E-Paper
Advertisement

నయా కలర్స్, సూపర్ టైర్స్.. కొత్త బైక్ ఏముంది భయ్యా!

నయా కలర్స్, సూపర్ టైర్స్.. కొత్త బైక్ ఏముంది భయ్యా!
Advertisement

2026 New Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త బైక్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. అభిమానులను ఆకట్టుకునేలా కొన్ని ముఖ్యమైన మార్పులతో గెరిల్లా 450 బైక్ ను విడుదల చేసింది.  రూ. 2.49 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ బైక్, స్టైలిష్ డిజైన్‌ తో పాటు మెరుగైన పనితీరును అందించబోతోంది. నియో రెట్రో రోడ్‌ స్టర్ సెగ్మెంట్‌ లో మరింతగా సత్తా చాటబోతోంది.

స్పెషల్ అట్రాక్షన్ గా  అపెక్స్ వేరియంట్

ఈ కొత్త మోడల్‌ లో అపెక్స్ అనే కొత్త వేరియంట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ వెర్షన్‌ లో హ్యాండిల్‌ బార్‌ ను కొంచెం కిందకు మార్చడం వల్ల రైడింగ్ పొజిషన్ మరింత స్పోర్టీగా మారింది. దీని డిజైన్ కూడా కాస్త అగ్రెసివ్ గా ఉంటుంది. కొత్త కలర్ స్కీమ్స్, చిన్న హెడ్‌ ల్యాంప్ వైజర్, స్పోర్టీ సీట్ కౌల్ లాంటి అంశాలు ఈ బైక్‌ కు ప్రత్యేకమైన లుక్‌ ను ఇస్తాయి. వ్రెడెస్టీన్ సెంటురో టైర్లు ఈ వేరియంట్‌ లో ఉపయోగించడం వల్ల మలుపుల్లో మంచి గ్రిప్ ను అందిస్తాయి.

మరింత అప్ డేట్ చేసిన టైర్లు..  

Advertisement

సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 టైర్ల విషయానికి వస్తే, స్టాండర్డ్ వేరియంట్లలో CEAT గ్రిప్ XL RE టైర్లు కొనసాగుతున్నాయి. అయితే, వాటిని మరింత మెరుగైన గ్రిప్ కోసం సాఫ్ట్ కాంపౌండ్‌ తో అప్‌ డేట్ చేశారు. ఈ మార్పుల వల్ల తడి, పొడి రోడ్లపై బైక్ మరింత స్టేబుల్ గా నడుస్తుందని కంపెనీ వెల్లడించింది. రైడర్‌ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని అందించడంలో ఈ టైర్లు సాయపడుతాయి.

మరింత ఆకట్టుకునేలా కొత్త కలర్స్

ఇక కొత్త కలర్ ఆప్షన్స్ కూడా ఈ బైక్‌ ను మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తున్నాయి. అపెక్స్ వేరియంట్‌ లో రెడ్, బ్లాక్, గ్రీన్ లాంటి కొత్త కలర్స్ అందుబాటులో ఉన్నాయి. డాష్ వేరియంట్‌ లో ట్వైలైట్ బ్లూ అనే కొత్త కలర్ ను యాడ్ చేశారు. ఈ కొత్త కలర్స్ వల్ల బైక్‌ కు ఫ్రెష్ లుక్ వచ్చిందని చెప్పొచ్చు.

ఇంజిన్ లోనూ కీలక అప్ డేట్స్..

Advertisement

ఇంజన్ పనితీరులో కూడా చిన్న చిన్న మార్పులు చేశారు. ముఖ్యంగా థ్రాటిల్ మ్యాపింగ్‌ ను అప్ డేట్ చేయడం వల్ల రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ మరింతగా మెరుగుపడింది. స్ట్రీట్ మోడ్‌ లో థ్రాటిల్ రియాక్షన్ స్మూత్‌ గా ఉండగా, స్పోర్ట్ మోడ్‌లో పవర్ మరింత బలంగా అనిపిస్తుంది. ముందు ఉన్న జర్కీనెస్ సమస్యను చాలా వరకు తగ్గించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బైక్‌లో మోడ్ రిటెన్షన్ ఫీచర్ కూడా ఉంది. అంటే, బైక్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మీరు సెలెక్ట్ చేసిన రైడ్ మోడ్ అలాగే సేవ్ అవుతుంది.  టెక్నాలజీ పరంగా ట్రిప్పర్ డాష్‌ లో చిన్న అప్‌ డేట్ చేశారు. ఇప్పుడు GPS నావిగేషన్ ఉపయోగిస్తున్నప్పుడు మొబైల్ స్క్రీన్‌ ను లాక్ చేసుకునే అవకాశం ఉంది.  స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ కూడా మరింత సులభంగా పనిచేసేలా మెరుగుపరచబడింది.

ధర ఎంత? పోటీ ఏ బైక్ తో?

ధర పరంగా చూస్తే, అపెక్స్ వేరియంట్ రూ. 2.49 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. టాప్ ఫ్లాష్ వేరియంట్ ధర రూ. 2.72 లక్షల వరకు ఉంటుంది. ఈ బైక్  KTM 390 డ్యూక్‌ తో పోటీ పడుతుంది.

Read Also: 3 నిమిషాల్లో ఆటో స్కూటర్‌ అవుతుంది, ఇదేం టెక్నాలజీ భయ్యా!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×