E-Paper
Advertisement

నిస్సాన్ టెక్టన్ లాంచ్ కు కౌంట్‌ డౌన్.. క్రెటా, డస్టర్‌ కు కొత్త సవాల్?

నిస్సాన్ టెక్టన్ లాంచ్ కు కౌంట్‌ డౌన్.. క్రెటా, డస్టర్‌ కు కొత్త సవాల్?
Advertisement

Nissan Tecton SUV: భారత మార్కెట్లో మరింతగా సత్తా చాటేందుకు నిస్సాన్ కొత్త SUVతో రెడీ అవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నిస్సాన్ టెక్టన్‌ ను కంపెనీ జూలై 9న అధికారికంగా ఆవిష్కరించనుంది. గత ఏడాది విడుదల చేసిన టీజర్‌ తోనే ఈ SUVపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు పూర్తి వివరాలు బయటకు రానుండటంతో కార్ల అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.

డిజైన్ గురించి..

డిజైన్ పరంగా చూస్తే, టెక్టన్ బలమైన, రగ్గడ్ లుక్‌ తో రానుంది. ముందు భాగంలో పెద్ద గ్రిల్, LED లైట్‌ బార్ ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. బలమైన బంపర్, సిల్వర్ క్లాడింగ్, ఎత్తైన బోనెట్ ఈ SUVకి మరింత మస్క్యులర్ లుక్‌ ను ఇస్తాయి. పక్క భాగంలో చూస్తే, టెక్టన్ డిజైన్ కొంత వరకు కొత్త రెనాల్ట్ డస్టర్‌ ను గుర్తు చేస్తుంది. అయితే, ప్రత్యేకమైన అల్లాయ్ వీల్స్, కొత్త స్టైలింగ్ ఎలిమెంట్లు ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్నాయి. వెనుక డోర్ హ్యాండిల్స్‌ ను విండో భాగంలో దాచిపెట్టడం వల్ల  SUVకి స్పోర్టీ లుక్ కనిపిస్తుంది. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్‌ ల్యాంప్స్, కొత్త టెయిల్‌ గేట్ డిజైన్, రూఫ్ స్పాయిలర్ లాంటి అంశాలు ఉండనున్నాయి. టెక్టన్ లేటెస్ట్ SUVల స్టైల్ ను కలిగి ఉంది.

ఇంటీరియర్ గురించి..

Advertisement

ఇంటీరియర్ కు సంబంధించి ప్రీమియం ఫీల్‌ పై నిస్సాన్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. డాష్‌ బోర్డ్‌ పై గ్లాస్ బ్లాక్ ఫినిష్, బ్రాస్ కలర్ హైలైట్స్, బాడీ కలర్ ట్రిమ్స్‌ తో క్యాబిన్‌ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది.

ఫీచర్ల గురించి..

ఫీచర్ల పరంగా కూడా టెక్టన్ వెనుకబడేలా కనిపించడం లేదు. 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే అందించే అవకాశం ఉంది. అదనంగా పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, వైర్‌ లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, పవర్డ్ టెయిల్‌ గేట్ లాంటి ఫీచర్లు కూడా ఉండొచ్చు.

ఇంజిన్ గురించి..

Advertisement

ఇంజిన్ ఎంపికల విషయానికి వస్తే, టెక్టన్‌ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు అందించే అవకాశం ఉంది. 1.0 లీటర్ ఇంజిన్ 100 PS పవర్, 160 Nm టార్క్ ఉత్పత్తి చేయగా, 1.3 లీటర్ ఇంజిన్ 163 PS పవర్, 280 Nm టార్క్ అందించగలదు. వీటికి మాన్యువల్, DCT గేర్‌ బాక్స్ ఆప్షన్లు ఉండనున్నాయి. భవిష్యత్తులో స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌ ను కూడా నిస్సాన్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇది మరింత మెరుగైన ఇంధన సామర్థ్యాన్నిఅందించే అవకాశం ఉంది.

ధర గురించి..

టెక్టన్ ప్రారంభ ధర సుమారు రూ.10 లక్షల నుంచి ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ వంటి ప్రముఖ SUVలకు పోటీగా నిలవనుంది.

Read Also: టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ ఆఫర్లు.. హారియర్ EVకి రూ.2.75 లక్షల తగ్గింపు!

Related News

వర్షాకాలంలో ఇంట్లో EV ఛార్జింగ్ చేస్తున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే అగ్గికి బుగ్గి అవ్వడం పక్కా!

యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

సిట్రోయెన్ మాస్టర్ స్ట్రోక్.. బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్ విడుదల!

అమ్మకాల్లో టాటా పంచ్ జోష్.. ఏకంగా 8 లక్షల మార్క్ క్రాస్!

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×