E-Paper
Advertisement

KL Rahul Century: సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన కేఎల్ రాహుల్..జ‌డేజా జిడ్డు బ్యాటింగ్‌..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే

KL Rahul Century: సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన కేఎల్ రాహుల్..జ‌డేజా జిడ్డు బ్యాటింగ్‌..న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే

KL Rahul Century: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI )  మధ్య జరుగుతున్న రెండవ వన్డేలో గిల్ సేన దుమ్ములేపింది. నిర్ణీత 50 ఓవర్లు ఆడిన టీమిండియా జట్టు , 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. టాపార్డ‌ర్‌ అలాగే మిడిల్ ఆర్డర్ విఫలమైనప్పటికీ, టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసుకున్న కేఎల్ రాహుల్, 92 బంతుల్లో 112 పరుగులు చేసి దుమ్ము లేపాడు. దీంతో టీమిండియా 284 పరుగులు సాధించగలిగింది. ఇక 285 పరుగులు చేస్తే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిచే ఛాన్సులు ఉంటాయి. ఒకవేళ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోతే, 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకోనుంది టీమిండియా. ఇక ఇందులో న్యూజిలాండ్ విజయం సాధిస్తే మూడవ వన్డే కీలకము కానుంది.

Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి

సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన కేఎల్ రాహుల్

న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs New Zealand, 2nd ODI )   మధ్య ఇవాళ రెండవ వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్కోట్ లోని నిరంజన్ షాప్ స్టేడియంలో ( Niranjan Shah Stadium, Khandheri, Rajkot ) ఈ మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లు వాడిన టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 284 పరుగులు సాధించింది.

ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 24 బరువులు చేయగా గిల్ 56 పరుగులతో రాణించాడు. అటు విరాట్ కోహ్లీ 23 పరుగులకు వికెట్ సమర్పించగా అయ్యర్ ఎనిమిది పరుగులకు ఔట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 92 బంతుల్లో 112 పరుగులు సాధించాడు. జడేజా 27 పరుగులు చేయగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 20 పరుగులతో రఫ్పాడించాడు.

రవీంద్ర జడేజా జిడ్డు బ్యాటింగ్..

టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ( Ravindra Jadeja) జిడ్డు బ్యాటింగ్ తో ప్రేక్షకులకు నరకం చూపించాడు. ఈ మ్యాచ్లో 44 బందులు ఆడిన రవీంద్ర జడేజా 27 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో ఒక బౌండరీ మాత్రమే ఉంది. దీంతో రవీంద్ర జడే జాను తొలగించి , వన్డేలలో అక్షర్ పటేల్ కు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా, టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI )  మధ్య జరుగుతున్న వ‌న్డే సిరీస్ నేప‌థ్యంలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి దూసుకెళ్లాడు విరాట్ కోహ్లీ. రోహిత్ శ‌ర్మ మాత్రం 3వ స్థానానికి ప‌రిమితం అయ్యాడు. అటు టీమిండియా సార‌ధి శుభ్మ‌న్ గిల్ 5వ స్థానంలో ఉండ‌గా, శ్రేయాస్ అయ్యర్ 10వ స్థానంలో దూసుకెళుతున్నాడు.

 

Also Read: Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

 

 

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×