E-Paper
Advertisement

Revolt Electric Bikes Offers: రివోల్ట్ EV బైక్స్‌ పై సూపర్ డీల్, ఏకంగా రూ. 25 వేలు తగ్గింపు!

Revolt Electric Bikes Offers: రివోల్ట్ EV బైక్స్‌ పై సూపర్ డీల్, ఏకంగా రూ. 25 వేలు తగ్గింపు!
Advertisement

Revolt EV Bikes Discounts and Offers:  భారతీయ మార్కెట్ లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు. బైక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అదే సమయంలో వాటిని కొనుగోలు చేసే వినియోగదారులకు ఆయా కంపెనీలు భారీ తగ్గింపులు అందిస్తున్నాయి. అందులో భాగంగానే రివోల్ట్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ బైక్స్ మీద పరిమిత కాల ఆఫర్‌ ను  అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ మార్చి 31, 2026 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వెళ్లడించింది.

పరిమిత ఆఫర్ లో అందించే ప్రయోజనాలు

రివోల్ట్ మోటార్స్ ఈ ఆఫర్ లో భాగంగా తమ బైకులను కొనుగోలు చేసే కస్టమర్లు పలు ప్రయోజనాలను అందిస్తుంది.  ఉచిత ఇన్సూరెన్స్, రూ. 4,999 విలువైన కాంప్లిమెంటరీ ఎక్స్‌ టెండెడ్ వారంటీ,  మోడల్ వారీగా రూ. 8,000 వరకు డిస్కౌంట్లను అందిస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లు PM E-డ్రైవ్ పథకం కింద రూ. 5,000 బెనిఫిట్స్ కు అర్హత కల్పిస్తుంది. మొత్తంగా, మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ప్రయోజనాలు రూ. 25,000 వరకు ఉండవచ్చు. ఈ ఆఫర్ లో PM E-డ్రైవ్ పథకం కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 31 మార్చి, 2026న కేంద్ర ప్రభుత్వం అందించే ఈ పథకం ముగియనుంది. ఆ తర్వాత కొనుగోలుదారులకు ఈ ప్రోత్సాహకాలను పొందడానికి పరిమిత సమయం మాత్రమే లభిస్తుంది. ఈ పథకందేశంలోని అన్ని అధీకృత రివోల్ట్ డీలర్‌ షిప్‌ లలో అందుబాటులో ఉంది.

Advertisement

Read Also: మారుతి నుంచి చౌకైన SUV.. జస్ట్ రూ.5.50 లక్షలకే కొత్త మోడల్!

అందుబాటులో ఉన్న రివోల్ట్ మోడల్స్ ఇవే!

అటు రివోల్ట్ పోర్ట్‌ ఫోలియోలో ప్రస్తుతం మూడు మోడళ్లు ఉన్నాయి. వాటిలో RV400 కీలకమైన మోడల్. దీని ధరలు రూ. 1.43 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. దీని ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ బైక్ అయిన RV1 ధర రూ. 1 లక్ష నుంచి ప్రారంభమవుతుంది.  ఇక ఈ శ్రేణిలో మధ్యలో ఉన్న RV BlazeX ధర రూ. 1.25 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఆన్ రోడ్ ధరలు మరికాస్త ఎక్కువగా ఉంటాయి.

Advertisement

Read Also: ఓలా క్రేజీ ఆఫర్.. ఏకంగా రూ.30 వేలు తగ్గింపు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×