Royal Enfield Motorcycles Gets 14 Percent Growth: రాయల్ ఎన్ ఫీల్డ్ 2026ను సూపర్ జోష్ తో మొదలుపెట్టింది. జనవరిలో ఈ కంపెనీ ఏకంగా 1,04,322 మోటార్ సైకిళ్లను అమ్మినట్లు వెల్లడించింది. గత సంవత్సరం ఇదే నెలలోఈ సంఖ్య 91,132 యూనిట్లుగా ఉంది. అప్పటితో పోల్చితే ఈసారి ఏకంగా 14% కంటే అమ్మకాల్లో పెరుగుదల కనబరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేవలం 10 నెలల్లోనే బ్రాండ్ 1 మిలియన్ అమ్మకాల మైల్ స్టోన్ ను క్రాస్ చేయడం విశేషం.
జనవరిలో రాయల్ ఎన్ ఫీల్డ్ దేశీయ అమ్మకాలు 93,781 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 16% ఎక్కువ. ఎగుమతులు 10,541 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 5% వృద్ధి చెందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 10.25 లక్షలకు పైగా మోటార్ సైకిళ్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 25% ఎక్కువ. ఎగుమతులు 1 లక్ష యూనిట్లను దాటాయి. అంటే ఇప్పటి వరకు 30% పెరిగింది.
ఇక రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్ల అమ్మకాలు పెరగడం పట్ల ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ CEO బి గోవిందరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. 2026లో రాయల్ ఎన్ ఫీల్డ్ అమ్మకాలు పెరగడం సంతోషంగా ఉందన్నారు. వరుసగా నాలుగు నెలల పాటు అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నెలకొన్నట్లు వివరించారు.
ఇదే సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 2026 ఎడిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బాబర్ స్టైలింగ్, రిలాక్స్డ్ క్రూజింగ్ ను ఇన్ స్ప్రేషన్ గా తీసుకుని సున్నితమైన షిఫ్ట్‌లు, USB టైప్ సి ఫాస్ట్ ఛార్జర్ కోసం అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను కలిగి ఉంటుంది. 20.2bhp పవర్, 27mm టార్క్ ను ఉత్పత్తి చేసే 349 సిసి ఇంజిన్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ. 2.19 నుంచి రూ. 2.22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.
Read Also: జనవరిలో దుమ్మురేపిన టాటా మోటర్స్, అమ్మో.. ఒకే నెలలో అన్ని కార్లు అమ్మిందా?
ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, కాంటినెంటల్ జిటి 650 లను బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా యూనివర్స్ లోకి క్రాఫ్టన్ ఇండియాతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆటగాళ్ళు ఇప్పుడు ఈ బైక్‌లను గేమ్‌లో నడపవచ్చు. అలాగే బహుమతులు పొందవచ్చు. ఇది యువ ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి కంపెనీ తీసుకున్న కీలక నిర్ణయం. అటు బెంగళూరులో రాయల్ ఎన్‌ఫీల్డ్ జిమ్ ఖానాను కూడా పరిచయం చేసింది. ఇవి నిపుణుల నేతృత్వంలోని రైడింగ్ మాడ్యూల్స్, రైడర్లు తమ సొంత మోటార్ సైకిల్ ఏదైనా సరే, తార్ రోడ్డు, ఆఫ్ రోడ్ పరిస్థితులలో కంట్రోల్, కాన్ఫిడెన్స్ ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మొత్తంగా కొత్త ఏడాదిలో రాయల్ ఎన్ ఫీల్డ్ మంచి శుభారంభాన్ని పొందింది. ప్యూర్ మోటార్ సైక్లింగ్ హైవేల నుంచి గేమింగ్ స్క్రీన్‌ల వరకు విస్తరించింది.
Read Also: టయోటా కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష తగ్గింపు!