E-Paper
Advertisement

నర్సింగ్ అభ్యర్థుల ఉద్యోగ నియామక పత్రాల పై బిగ్ అప్డేట్!

నర్సింగ్ అభ్యర్థుల ఉద్యోగ నియామక పత్రాల పై బిగ్ అప్డేట్!

Nursing Recruitment: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలోని నర్సింగ్ అభ్యర్థుల పదేళ్ల నిరీక్షణకు తెరపడుతుందని ఆశించినా, ప్రస్తుత పరిణామాలు వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం భారీ బహిరంగ సభ ద్వారా నియామక పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, గడువు సమీపిస్తున్నా ప్రక్రియలో కదలిక లేకపోవడంపై అభ్యర్థులు “అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందుతాయా? లేదా?” అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ కూడా నిర్లక్ష్యం గా ఉన్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

​ఏ జిల్లా వారు ఎక్కడికి రావాలి?

​సాధారణంగా భారీ స్థాయిలో నియామక పత్రాలు అందజేసేటప్పుడు, కనీసం మూడు నాలుగు రోజుల ముందే అభ్యర్థులకు సమాచారం అందుతుంది. కానీ, ఇప్పటివరకు సెలక్షన్ లిస్ట్ అభ్యర్థులకు ఎటువంటి అధికారిక ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ సమాచారం రాలేదనీ అభ్యర్ధులు చెబుతున్నారు. ఇక ​ఏ జిల్లా వారు ఎక్కడికి రావాలి? రిపోర్టింగ్ సమయం ఏమిటి? అనే అంశాలపై వైద్యారోగ్య నుంచి అవగాహన చర్యలు శూన్యం.​ వెబ్ సైట్ లో సైతం కనీసం తుది మార్గదర్శకాలపై స్పష్టత కరువైంది.

​విభాగాధిపతుల్లోనూ అదే అయోమయం..

ఇక ​కేవలం అభ్యర్థులే కాదు, నియామక ప్రక్రియను పర్యవేక్షించాల్సిన వైద్య విభాగాధిపతులకు కూడా ప్రభుత్వం నుంచి సరైన మార్గదర్శకాలు అందలేదని తెలుస్తోంది. అపాయింట్ మెంట్ లు ఎప్పుడూ ఇవ్వాలి? ఏ ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహించాలి ?పోస్టింగ్స్ ఎక్కడ ఇవ్వాలి ?అనే అంశాలపై క్లారిటీ లేకపోవడంతో వారు కూడా చేతులెత్తేస్తున్నారు. “పై నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఏమీ చెప్పలేం” అన్న ధోరణిలో అధికారులు ఉన్నట్లు సమాచారం.

Also Read: విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. భస్మమైన ప్లాస్టిక్ గోదాం.. పొగతో ఉక్కిరిబిక్కిరైన జనం

తమ జీవితాలతో చెలగాటమా?

​ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు, నోటిఫికేషన్ల జాప్యంతో విసిగిపోయిన నర్సింగ్ అభ్యర్థులు ఇప్పుడు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.​మే 12న ఉద్యోగ పత్రాలు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మౌనంగా ఉండటం సరికాదనీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలక్షన్ లిస్ట్ లో ఉన్నవారికి సమాచారం ఇచ్చి ఉంటే ఊరట కలిగేదని వెల్లడిస్తున్నారు.ఇతర జిల్లాల నుండి వచ్చే అభ్యర్థులు ప్రయాణ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి? అని ఒక నర్సింగ్ అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేశారు.

సర్కార్ చిత్త శుద్ధి ఏదీ..?

సమయం తక్కువగా ఉన్నా.. ఇంకా మెసేజ్ లు ఎందుకు పంపలేదు? ​ప్రభుత్వ ప్రకటన కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా?​వైద్య ఆరోగ్య శాఖలో సమన్వయ లోపం ఎవరిది? అని నర్సింగ్ ఆఫీసర్స్ మండి పడ్డారు. మరో వైపు జనరల్ ట్రాన్స్ఫర్స్ జీవో సమయం లో అపాయింట్ మెంట్ ప్రాసెస్ చేయకూడదనే చర్చ కూడా వైద్యారోగ్యలో ఉన్నది.నర్సింగ్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్న వేలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లకుండా, ప్రభుత్వం వెంటనే స్పందించాలనీ నర్సింగ్ అభ్యర్ధులు స్పష్టం చేశారు.మే 12న నియామక పత్రాల పంపిణీపై స్పష్టమైన ప్రకటన విడుదల చేసి, అభ్యర్థుల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నదని అధికారులు కూడా చెబుతున్నారు.

Also Read: పటాన్‌చెరులో ఒక్కసారిగా పేలిన సిలిండర్.. భారీగా ఎగసిపడ్డ మంటలు!

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×