E-Paper
Advertisement

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ vs గ్రాండ్ విటారా vs టయోటా హైరైడర్.. వీటిలో ఏది కొనాలంటే?
Advertisement

Duster Hybrid vs Grand Vitara vs Hyryder: హైబ్రిడ్ SUV కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, రెనాల్ట్ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మోడళ్లను ఒకసారి చెక్ చేయడం బెస్ట్. ఈ మూడు కార్లు మంచి మైలేజ్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నాయి. అయితే ఇంజిన్ పవర్, ధర, బూట్ స్పేస్, టెక్నాలజీ విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేని ధర ఎంత అంటే..

రెనాల్ట్ ఇండియా కొత్త డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ E-Tech 160 మోడల్‌ను ప్రారంభ ధర రూ.16.99 లక్షలతో విడుదల చేసింది. దీని మూడు వేరియంట్లు ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్. టాప్ వేరియంట్ ధర రూ.19.49 లక్షలుగా ఉంది. మారుతి గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ ధరలు రూ.16.68 లక్షల నుంచి రూ.19.77 లక్షల వరకు ఉన్నాయి. టయోటా హైరైడర్ హైబ్రిడ్ ధరలు సుమారు రూ.16.66 లక్షల నుంచి రూ.20.19 లక్షల వరకు ఉన్నాయి. ప్రారంభ ధర విషయంలో గ్రాండ్ విటారా, హైరైడర్ కొంత ముందుండగా, డస్టర్ కూడా పోటీ ధరతో మార్కెట్లోకి వచ్చింది.

మైలేజ్, ఇంజిన్ పవర్‌లో ఏది ముందు?   

Advertisement

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్‌లో 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. 160 PS శక్తిని అందిస్తుంది.   ARAI మైలేజ్ లీటరుకు 29 కిలోమీటర్లు. మరోవైపు గ్రాండ్ విటారా, హైరైడర్‌ లలో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ వ్యవస్థను ఉపయోగించారు. ఈ రెండు SUVలు 115.5 PS శక్తిని, ARAI ప్రకారం 27.97 మైలేజీని అందిస్తాయి. అంటే పవర్, మైలేజ్ రెండింటిలోనూ డస్టర్ ముందుంది.

స్పేస్, సౌకర్యాల్లో ఏది బెస్ట్?  

డస్టర్ పొడవు 4,346 మి.మీ., వీల్‌బేస్ 2,657 మి.మీ. కాగా, గ్రాండ్ విటారా, హైరైడర్‌ల వీల్‌బేస్ 2,600 మి.మీ. డస్టర్‌లో సుమారు 430 లీటర్ల బూట్ స్పేస్ ఉండగా, మిగతా రెండు మోడళ్లలో హైబ్రిడ్ వేరియంట్లకు సుమారు 255 లీటర్ల ప్లేస్ మాత్రమే ఉంది.

ఫీచర్లు, భద్రత ఎలా ఉన్నాయి?

Advertisement

డస్టర్ టాప్ వేరియంట్‌ లో 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS లాంటి ఫీచర్లు ఉన్నాయి. గ్రాండ్ విటారా, హైరైడర్ టాప్ వేరియంట్లలో 360-డిగ్రీ కెమెరా, హెడ్‌అప్ డిస్‌ ప్లే, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు లాంటి సదుపాయాలు ఉన్నాయి.

ఏ SUV కొనడం మంచిది?

ఎక్కువ పవర్, మెరుగైన ప్రకటిత మైలేజ్, పెద్ద బూట్ స్పేస్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు కావాలనుకునేవారికి డస్టర్ హైబ్రిడ్ బెస్ట్. మంచి సర్వీస్ నెట్‌ వర్క్, మెయింటెనెన్స్ సౌలభ్యం, ఇప్పటికే మార్కెట్లో ఉన్న హైబ్రిడ్ మోడల్ కావాలనుకునేవారు గ్రాండ్ విటారా, హైరైడర్‌ ను పరిశీలించడం మంచిది.

Read Also: స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

Tags

Related News

టెస్లా రోడ్‌స్టర్‌లో ఎయిర్ థ్రస్టర్లు.. ఫెరారీకి ఈ ఆలోచన 2018లో వచ్చిందా?

స్కోడా కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. కైలాక్‌పై ఏకంగా రూ.90 వేల తగ్గింపు!

డౌన్ పేమెంట్ లేకుండానే బైక్ కొనేయండి.. జావా, యెజ్డీ అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్లు!

ఏకంగా 4 SUVలు, ఓ పికప్ ట్రక్.. జీప్ ప్లాన్ మామూలుగా లేదుగా!

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×