E-Paper
Advertisement

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన రెనాల్ట్ డస్టర్‌, ఎన్ని పాయింట్స్ సాధించిందంటే?

క్రాష్ టెస్ట్ లో దుమ్మురేపిన రెనాల్ట్ డస్టర్‌, ఎన్ని పాయింట్స్ సాధించిందంటే?
Advertisement

5-Star Safety for Renault Duster: భారత్ లో కార్ల భద్రతపై వినియోగదారులలో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో.. రెనాల్ట్ డస్టర్ తాజాగా భారత్ NCAP క్రాష్ పరీక్షల్లో మంచి రిజల్ట్స్ సాధించింది. ఈ SUV మొత్తం 5 స్టార్ భద్రతా రేటింగ్  పొందింది. కుటుంబ ప్రయాణాలకు సురక్షితమైన ఆప్షన్ గా మారింది.

పెద్దల రక్షణలో 30.49 పాయింట్లు

పెద్దల రక్షణ విషయంలో డస్టర్ 32లో 30.49 పాయింట్లు సాధించింది.  ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్ట్ లో 16లో 14.49 స్కోర్ పొందగా, సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో పూర్తి 16 పాయింట్లు సాధించింది. ముఖ్యంగా తల, మెడ, తొడలు లాంటి భాగాలకు మంచి రక్షణ లభించిందని పరీక్షల్లో తేలింది. ఛాతీ, కాళ్ల ప్రాంతంలో రక్షణ సరిపడా స్థాయిలో ఉన్నట్లు రేటింగ్ ఇచ్చారు. పక్క నుంచి ఢీకొన్న సందర్భాల్లో కూడా అన్ని శరీర భాగాలకు మంచి భద్రత అందినట్లు గుర్తించారు.

పిల్లల భద్రతలతోనూ సత్తా

Advertisement

పిల్లల భద్రత (COP) విషయంలో కూడా డస్టర్ బలమైన ప్రదర్శన కనబరిచింది. మొత్తం 49లో 45 పాయింట్లు సాధించడం ద్వారా, పిల్లల రక్షణలోనూ బెస్ట్ ఆప్షన్ గా నిలువనుంది. చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ డైనమిక్ పరీక్షలో పూర్తి మార్కులు సాధించగా, ఇన్‌స్టాలేషన్ పరంగా కూడా 12లో 12 పాయింట్లు పొందింది. కారు నిర్మాణం, భద్రతా మద్దతు అంశాల్లో కూడా మంచి స్కోరు వచ్చింది. 18 నెలలు, 3 సంవత్సరాల వయస్సు గల పిల్లల డమ్మీలతో చేసిన పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు నమోదయ్యాయి. పక్క నుంచి ఢీకొనే సందర్భంలోనూ రక్షణ బలంగా ఉందని పరీక్షలు తెలియజేశాయి. దీంతో చిన్నపిల్లలతో ప్రయాణించే కుటుంబాలకు ఇది మరింత సేఫ్టీ ఇచ్చే కారుగా గుర్తింపు తెచ్చుకుంది.

స్టాండర్డ్‌ గా పలు భద్రతా ఫీచర్లు  

ఈ SUVలో స్టాండర్డ్‌ గా ఇచ్చే భద్రతా ఫీచర్లు కూడా చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, కర్టెన్ ఎయిర్‌ బ్యాగ్‌లు, పాదచారుల రక్షణ వ్యవస్థ, సీట్‌ బెల్ట్ రిమైండర్ లాంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రమాద సమయంలో రక్షణను మరింత పెంచుతాయి.

Advertisement

Read Also: టాటా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు, ఆ ఈవీపై ఏకంగా రూ. 3.50 లక్షల తగ్గింపు!

కియా సెల్టోస్, టాటా సియెర్రాతో పోటీ

కియా సెల్టోస్, టాటా సియెర్రా లాంటి మోడళ్లతో ఈ కారు పోటీ పడుతోంది. పిల్లల రక్షణ స్కోర్లలో డస్టర్, సెల్టోస్ రెండూ సమానంగా ఉండగా, సియెర్రా కొంచెం తక్కువ స్కోరు సాధించింది. అయితే, పెద్దల రక్షణలో డస్టర్ స్కోరు ఈ మూడింటిలో కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, మొత్తం మీద మంచి స్థాయిలోనే ఉంది. ఈ కొత్త డస్టర్ మంచి భద్రతా ప్రమాణాలను అందిస్తూ, కుటుంబాల కోసం సరైన SUVగా నిలుస్తోంది.

Read Also: డ్రింకింగ్ వాటర్ To ఫస్ట్ ఎయిడ్.. ఏంటీ పెట్రోల్ బంక్ లో ఇన్ని ఫ్రీ సర్వీసులు లభిస్తాయా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×