E-Paper
Advertisement

Yoga For Diabetes: గుడ్ బై డయాబెటిస్..డైలీ 20 నిమిషాల యోగాతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టండి!

Yoga For Diabetes: గుడ్ బై డయాబెటిస్..డైలీ 20 నిమిషాల యోగాతో షుగర్ వ్యాధికి చెక్ పెట్టండి!
Advertisement

Yoga For Diabetes: నేటి కాలంలో డయాబెటిస్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. కేవలం మందులు వాడటమే కాకుండా.. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు.. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. ముఖ్యంగా.. యోగాసనాలు వేయడం వల్ల పొట్ట భాగంలోని అవయవాలు, ప్రత్యేకించి ‘ప్యాంక్రియాస్’ ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగు పడుతుంది.

షుగర్ అదుపు చేసే 5 ముఖ్యమైన ఆసనాలు:

Advertisement

1. మండుకాసనం:
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది సంజీవని వంటిది. ఈ ఆసనం వేసేటప్పుడు పొట్టపై ఒత్తిడి పడి, ప్యాంక్రియాస్ గ్రంథి చురుగ్గా మారుతుంది.
వేసే విధానం: వజ్రాసనంలో కూర్చుని.. రెండు చేతుల పిడికిళ్లను బొడ్డుకు ఇరువైపులా ఉంచి, గాలి వదులుతూ ముందుకు వంగాలి. కళ్లు ఎదురుగా చూడాలి. ఈ స్థితిలో 30 సెకన్లు ఉండి సాధారణ స్థితికి రావాలి.

2. పశ్చిమోత్తాసనం:
ఈ ఆసనం వెన్నెముకను సాగదీయడమే కాకుండా.. పొట్టలోని అవయవాలను మసాజ్ చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
వేసే విధానం: కాళ్లు చాపి కూర్చుని, గాలి పీలుస్తూ చేతులను పైకి ఎత్తి, గాలి వదులుతూ మెల్లగా ముందుకు వంగి పాదాలను పట్టుకోవాలి. మోకాళ్లు వంచకుండా నుదురును మోకాళ్లకు తాకించడానికి ప్రయత్నించాలి.

Advertisement

3. భుజంగాసనం:
ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. కాలేయం, ప్యాంక్రియాస్ పనితీరును ఇది క్రమబద్ధీకరిస్తుంది.
వేసే విధానం: బోర్లా పడుకుని, రెండు చేతులను ఛాతీ పక్కన ఉంచి, నెమ్మదిగా గాలి పీలుస్తూ నడుము పైభాగం వరకు శరీరాన్ని ఎత్తాలి. ఆకాశం వైపు చూస్తూ కొద్దిసేపు ఆగి నెమ్మదిగా కిందకు రావాలి.

4. అర్థ మత్స్యేంద్రాసనం:
ఈ ఆసనం వెన్నెముకను మెలితిప్పడం ద్వారా అంతర్గత అవయవాలను ఉత్తేజపరుస్తుంది. ఇది ఇన్సులిన్ స్రావాన్ని పెంచడానికి చాలా సహాయ పడుతుంది.
వేసే విధానం: కూర్చుని ఒక కాలును మడిచి మరో కాలు మోకాలి అవతల వైపు పెట్టాలి. శరీరాన్ని వెనక్కి తిప్పుతూ వెనుక ఉన్న చేతిని చూడాలి. ఇలా రెండు వైపులా చేయాలి.

5. ధనురాసనం:
ఈ ఆసనం శరీరానికి విల్లు ఆకారాన్ని ఇస్తుంది. ఇది పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. మధుమేహం అదుపులో ఉండటానికి ఇది అత్యంత ప్రభావవంతమైనది.

ప్రాణాయామం, ధ్యానం:
మధుమేహానికి ప్రధాన కారణాలలో ‘ఒత్తిడి’ ఒకటి. దీనిని తగ్గించడానికి కేవలం ఆసనాలే.. కాకుండా ప్రాణాయామం కూడా చేయాలి.

కపాలభాతి: ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి, జీవక్రియను వేగవంతం చేస్తుంది.

అనులోమ విలోమ: నాడులను శుద్ధి చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

భ్రమరి: అధిక రక్తపోటు, ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది.

Also Read: మీ గుండె పదిలంగా ఉండాలంటే.. ఈ 5 రకాల సీడ్స్ తినాల్సిందే

సూచనలు:
యోగాను క్రమం తప్పకుండా ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఉంటాయి. అయితే.. తీవ్రమైన వెన్నునొప్పి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల సమక్షంలోనే వీటిని ప్రాక్టీస్ చేయాలి. యోగాతో పాటు సరైన (తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ పీచు పదార్థం) తీసుకుంటే మధుమేహం అనేది ఒక సమస్యలా అనిపించదు. ఆరోగ్యకరమైన జీవన శైలితో  షుగర్ వ్యాధిని జయించడం సాధ్యమే.

Related News

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

Big Stories

Advertisement
×