E-Paper
Advertisement

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత
Advertisement

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 25 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వడ్డించిన భోజనం తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, వికారంతో ఇబ్బంది పడటంతో పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

ఆసుపత్రికి తరలింపు.. 

Advertisement

విద్యార్థుల పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో వారిని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, మరికొందరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యంపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

విచారణకు ఆదేశం.. 

Advertisement

మధ్యాహ్న భోజన నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంట గదిలో అపరిశుభ్రత లేదా కాలం చెల్లిన పదార్థాల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ.. పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో భోజన సౌకర్యాలపై పర్యవేక్షణ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Harish Rao: కేసీఆర్‌ను టచ్ చేస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేసినట్టే.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్

Related News

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×