OLA S1 X EV Scooter: ఓలా రీసెంట్ గా ఎస్1 ఎక్స్ (Ola S1 X) అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ పాపులర్ స్కూటర్ గా మారిపోయింది. ఇది దేశంలో అత్యంత అఫర్డబుల్, ఫీచర్ రిచ్ మోడల్స్ లో ఒకటిగా మారిపోయింది. ఇది Gen 3 వెర్షన్ లో లేటెస్ట్ అప్‌డేట్స్ తో అందుబాటులో ఉంది. Ola S1 X వేరియంట్లు, ధరలు, స్పెసిఫికేషన్లు సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Ola S1 X బ్యాటరీ కెపాసిటీపై ఆధారపడి మూడు ప్రధాన వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటిలో S1 X 2kWh, 3kWh, 4kWhతో పాటు అదనంగా S1 X+ వేరియంట్ కూడా ఉంది. ఈ మోడల్ ఎక్స్ ట్రా ఫీచర్లను కూడా కలిగి ఉంది. ఈ మోడల్స్ కు సంబంధించిన ధరలు రాష్ట్రాల సబ్సిడీలు, ట్యాక్స్ ల మీద ఆధారపడి మారే అవకాశం ఉంటుంది. రూ. 2,499 నుంచి EMI కూడా అందుబాటులో ఉంటుంది.
⦿ S1 X 2kWh: దీని ధర రూ. 77,999 – రూ. 84,999 ఉంటుంది. 2 kWh బ్యాటరీ ఉంటుంది. 95 – 108 రేంజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ km85 km/h ఉంటుంది.
⦿ S1 X 3kWh: దీని ధర రూ. 95,999 ఉంటుంది. 3 kWh బ్యాటరీ ఉంటుంది. 143 – 151 km రేంజ్ అందిస్తుంది. టాప్ స్పీడ్ 90 km/h.
⦿ S1 X 4kWh: దీని ధర రూ. 1,09,999 – 1,19,999 ఉంటుంది. 4 kWh బ్యాటరీ ఉంటుంది. 190 – 242 km రేంజ్ ఇస్తుంది. 101 – 125 km/h టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుంది.
⦿ S1 X+: దీని ధర రూ. 89,999 – 1,19,999 ఉంటుంది. 3/4 kWh బ్యాటరీ ఉంటుంది. 151 – 242 km రేంజ్ ఉంటుంది. 90 – 125 km/h టాప్ స్పీడ్ తో వస్తుంది.
మిడ్ డ్రైవ్ IPM (ఇంటిగ్రేటెడ్ మోటార్ కంట్రోలర్) మోటార్ ఉంటుంది. చైన్ డ్రైవ్ తో వస్తుంది. 7 kW – 11 Kw పిక్ పవర్ ఉంటుంది. ఆక్సిలరేషన్: 0-40 km/h లో 3 – 3.4 సెకన్లుగా ఉంటుంది. టాప్ స్పీడ్ 85 – 125 km/h ఉంటుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్స్ రైడింగ్ మోడ్స్ ఉంటాయి.
ఇందులో లిథియం-ఐయాన్ బ్యాటరీ ఉంటుంది. ఛార్జింగ్ టైమ్ 0-80% లో 4.5 – 5 గంటల్లో అవుతుంది. రన్నింగ్ కాస్ట్ సుమారు రూ. 0.17/km అవుతుంది. ఫుల్ ఛార్జ్ కు రూ. 14 ఖర్చు అవుతుంది. వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ 3 సంవత్సరాలు/50,000 km, స్కూటర్ 3 సంవత్సరాలు/40,000 km ఉంటుంది.
4.3 ఇంచ్ కలర్ సెగ్మెంటెడ్ LCD (బ్రైట్‌నెస్ కంట్రోల్), బ్లూటూత్, మొబైల్ యాప్ కనెక్టివిటీ, OTA అప్‌డేట్స్, స్మార్ట్ వాచ్ యాప్ ను కలిగి ఉంటుంది. క్రూజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, రిమోట్ బూట్ అన్‌లాక్, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, వెకేషన్ మోడ్, USB ఛార్జింగ్ పోర్ట్, 34L అండర్‌సీట్ స్టోరేజ్ ఉంటుంది. ఆల్-LED హెడ్ లైట్, టెయిల్ లైట్, ఇండికేటర్లు, DRLs ఉంటాయి. స్పోర్టీ డిజైన్, న్యూ స్పోర్టీ బాడీ డెకాల్స్, ఎర్గనామిక్ సీట్ లాంటి బాడీ స్టైల్ ఉంటుంది. జెట్ బ్లాక్, పోర్సెలిన్ వైట్, ఇండస్ట్రియల్ సిల్వర్, పాషన్ రెడ్, మిడ్‌నైట్ బ్లూ లాంటి కలర్స్ ను కలిగి ఉంటుంది. ఫ్రంట్ డిస్క్/డ్రమ్, రియర్ డ్రమ్ (కాంబి బ్రేక్ సిస్టమ్, రిజెనరేటివ్ బ్రేకింగ్, EBS) ఉంటుంది. Ola S1 X డైలీ కమ్యూటింగ్‌కు పర్ఫెక్ట్ గా ఉంటుంది.
Read Also: e-యాక్సెస్ TO Hayabusa.. దేశీ మార్కెట్లో లాంచ్ కాబోతున్న సుజుకి బైక్స్ ఇవే!