E-Paper
Advertisement

NHAI Guinness World Record: ఏపీలో గిన్నిస్ రికార్డ్ మోత.. 24 గంటల్లోనే 28.95 కి.మీ రోడ్డు నిర్మాణం: చంద్రబాబు హర్షం

NHAI Guinness World Record: ఏపీలో గిన్నిస్ రికార్డ్ మోత.. 24 గంటల్లోనే 28.95 కి.మీ రోడ్డు నిర్మాణం: చంద్రబాబు హర్షం
Advertisement

NHAI Guinness World Record: జాతీయ రహదారుల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ అరుదైన ఘనత సాధించింది. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G) నిర్మాణంలో రెండు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డులు’ నమోదైన‌ట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు.

భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) పర్యవేక్షణలో రాజ్ పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ అద్భుతాన్ని క్రియేట్ చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో ఏకంగా 28.95 లేన్ కిలోమీటర్ల రోడ్డును నిర్మించి చరిత్ర సృష్టించింది. అలాగే, అదే సమయంలోనూ మ‌రో రికార్డును కూడా క్రియేట్ చేసింది. 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను నిరంతరాయంగా వేసి మరో రికార్డును సొంతం చేసుకుంది.

Advertisement

ఇది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని సీఎం చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో ప్రపంచ స్థాయి రహదారుల మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ రికార్డులే నిదర్శనమని కొనియాడారు. కఠినమైన ఎన్‌హెచ్ఏఐ (NHAI) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఇంజనీర్లు, కార్మికులు, క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు.

ఇక్కడితో ఆగిపోకుండా, జనవరి 11, 2026 నాటికి ఇదే కారిడార్‌లోని ప్యాకేజీ 2, 3లలో మరో రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఆ బృందానికి ఆయన ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. “ఇండియా నిర్మిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ చేసి చూపిస్తుంది (India builds. Andhra Pradesh delivers)” అని ఆయన తన ట్వీట్‌ను ముగించారు.

Advertisement

Read Also:  అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు.. వచ్చే ఏప్రిల్‌లో మరో విడత: మంత్రి పొంగులేటి

Related News

అనకాపల్లి కి నయా లుక్.. మన ఊరు-మన బాధ్యత సీఎం చంద్రబాబు పిలుపు!

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్!

వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

పెద్దకాకాని ఆలయంలో ఘోరం.. అమ్మవారి రూ.15 లక్షల మంగళసూత్రం మాయం!

డేటా సెంటర్ ఇష్యూ.. సీఎం చంద్రబాబు క్లారిటీ, నిర్మాణం కాకుండానే నీళ్లు ఇంకిపోయాయంటూ..

విశాఖ సిటీలో విద్యార్థుల గ్యాంగ్‌వార్.. పట్టపగలు కర్రలు-రాడ్లతో దాడులు, పోలీసుల అదుపులో 17 మంది

జగన్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. తాడిపత్రిలో హైడ్రామా!

వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కుల పంపిణీ.. ప్రారంభ తేదీ ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Big Stories

Advertisement
×