E-Paper
Advertisement

Chiranjeevi Fan: ఆస్తి అమ్మి ఆగమైన అభిమాని ..బాస్ భరోసా కోసం ఎదురుచూపులు

Chiranjeevi Fan: ఆస్తి అమ్మి ఆగమైన అభిమాని ..బాస్ భరోసా కోసం ఎదురుచూపులు
Advertisement

Chiranjeevi Fan: సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. ఇలా తమ అభిమాన హీరోల కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి పుట్టినరోజు వేడుకలు, లేదంటే వారి సినిమాలు విడుదలవుతున్న సమయంలో ఫ్లెక్సీలు కట్టడానికి, సెలబ్రేషన్స్ చేయడానికి అభిమానులు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా కొంత మంది అభిమానులు తమ అభిమాన హీరోల కోసం ఆస్తులు అమ్మిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కోసం కోట్ల రూపాయలు కోల్పోయాను అంటూ ఓ అభిమాని గత కొంతకాలంగా నిరాహార దీక్ష చేస్తున్నారు.

రూ. 3 కోట్లు ఖర్చు…

చిరంజీవి అంటే ఎంతో అభిమానం ఉన్న భట్టు బాలాజీ(Bhattu Balaji) అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవికి వీరాభిమానినని తెలిపారు. ఈయన చిరంజీవి యూత్ అసోసియేషన్ రిజిస్టర్ నెంబర్ 352.2002 ను స్థాపించారు. ఇలా అసోసియేషన్ కోసం అలాగే పార్టీ కోసం తాను రెండు ఎకరాల పొలం అమ్ముకున్నానని అలాగే మూడు కోట్ల రూపాయల ఖర్చు కూడా చేశానని తాజాగా బాలాజీ తన గోడు మొత్తం బయటపెట్టారు. ఇలా చిరంజీవి కోసం ఆస్తులు అమ్మడంతో ఈ విషయం చిరంజీవి దృష్టికి తీసుకెళ్తే ఆయన నన్ను ఆదుకుంటానని హామీ ఇచ్చారు కానీ, ఇప్పటివరకు హామీని నిలబెట్టుకోలేకపోయారని బాలాజీ ఎమోషనల్ అయ్యారు.

ఐదు సంవత్సరాలుగా నిరాహార దీక్ష..

Advertisement

ఇలా తన అభిమాన హీరో కోసం ఆస్తులు అమ్ముకొని నాకు న్యాయం చేయమని కోరినప్పటికీ బాలాజీకి న్యాయం జరగని నేపథ్యంలో ఈయన నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్ష చేపట్టి కూడా దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది. ఈయన అక్టోబర్ 10 2020 వ సంవత్సరం నుంచి దీక్ష చేస్తున్న ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదు అంటూ తన బాధను మొత్తం బయటపెట్టారు. ఇప్పటికైనా చిరంజీవి ఈ ఘటనపై స్పందించి తన అభిమానికి అండగా నిలుస్తారా? లేదా ?అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయంపై మెగా అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మెగా అండ దొరికేనా..

Advertisement

ఇక మెగాస్టార్ చిరంజీవి ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు చేశారు అయితే బాలాజీ విషయం బహుశా మర్చిపోయి ఉంటారా లేదంటే ఆయన దృష్టికి వెళ్లలేదా? అనేది తెలియదు కానీ ఒకవేళ తెలిసి ఉంటే కచ్చితంగా చిరంజీవి అండగా నిలుస్తారని అభిమానులకు భావిస్తున్నారు. మరి బాలాజీకి మెగా అండ లభించేనా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈయన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కానుంది.

Also Read; Mowgli OTT: మోగ్లీ ఓటీటీలోకి వచ్చేసింది… మూడు వారాలు కూడా కాలేదు అప్పుడే

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×