BAFTA 2026 Winners: 2026 నాటి బాఫ్టా (BAFTA) అవార్డుల వేడుకలో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ (One Battle After Another) చిత్రం ఆరు అవార్డులతో సత్తా చాటింది. ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (పాల్ థామస్ ఆండర్సన్) సహా మొత్తం 6 విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ‘ఐ స్వైర్’ (I Swear) చిత్రంలో నటనకు గాను రాబర్ట్ అరామాయో ఉత్తమ నటుడిగా నిలిచారు. లియోనార్డో డికాప్రియో, టిమోతీ చలామెట్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి ఆయన ఈ అవార్డు అందుకోవడం విశేషం. అంతేకాకుండా, ఆయన ‘రైజింగ్ స్టార్’ అవార్డును కూడా గెలుచుకున్నారు. ‘హామ్నెట్’ (Hamnet) చిత్రానికి గాను జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్నారు. బాఫ్టా చరిత్రలో ఉత్తమ నటిగా అవార్డు పొందిన మొదటి ఐరిష్ నటిగా ఆమె రికార్డు సృష్టించారు.
Read also-Toxic Movie: టాక్సిక్ నటీనటుల రెమ్యూనరేషన్.. హీరో కాకుండా హైయెస్ట్ ఎవరికంటే?
Read also-Ayashere Song Promo: నాని ‘ప్యారడైజ్’ నుంచి ‘ఆయాషేర్’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. ఇది అరాచకమే..
Read also-Prabhas: హీరోయిన్ కు ఊహించని షాక్.. నీ మర్యాద చల్లగుండా.. మరీ ఇంత పిచ్చేంటి..?
ఈ ఏడాది బాఫ్టా అవార్డుల్లో భారతీయ చిత్రం ‘బూంగ్’ (Boong) ఉత్తమ ఫ్యామిలీ ఫిల్మ్‌గా అవార్డు గెలుచుకోవడం విశేషం. పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ఆధిపత్యం ప్రదర్శించగా, రాబర్ట్ అరామాయో విజయం ఈ వేడుకలోనే అతిపెద్ద ఆశ్చర్యకరమైన విషయంగా నిలిచింది.