E-Paper
Advertisement

Gurugram Shocker: ఫ్రెండ్ ఫోన్‌లో సోదరి నగ్న వీడియోలు.. కోపంతో రగిలిపోయిన అన్న.. ఏం చేశాడంటే?

Gurugram Shocker: ఫ్రెండ్ ఫోన్‌లో సోదరి నగ్న వీడియోలు.. కోపంతో రగిలిపోయిన అన్న.. ఏం చేశాడంటే?
Advertisement

Gurugram Shocker: హర్యానాలోని గుర్ గ్రామ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బెస్ట్ ఫ్రెండ్ ను ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. హత్యకు గురైన సోహైబ్.. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జిషన్ ఇద్దరూ మంచి స్నేహితులని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిద్దరు విదేశాల్లో ఉన్న సమయంలో సోహైబ్ ఫోన్ లో తన చెల్లి నగ్న ఫొటోలు, వీడియోలు ఉండటాన్ని జిషన్ చూసినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి సోహైబ్ పై కోపం పెంచుకున్న జిషన్.. తాజాగా అతడ్ని హత్య చేసినట్లు తేలింది.

అసలేం జరిగిందంటే?

గురుగ్రామ్ లోని ఆనంద్ గార్డెన్ పోలీసు స్టేషన్ పరిధిలో తొలుత ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు చనిపోయిన వ్యక్తి యూపీకి చెందిన సోహైబ్ అని తెలిసింది. అతడి స్నేహితుడు జిషన్.. గురుగ్రామ్ కు రప్పించి మరి ప్రాణాలు బలిగొన్నట్లు వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. జిషన్, సోహైబ్ కు మంచి స్నేహితులు. దుబాయి పనిచేస్తున్న సమయంలో ఒకే దగ్గర నివసించారు.

విదేశాల్లోనే హత్యకు కుట్ర..

Advertisement

దుబాయిలో ఉండగా ఓ రోజు అనుకోకుండా సోహైబ్ మెుబైల్ ను జిషన్ చూశాడు. అందులో తన సోదరి నగ్న ఫొటోలు, వీడియోలను చూసి ఒక్కసారిగా జిషన్ షాక్ కు గురయ్యారు. తన సోదరితో సోహైబ్ ఎఫైర్ పెట్టుకున్నాడని నిర్ధారించుకొని.. నమ్మకద్రోహం చేసిన అతడిపై ఎలాగైన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దుబాయిలోనే హత్య చేసేందుకు పలు ప్రణాళికలు వేసినప్పటికీ అవి ఫలించలేదు. ఈ క్రమంలోనే ఏడాదిన్నర క్రితం ఇరువురు దుబాయి నుంచి తమ స్వస్థలాలకు వచ్చేశారు. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.

సోదరితో పెళ్లికి ప్రపోజల్..

ఈ ఏడాది జనవరిలో యూపీలోని సోహైబ్ గ్రామానికి జిషన్ వెళ్లాడు. ఆ సమయంలో అతడి సోదరిని వివాహం చేసుకుంటానని సోహైబ్ ప్రతిపాదన తీసుకొచ్చాడు. అయితే జిషన్ వారి వివాహానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో గురుగ్రామ్ లోని ఇంటికి తిరిగొచ్చిన జిషన్.. సోహైబ్ గురించి సోదరిని ప్రశ్నించాడు. అయితే సోహైబ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని అతడి సోదరి తేల్చి చెప్పింది.

Advertisement

Also Read: Scotland Cricket Team: ఇండియాలో అడుగుపెట్టిన స్కాట్లాండ్‌…పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు ఇక గాజులు వేసుకోవాల్సిందే

ఎలా హత్య చేశారంటే?

సోహైబ్ పై మరింతగా రగిలిపోయిన జిషన్.. దుబాయిలో ఆగిపోయిన మర్డర్ ప్రణాళికను సొంతూరులో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఊరిలో ఓ జాబ్ ఉందంటూ యూపీ నుంచి సోహైబ్ ను రప్పించాడు. లోకల్ ఫ్రెండ్స్ తో కలిసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సోహైబ్ కు ఫుల్లుగా మద్యం తాగించాడు. అనంతరం అక్కడే ఉన్న విద్యుత్ తీగను గొంతుకు బిగించి సోహైబ్ ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి కాలువలో పడేశారని అనంతరం జిషన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి జిషన్ సహా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ నా దెబ్బకు భయపడేవాడు.. యాక్టర్ శ్రీ లక్ష్మి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×