E-Paper
Advertisement

Royal enfield Hunter 350 vs Yamaha XSR 155: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 vs యమహా XSR 155, వీటిలో ఏది తోప్ అంటే?

Royal enfield Hunter 350 vs Yamaha XSR 155: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 vs యమహా XSR 155, వీటిలో ఏది తోప్ అంటే?

Royal Enfield Hunter 350 vs Yamaha XSR 155 Comparison: ఇండియన్ టూవీలర్ మార్కెట్ లోకి రాయల్ ఎన్ఫీల్డ్, యమహా నుంచి క్రేజీ బైక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రెండు కంపెనీల నుంచి వచ్చిన సూపర్ బైక్స్.. రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350, యమహా XSR 155. డిఫరెంట్ నియో రెట్రో స్టైల్ లో ఆకట్టుకుంటున్నాయి. హంటర్ 350 కంఫర్ట్, టార్క్, లోయర్ ఎండ్ పవర్‌ లో అద్భుతంగా ఉంటుంది. ఇది సిటీ క్రూజింగ్‌ కు అనుకూలంగా ఉంటుంది. అటు XSR 155 స్పోర్టియర్ మరింత ఫ్యూయెల్ ఎఫిషియెన్సీతో వస్తుంది. చురుకైన కమ్యూటింగ్‌ కు మరింత అనుకూలంగా ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 vs యమహా XSR 155 పోలికలు

⦿ ఇంజిన్, పనితీరు:  రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైక్  349cc సింగిల్ సిలిండర్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 20.2 bhp పవర్  27 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బాటమ్ ఎండ్ గ్రంట్‌ తో థంపర్ గా గుర్తింపు తెచ్చుకుంది. యమహా XSR 155 వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ తో కూడిన 155cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 19.3bhp పవర్, 14.1 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ డిస్‌ ప్లేస్‌ మెంట్‌ లో సగం ఉన్నప్పటికీ, XSR 155 అధునాతన, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కారణంగా హంటర్ 350తో సమానమైన పనితీరును కలిగి ఉంటుంది.  XSR జోష్ ఫుల్ రైడింగ్ కు అనుకూలంగా ఉంటుంది. హంటర్ 350 రిలాక్స్డ్ రైడింగ్‌కు బాగుంటుంది. హంటర్ 350 5 స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను కలిగి ఉంటుంది. XSR 155 6 స్పీడ్ గేర్‌ బాక్స్‌ ను ఉపయోగిస్తుంది.

⦿ డిజైన్ & హ్యాండ్లింగ్: హంటర్ 350 మరింత సాంప్రదాయ, నిటారుగా మరియు సౌకర్యవంతమైన వైఖరిని కలిగి ఉంది. XSR 155 స్పోర్టియర్, కొద్దిగా ముందుకు వంగి మరియు మరింత దూకుడుగా ఉండే రైడింగ్ స్థానాన్ని కలిగి ఉంది.

⦿ మైలేజ్: యమహా XSR 155 సాధారణంగా ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. మైలేజ్ సుమారు 45 కిలో మీటర్లు ఉంటుంది. హంటర్ 350 దాదాపుగా 36 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది.  రెండు బైక్‌లు దాదాపు 120-130 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తాయి.

⦿ ధర: యమహా XSR 155 ధర సుమారు రూ.1.50 లక్షలు ఉంటుంది. హంటర్ 350 ప్రారంభ ధర సుమారు రూ.1.38 – 1.67 లక్షల వరకు ఉంటుంది.

Read Also: హోండా డియో vs హోండా షైన్.. వీటిలో ఏది బెస్ట్? ఎందుకు?

ఎవరికి ఏ బైక్ అనుకూలంగా ఉంటుందంటే?

క్లాసిక్ ఎక్స్ పీరియెన్స్, రిలాక్స్డ్, టార్క్వీ, స్టైలిష్ సిటీ కమ్యూటర్ కోసం రాయల్ ఎన్‌ ఫీల్డ్ హంటర్ 350ని ఎంచుకోవడం మంచిది. మంచి ప్యూయెల్ ఎఫిషియెన్సీ, స్పోర్టియర్ లుక్,  మంచి రైడింగ్ కోసం మహా XSR 155 బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

Read Also:  జావా 42 బాబర్ vs రాయల్ ఎన్ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350.. ఏ కారు కొనాలంటే?

Related News

జూపిటర్ CNG To అపాచీ RR 450.. టీవీఎస్ నుంచి రాబోతున్న క్రేజీ మోడల్స్ ఇవే!

స్పీడ్‌ తో పాటు సేఫ్టీ కూడా కావాలా? అయితే ఈ కారు మీ కోసమే!

ఇది స్కూటరా? లేక టూరింగ్ మెషీనా? ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

సిటీ రోడ్లకు పర్ఫెక్ట్ ఆటోమేటిక్ SUVలు ఇవే.. కొనేముందు ఈ లిస్ట్ చూడండి!

246 కి.మీ రేంజ్‌ తో కొత్త సిట్రోయెన్ eC3 ఫేస్‌లిఫ్ట్.. ఫీచర్లు చూస్తే అదిరిపోవాల్సిందే!

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

Big Stories

×