Pawan Kalyan: తెలంగాణ ప్రజను ఘోరంగా అవమానించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కాపాడడానికి తెలంగాణ బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. దీని కోసం ప్రజల వ్యక్తిగత దైవారాధనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన విశ్లేషణను వివాదాస్పదం చేయడం ద్వారా బీజేపీ స్వార్థ రాజకీయాలకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రజలది నరదిష్టి అని అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన పవన్‌ను అవసరమైన ప్రతి చోట బీజేపీ రాజకీయంగా వాడుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయం మొదలుకొని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌ను బీజేపీ వాడుకుంది.
తెలంగాణ ప్రజలపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ఉపేక్షేంచేవి కాదని తెలంగాణ సమాజం మండిపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో పవన్‌ను తెలంగాణలో రాజకీయంగా వాడుకోవాలంటే ఇప్పుడు ఆతన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పవన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు వరుసగా విమర్శల దాడికి దిగిన రోజున ఈ అంశాన్ని డైవర్ట్ బీజేపీ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. తద్వారా పవన్ కళ్యాణ్‌ను రక్షించడానికి సీఎం చేసిన వ్యాఖ్యలపై రాజకీయం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించని బీజేపీ
అసలు దేవుళ్లను పూజించే విషయంలో ప్రజల విశ్వాసాన్ని విశ్లేషించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో ఎలాంటి వివాదం లేకపోయినా బీజేపీ దాన్ని వివాదాస్పదం చేయడానికే మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా రక్షించడానికే బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల్ని అవనమానించినా కూడా బీజేపీ కనీసం స్పదించలేదు. ఆయన వ్యాఖ్యలను ఖండించలేదు.
బీజేపీకి భయం పట్టుకుందా..?
అంతేకాకుండా.. బీజేపీని ప్రతి అంశంలో నిలదిస్తూ, ఆ పార్టీ మతత్వ రాజకీయాలు తెలంగాణలో సాగనివ్వకుండా అడ్డుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అంటే బీజేపీకి భయం పట్టుకుందని పలువురు విశ్లేషిస్తున్నారు. అందుకే ప్రతి అంశంలో ఆ పార్టీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తోందని చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగా తన రెండేళ్ల పాలనలో విస్తృత సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడం, తెలంగాణ అభివృద్ధితో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన విజన్‌తో ముందుకెళ్తుండడం బీజేపీకి రుచించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకి రేవంత్ రెడ్డి చేరువ అవుతున్న తీరును బీజేపీ జీర్ణంచుకోలేకపోందని తెలుస్తోంది. ముఖ్యంగా మేడారం అభివృద్ధి, వేమూలవాడ రాజన్న ఆలయాల అభివృద్ధి, గోశాలల నిర్మాణం వంటి చర్యలను ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తుండడాన్ని బీజేపీ సహించలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ గెలుపును జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ!
అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించినా కూడా కులమతాలకు అతీతంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి జైకొట్టడం బీజేపీకి నిద్రపట్టనివ్వడం లేదని తెలుస్తోంది. దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి చేయలేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు విదేశీ సంస్థలను తీసుకొస్తుండడం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్‌ను గమ్యస్థానంగా తీర్చిదిద్దడం, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తున్న తీరును చూసి బీజేపీ ఓర్వలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రజల భావోద్వేగాలు పట్టని బీజేపీ స్వార్థ్య రాజకీయాల కోసమే సీఎం వ్యాఖ్యలపై రాజకీయం చేస్తోందనే చర్చ నడుస్తోంది.
ALSO READ: Ind vs SA 2nd ODI: మరోసారి 300 దాటిన టీమిండియా స్కోర్.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే