E-Paper
Advertisement

Electric Bike: ఒక్క ఛార్జ్ తో 600 కిలో మీటర్లు.. వెర్జ్ ఈవీ సరికొత్త సంచలనం!

Electric Bike: ఒక్క ఛార్జ్ తో  600 కిలో మీటర్లు.. వెర్జ్ ఈవీ సరికొత్త సంచలనం!
Advertisement

Verge TS Pro Electric Bike: ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ తయారీ సంస్థ వెర్జ్ మోటార్ సైకిల్స్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీతో కూడిన ప్రొడక్షన్ మోటార్‌ సైకిళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. టూ వీలర్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో పెను సంచలనం సృష్టించబోతోంది. ఫిన్లాండ్‌కు  చెందిన ఈ కంపెనీ టెక్నాలజీ సంస్థ డోనట్ ల్యాబ్‌ తో కలిసి సరికొత్త బ్యాటరీ వ్యవస్థను డెవలప్ చేసింది. సాలిడ్ స్టేట్ బ్యాటరీ వేగవంతమైన ఛార్జింగ్‌ తో పాటు సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీ తో పోలిస్తే రైడింగ్ పరిధిని దాదాపు రెట్టింపు అందిస్తుందని వెర్జ్ కంపెనీ వెల్లడించింది. మరికొద్ది నెలల్లోనే ఈ బైక్ ను వినియోగదారులను డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.

హైస్పీడ్ ఛార్జింగ్, అదిరిపోయే రేంజ్

వెర్జ్, డోనట్ ల్యాబ్ కలిసి రూపొందించిన కొత్త బ్యాటరీ అత్యతం వేగంగా ఛార్జింగ్ అవుతుంది. సాలిడ్ స్టేట్ ప్యాక్ జస్ట్ 10 నిమిషాల్లో 186 మైళ్ల(300 కి.మీ) పరిధిని అందిస్తుంది. సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీల మాదిరిగా కాకుండా, మోటార్ సైకిల్ మొత్తం జీవితకాలం ఉండేలా బ్యాటరీ రూపొందించినట్లు వెర్జ్ వెల్లడించింది.  వినియోగదారులు ఎక్స్ టెండెడ్  రేంజ్ బ్యాటరీ ప్యాక్ ను అందించనుంది. సింగిల్ ఛార్జ్ తో 217 మైళ్ల(436 కి.మీ) నుంచి 370మైళ్ల (600 కి.మీ) రేంజ్ లభిస్తుంది. అంతేకాదు, అప్‌గ్రేడ్ చేసిన బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగించిన బైక్ ధర సాధారణంగానే ఉంటుందని వెర్జ్ తెలిపింది.

సేఫ్టీ మీద ఎక్కువ ఫోకస్

Advertisement

మంచి పని తీరుతో పాటు భద్రత, స్థిరత్వం మీద ఫోకస్ పెట్టినట్లు వెర్జ్ తెలిపింది. సాలిడ్ స్టేట్ బ్యాటరీలు మరింత సస్టెయినబులిటీని కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. లిక్విడ్ ఆధారిత లిథియం అయాన్ ప్యాక్‌ల కంటే తక్కువ అగ్ని ప్రమాద అవకాశాన్ని కలిగి ఉంటాయని వెల్లడించింది. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. “మోటార్ సైకిళ్లకు సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించడం  చారిత్రాత్మక పురోగతి. ఇది మొత్తం ఆటోమోటివ్ పరిశ్రమలోనే సంచలనం కాబోతోంది” అని వెర్జ్ మోటార్ సైకిల్స్ CEO టుమో లెహ్తిమాకి వెల్లడించారు. డోనట్ ల్యాబ్‌తో  కలిసి డెవలప్ చేసిన ఈ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ కు రెడీ అవుతుందన్నారు.

Read Also: ఒక్క ఛార్జ్ తో 400 కిలో మీటర్ల రేంజ్, సింపుల్ ఎనర్జీ నుంచి అదిరిపోయే ఈవీ!

Advertisement

వెర్జ్ TS ప్రో బైక్ లో తొలిసారి!   

వెర్జ్ ఎలక్ట్రిక్ బైక్ TS ప్రో, 2025 నవంబర్‌ లో మిలన్‌లో జరిగిన EICMA మోటార్‌ సైకిల్ ప్రదర్శనలో లాంచ్ చేయబడింది. ఇది వెర్జ్  కొత్త డోనట్ 2.0 ఇన్ వీల్ మోటారును కలిగి ఉంది.  అదే పవర్, టార్క్ అవుట్‌ పుట్‌ ను కొనసాగిస్తూ, ముందున్న దానికంటే 50 శాతం తేలికగా ఉండబోతోంది. ఈ మోటార్‌ సైకిల్ 3.5 సెకన్లలో 0 నుండి 62 మైళ్ల (99.7 కిమీ/గం) వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. మొత్తంగా ఆటో మోటివ్ పరిశ్రమలో వెర్జ్ ఓ సంచలనాన్ని క్రియేట్ చేయబోతోందని చెప్పుకోవచ్చు.

Read Also: హోండా-సోనీ ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది.. టెస్లాకు దెబ్బ తప్పదా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×