E-Paper
Advertisement

New Year 2026: మీ ఇంట్లో సంపద పెరగాలా ? కొత్త సంవత్సరం వేళ ఇవి తప్పక కొనండి

New Year 2026: మీ ఇంట్లో సంపద పెరగాలా ? కొత్త సంవత్సరం వేళ ఇవి తప్పక కొనండి
Advertisement

New Year 2026: కొత్త సంవత్సరం వేళ ఇంట్లోకి అదృష్టాన్ని ఆహ్వానించడానికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది కొన్ని ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో కొన్ని నిర్దిష్టమైన వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్లసంవత్సరం అంతా సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, అదృష్టం లభిస్తాయని నమ్మకం. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

అదృష్టం కోసం ఇంట్లోకి తేవాల్సిన వస్తువులు:

నూతన సంవత్సరం అనేది కొత్త ఆశలకు, ఆశయాలకు ఆరంభం. ఆ ఆరంభం శుభప్రదంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఆధ్యాత్మికంగా , వాస్తు పరంగా కొన్ని వస్తువులకు విశేష శక్తి ఉంటుంది.

Advertisement

1. తాజా పూలు, పచ్చని మొక్కలు:

కొత్త సంవత్సరం రోజున ఇంటిని రంగు రంగుల తాజా పూలతో అలంకరించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ముఖ్యంగాలక్కీ బాంబూ లేదామనీ ప్లాంట్వంటి మొక్కలను తెచ్చుకోవడం వల్ల ఆర్థిక స్థితి మెరుగు పడుతుందని నమ్మకం. పూల సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచి, కొత్త ఏడాదిని ఉత్సాహంగా మొదలుపెట్టేలా చేస్తుంది.

2. కొత్త కుండ లేదా ఉప్పు:

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలంటే ఉప్పు నిండుగా ఉండాలి. న్యూ ఇయర్ రోజున కొత్త ఉప్పు ప్యాకెట్ కొనడం లేదా కొత్త మట్టి కుండను ఇంటికి తెచ్చుకోవడం వల్లఏడాది అంతా ధాన్యానికి.. ధనానికి లోటు ఉండదని అంటారు.

3. వినాయకుడి లేదా లక్ష్మీదేవి ప్రతిమలు:

శుభకార్యానికైనా విఘ్నేశ్వరుడే తొలి దైవం. కొత్త ఏడాదిలో పనులు ఆటంకం లేకుండా సాగాలని వెండి లేదా ఇత్తడి వినాయకుడి విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు. అలాగే, సంపద కోసం లక్ష్మీదేవి ఫోటోను లేదా ప్రతిమను తెచ్చుకోవడం శుభప్రదం.

4. చిరుగంటలు లేదా విండ్ చైమ్స్:

వాస్తు శాస్త్రం ప్రకారం.. విండ్ చైమ్స్ నుంచి వచ్చే శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని బయటకు పంపివేస్తుంది. న్యూ ఇయర్ ఈవ్ రోజున ప్రధాన ద్వారం వద్ద వీటిని వేలాడదీయడం వల్ల ఇంటికి అదృష్టం, శాంతి చేకూరుతాయి.

Also Read: వాస్తు ప్రకారం.. ఇంట్లో సంపదను పెంచే అలవాట్లు ఇవే 

5. కొత్త బట్టలు, తీపి పదార్థాలు:

కొత్త సంవత్సరం రోజున కొత్త బట్టలు ధరించడం అనేది ఒక సంప్రదాయం. ఇది మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అలాగే.. ఇంట్లోకి తీపి పదార్థాలను తెచ్చుకోవడం వల్ల జీవితం కూడా తీపిగా సాగుతుందని అర్ధం.

కేవలం వస్తువులతోనే అదృష్టం రాదు.. మన ఆలోచనలు కూడా సానుకూలంగా ఉండాలి. పాత జ్ఞాపకాలను వదిలేసి.. కొత్త లక్ష్యాలతో ముందుకు సాగడమే నిజమైన అదృష్టం. పైన చెప్పిన వస్తువులను నమ్మకంతో తెచ్చుకుని, మీ ఇంటిని ఆనంద నిలయంగా మార్చుకోండి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×