు అని భూషణ్ అడుగుతాడు. రాబోయే భార్యకు నీకు నచ్చని కలరే నచ్చింది రా నేను ఎన్ని కళ్ళలో సెట్ చేసినా తనకి నచ్చలేదు. రెడ్ కలర్ అంటే నీకు ఇష్టం లేదు కదా తనకు మాత్రం అదే నచ్చింది. నేను చెప్తున్న కూడా తను వినట్లేదు అని అంటుంది. అయితే మీకు ఒక చీర నచ్చింది. తనకు ఒక చీర నచ్చింది. కట్టుకునేది నువ్వు కాదు కదా అమ్మ తన ఇష్టం అని అంటాడు. ఆ మాట వినగానే ఆహా షాక్ అవుతుంది.
ఇక మాధవ్ బిల్డింగ్ కి ప్లాస్టింగ్ చేస్తూ ఉంటాడు. అక్కడ వర్క్ అవ్వగానే తినడానికి అందరూ కూర్చుంటారు. కానీ అక్కడున్న వాళ్ళందరూ పెళ్లి సంబంధానికి వెళ్లారు కదా అన్న ఏమైంది అని అడుగుతారు. కానీ ఆ విషయం గురించి చెప్పకుండా దాచడానికి మాధవ్ బిల్డింగ్ గురించి మాట్లాడుతాడు. ఏమైందో చెప్పన్నా అని వాళ్ళు అడుగుతారు. నా గురించి బురద చల్లే వాళ్ళు చాలామంది ఉంటారు కదరా.. అలానే ఈ పెళ్లి కూడా చెడిపోయింది అని మాధవ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు చాలా మంచి వాడివి అన్న నీకు పిల్లనివ్వకపోవడానికి వాళ్ళు బాధపడాలి నువ్వు ఎందుకు బాధపడుతున్నావని ఓదారుస్తారు. ఇప్పుడే ఒక అబ్బాయి వచ్చి మీ నాన్న ఆ తాయారు ఇంటికి గొడవకి వెళ్లారు. నువ్వు రా అన్నా నువ్వు వచ్చి అక్కడ నాకు అని చెప్తాడు.
మాట వినగానే మాధవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. నారాయణ నా కొడుకు పెళ్లి చెడగొట్టడానికి మీరు ఎవర్రా.. నా భార్య ఎలా చనిపోయిందో మీకు తెలుసా అని వాళ్ళ అన్నతో నువ్వు తాయారుతోనే గొడవపడతారు. కానీ మాధవ వచ్చి ఆ గొడవని ఆపుతాడు. అయితే మాధవ్ మాట విని నారాయణక్కరించి వెళ్లిపోతాడు. ఇక మహా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే హారిక నిన్నటి వరకు అతని గురించి నేను ఏదో అనుకున్నాను. కానీ చీర సెలెక్ట్ చేసిన తర్వాత అతని క్యారెక్టర్ గురించి నేను నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను అని హారిక అంటుంది. అయితే నువ్వు అతని గురించి ఆలోచించడం మానేసి ఈ పెళ్లి అతనితోనే జరుగుతుందని ఫిక్స్ అయిపో.. కానీ నువ్వు నీ గోల్ గురించి అతనితో చెప్పు నీ జాబ్ గురించి అతనితో మాట్లాడు అతని ఏమంటారు చూడు అని హారిక సలహా ఇస్తుంది.
ఆది దగ్గరికి వస్తాడు చక్రి.. టిఫిన్ చేశారా అని అడుగుతాడు ఆది.. చేశాను సార్ అని చక్రి అంటాడు.. ఆ తర్వాత సార్ ఇంట్లో నిన్నటి నుంచి చూస్తున్నాను పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఎవరి పెళ్లి సార్ అని అడుగుతాడు. మా చెల్లెలు పెళ్లి అండి అని ఆది చెప్తాడు అప్పుడు అక్కడికి వచ్చిన హారికతో కంగ్రాజులేషన్స్ అన్ని మీ పెళ్ళంట కదా అని చక్రి అంటాడు. మెడలో తాళి నుదుటున సింధూరం చూస్తే నాకు పెళ్లయింది అని కనిపించట్లేదా అని హారిక అంటుంది.. నా చెల్లెలు మహా ఈఎంఐ ఈమెకే పెళ్లి అని అనగానే చక్రి షాక్ అయిపోతాడు.. నా ఆశలన్నీ ఆవిరి అయిపోయాయి ఈ జుట్టు పోలిగాడితో ఆ అమ్మాయి పెళ్లా అని చక్రి బాధపడుతూ ఉంటాడు.
ఇక మహా భూషణ్ తో మాట్లాడాలని అనుకుంటుందని ఆదితో హారిక అంటుంది.. మహా భూషణ్ ని బయటికి పంపిస్తే వీళ్లిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అని హారిక అంటుంది. భూషణ్ దగ్గరికి వెళ్లి చక్రి హారిక ఇద్దరు కూడా ఈ విషయం గురించి మాట్లాడతారు. అతనికి భూషణ్ ప్రశ్నలతో విసిగించి మరి ఒప్పుకుంటాడు.. మహా భూషణ్ ఇద్దరు కలిసి బయటికి వెళ్లేందుకు చక్రిని కారు తీయమని అంటారు. ఇక ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకోవాలని అనుకుంటారు. చక్రి వీడికి ఎలాగైనా సరే ఈ అమ్మాయి అనుకుంటాడు.. మహా తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ భూషణ్ మాత్రం తాను చెప్పిందే వినాలని కండిషన్స్ పెడుతూ వస్తాడు..
Also Read : శ్రీవల్లిని ఇరికించేందుకు ప్లాన్..వల్లి కొత్త నాటకం.. పరుగులు పెట్టిన భాగ్యం..
కానీ మహా తన జాబ్ గురించి డ్రీమ్ గురించి భూషణ్తో చెప్తుంది. పిల్లలు కనాలానే ఉద్దేశం మీకు లేదా అని భూషణ్ అంటారు. నాకు ఇప్పుడు 23 ఏళ్లు కదా పిల్లల కన్నడానికి ఇంకొద్ది రోజులు గ్యాప్ తీసుకుంటాను అని మహా అడుగుతుంది. నాకు జాబ్ చేయాలనిపిస్తుంది నేను కొద్ది రోజులు జాబ్ చేస్తాను అని మహా భూషణ్ ని అడుగుతుంది.. ఆ మాట వినగానే భూషణ్ నువ్వు జాబ్ కి వెళ్తే నేను చెక్కభజన చేయాలని సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..