E-Paper
Advertisement

GHMC Property Tax: ట్యాక్స్ కలెక్షన్ పై సర్కార్ బీజీ బీజీ.. మార్చి రెండో వారం నుంచి ఆస్తుల సీజింగ్..!

GHMC Property Tax: ట్యాక్స్ కలెక్షన్ పై సర్కార్ బీజీ బీజీ.. మార్చి రెండో వారం నుంచి ఆస్తుల సీజింగ్..!

GHMC Property Tax: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని ప్రజల అవసరాలకు తగిన విధంగా అభివృద్ది, మరింత మెరుగైన పౌర, అత్యవసర సేవలందించేందుకు ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ప్రధాన ఆర్థిక వనరుల్లో ఒకటైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై అధికారులు దృషి సారించారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం (2025-26) ఏప్రిల్ మాసంలో ఎర్లీ బర్డ్ స్కీమ్ అమలు తర్వాతి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జరిగిన కలెక్షన్ ఒక ఎత్తు అయితే రానున్న మార్చి మాసం 31 రోజుల్లో ట్యాక్స్ కలెక్షన్ భారీగా చేసుకోవాలని కార్పొరేషన్లు భావిస్తున్నట్లు సమాచారం. మూడు కార్పొరేషన్ల మొత్తం టార్గెట్ రూ. 3 వేల కోట్లు కాగా, ఇప్పటి వరకు మూడింటిలో జరిగిన కలెక్షన్ రూ, 2 వేల కోట్లు కాగా, వర్తమాన ఆర్థిక సంవత్సరం చివరి మాసమైన మార్చి నెల కలెక్షన్ పైనే కార్పొరేషన్లు ఆశలు పట్టుకున్నట్లు సమాచారం.

ప్రత్యేక వ్యూహాం సిద్దం

ప్రైవేటు, కమర్షియల్ ఆస్తులు ఇప్పటి వరకు బకాయి పడ్డ ట్యాక్స్ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు వన్ పాయింట్ ప్రొగ్రామ్ గా కాస్త కఠినంగానే వ్యవహారించేందుకు కార్పొరేషన్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీలో ఇప్పటికే టాప్ 200 బడా బకాయిదారులను గుర్తించి, వారి నుంచి ట్యాక్స్ ను కలెక్షన్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాన్ని సిద్దం చేశారు. ఇందులో భాగంగానే మార్చి రెండో వారం నుంచి బారీగా బకాయిలున్న ప్రైవేటు ఆస్తులను సీజ్ చేసేందుకు మూడు కార్పొరేషన్ల అధికారులు సిద్దమైనట్లు సమాచారం. ఇప్పటి వరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు ట్యాక్స్ వసూలు కాగా, వీటిలో రూ. 814 కోట్ల కలెక్షన్ తో సైబరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, రూ. 750 కోట్లతో జీహెచ్ఎంసీ రెండో స్థానంలో ఉండగా, రూ. 434 కోట్ల కలెక్షన్ తో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ మూడో స్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువ కాలంగా, భారీ మొత్తంలో ట్యాక్స్ బకాయి ఉండి చెల్లించని ఆస్తులను గుర్తించి మార్చి 15 తర్వాత సీజింగ్ చేయాలని జీహెచ్ఎంసీ ఇప్పటికే నిర్ణయంచినట్లు సమాచారం.

Also Read: Shamshabad Airport: శంషాబాద్‌లో విమానాల నిలిపివేత.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

ఆ బకాయిలపై క్లారిటీ..

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ పై సర్కారు జీహెచ్ఎంసీ అధికారులకు ఇటీవలే క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఏర్పడిన మూడు కార్పొరేషన్ల పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ కొద్ది ఏళ్లుగా సుమారు రూ 10 వేల కోట్ల వరకు బకాయిలున్నట్లు తెలిసింది. వీటిలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కొంత మేరకు ట్యాక్స్ చెల్లిస్తూ వస్తుంది. మిగిలిన బకాయిలను కూడా బుక్ అడ్జస్ట్ మెంట్ చేస్తామని సర్కారు క్లారిటీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో మార్చి 15 నుంచి ట్యాక్స్ కలెక్షన్ పై కాస్త కఠినంగా వ్యవహారించాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ ఈ యాక్షన్ ప్లాన్ లో ప్రభుత్వ ఆస్తులను మినహాయించనున్నట్లు తెలిసింది.

నేట నుంచి ప్రతి సర్కిల్ లో ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం

ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆదివారం నుంచి మార్చి మాసం చివరి ఆదివారమైన 29వ తేదీ వరకు డైలీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీతో పాటు వరుసగా 8, 15, 22, 29 వ తేదీల్లో ఈ కార్యక్రమాన్ని సర్కిల్ ఆఫీసుల్లో నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులను డిప్యూటీ కమిషనర్, వ్యాల్యుయేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి, స్వీకరించి పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమ నిర్వహణ కారణంగా ఆదివారం ట్యాక్స్ స్టాఫ్ కు మధ్యాహ్నాం వరకు సెలవులను రద్దు చేసినట్లు తెలిసింది.

ఓటీఎస్ పై అవగాహన కార్యక్రమాలు

మొండి బకాయిలను వసూలు చేసుకునేందుకు ప్రతి ఏటా సర్కారు బకాయిదారులకు వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) స్కీమ్ ను అమలు చేస్తుంది. కానీ ఈ వర్తమాన ఆర్థిక సంవత్సరంలో కాస్త ముందుగానే గత డిసెంబర్ మాసం నుంచి అమల్లోకి తెచ్చినా, అధికారులు ఆశించిన స్థాయిలో ట్యాస్ వసూలు కాకపోవటంతో ఈ స్కీమ్ పై అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలను ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ట్యాక్స్ స్టాఫ్ ఫీల్డు లెవెల్ లో బకాయిదారులను కలిసి, ఈ స్కీమ్ ద్వారా బకాయిలు చెల్లిస్తూ వడ్డీలో 90 శాతం మినహాయిస్తున్న విషయాన్ని వివరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Demon Pawan : రీతూకు సడెన్గా సర్ప్రైజ్ ఇచ్చిన డిమాన్..కన్నీళ్లు పెట్టుకున్న రీతూ..

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×