T20 World Cup 2026-Tilak Varma: టీమిండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ( Tilak Varma ) జట్టుకు దూరం కాబోతున్నాడు. ఈ నెలలో న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( India vs New Zealand T20Is) మధ్య 5 టీ20 ల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నేపథ్యంలో సెలెక్ట్ అయిన తిలక్ వర్మ చివరి క్షణంలో జట్టుకు దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనికి వృషణాలకు ( Testicular Torsion ) సంబంధించిన సర్జరీ జరిగిందట. ఈ నేపథ్యంలో నాలుగు వారాలపాటు తిలక్ వర్మకు రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగే టి20 సిరీస్ తోపాటు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026) నుంచి కూడా తిలక్ వర్మ దూరం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Sara Tendulkar: సచిన్ ఘోర అవమానం..కూతురు సారా ఫోటోలు అసభ్యకరంగా తీసి, వేధింపులు ?
టీమిండియా స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ ( Tilak Varma ) అనారోగ్యం బారిన పడ్డాడట. దీంతో న్యూజిలాండ్ తో జరిగే టి20 సిరీస్ కు తిలక్ వర్మ దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. వృషణాలకు ( Testicular Torsion ) సంబంధించి తిలక్ వర్మకు ఆపరేషన్ జరిగిందని చెబుతున్నారు. విజయ్ హజారే ట్రోఫీ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడట తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. ఈ నేపథ్యంలోనే వైద్యులు వృషణానికి ఆపరేషన్ ( Testicular Torsion ) కూడా చేసినట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. అయితే ఆపరేషన్ చేయించుకున్న తిలక్ వర్మ మళ్ళీ గ్రౌండ్ లో అడుగు పెట్టడానికి దాదాపు నెలరోజుల సమయం పడుతుంది అంట. అంటే న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్ కు తిలక్ వర్మ దూరం కాబోతున్నాడు అన్నమాట. అలా అని నెలరోజుల తర్వాత గ్రౌండ్ లో అడుగు పెట్టాలంటే కచ్చితంగా అతడు ఫిట్ గా ఉండాలి. ఫిట్ గా లేకపోతే టి20 ప్రపంచ కప్ 2026 నుంచి కూడా తిలక్ వర్మ దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీంతో టీమిండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ ( Tilak Varma ) సర్జరీ కారణంగా టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ కు దూరం అయితే, గిల్ కు అవకాశం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని వెనుక గంభీర్ కుట్రలు ఉన్నట్లు ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. గిల్ ( Gill) కోసం ఈ డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. తిలక్ వర్మ ఆడకపోతే, శ్రేయాస్ అయ్యర్ కు అవకాశం ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
The recovery will take around 2-4 weeks and Tilak Varma could be ruled out of the five match T20I series against New Zealand
Source: Express Sports #TilakVarma #T20I #IndianCricket #Insidesport #CricketTwitter pic.twitter.com/wsvFnQa6nA
— InsideSport (@InsideSportIND) January 8, 2026