E-Paper
Advertisement

Karma: కనిపించని మన కర్మలకు 18 మంది సాక్షులు గా ఉంటారట – ఆ 18 మంది ఎవరో తెలుసా..?

Karma: కనిపించని మన కర్మలకు 18 మంది సాక్షులు గా ఉంటారట – ఆ 18 మంది ఎవరో తెలుసా..?

Karma: మనం చేసే కర్మలు.. కాలానికి ఎలా తెలుస్తాయో తెలుసా..? మన పాప పుణ్యాలను కర్మ ఎలా లెక్కిస్తుందో తెలుసా..? ఎవరి చేసిన కర్మకు వారే బాధ్యులు అంటారు. ఆ కర్మలను అంత కరెక్టుగా గుర్తు పెట్టుకుని మరీ తెలిపేది ఎవరో తెలుసా…? అసలు విశ్వంలో ఉన్న అద్బుతమైన మెమరీ గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మనుషులు చేసే పాప, పుణ్యాలను ఎవరు లెక్కిస్తారు. విధికి ఎవరు చేరవేస్తారు. ఎవరూ చూడటం లేదు కదా అని చాలా మంది చాలా రకాలుగా ఘోరాలు నేరాలు చేస్తుంటారు. అలాగే చాలా మంది గుప్తంగా దానాలు ధర్మాలు చేస్తుంటారు. వాళ్లు చేసిన ఈ పనులు మనుషుల కంట్లో పడకపోవచ్చు కానీ ఈ విశ్వంలో ప్రతి ఒక్క జీవి చేసే పనిని లెక్కించేందుకు 18 సాక్షులను నియమించిందట. ఆ సాక్షులు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నాలుగు వేదాలు: ఈ సృష్టిలో ప్రతి జీవి చేసే ప్రతి కర్మకు మొదటి సాక్ష్యం నాలుగు వేదాలేనట. ఎవరూ చూడటం లేదు కదా అని మనుషులు చేసే ప్రతి అరాచకాన్ని కూడా నాలుగు వేదాలు రికార్డు చేసి విధికి ఇస్తాయట.

పంచభూతాలు: పంచభూతాలు అంటే అగ్ని, గాలి, వాయువు, నీరు భూమి. ఈ విశ్వంలో ఏ జీవి తప్పు చేసినా వేదాల నుంచి తప్పించుకున్నా ఈ పంచభూతాల నుంచి తప్పించుకోలేరని పండితులు చెప్తుంటారు. జీవుల పాప, పుణ్య కర్మలకు ఈ పంచభూతాలు కూడా విధి దగ్గర సాక్ష్యం చెప్తాయట.

అంతరాత్మ: అంతరాత్మ అంటే ఎక్కడో ఉండదు. మంచైనా చెడైనా చేసే వారి మనసులోనే రెండో ఆలోచన రావడాన్నే అంతరాత్మ అంటారు. చెడు చేసేవాళ్లకు అయితే ఇది చేయాలా వద్దా..? అని కొన్నిసార్లు ఆలోచన వస్తుంది అదే అంతరాత్మ.

ధర్మం: అహింస పరమో దర్మహా.. దర్మ హింస తదైవచా అని అఖండ సినిమాలో బాలకృష్ట చెప్పినట్టు ధర్మం ఎప్పుడూ విధికి సాక్ష్యం గా  ఉంటుందట. తప్పు చేసిన వారిని దండించడంలో కీలక పాత్ర పోషిస్తుందట.

యముడు: మనుషులు భూమ్మీద తప్పులు చేసి తమ తెలివి వల్లనో ఇంకో కారణాల వల్లనో ఏ శిక్ష అనుభవించకుండా చనిపోతే వారికి యమలోకంలో శిక్ష విధించేవాడు యముడ. ఈయన కూడా మనుషుల కర్మలను రికార్డు చేస్తుంటాడని పండితులు చెప్తుంటారు.

ఉదయం, సాయంత్రం ( ఉభయ సంధ్యలు): మనుషుల చేసే ప్రతి కర్మకు సాక్ష్యం ఈ ఉభయ సంధ్యలు అంటారు పండితులు. ఏ జీవి ఎలాంటి కర్మ చేసినా ఉభయ సంధ్యలు రికార్డు చేస్తాయట. విధికి సమర్పిస్తాయట.

సూర్య, చంద్రులు: ఈ విశ్వంలో విధికి సాక్ష్యంగా నిలిచేది సూర్య, చంద్రులు కూడానట. ఏ జీవి ఎలాంటి తప్పు చేసిన సూర్య, చంద్రులు గమనిస్తుంటారట.

పగలు, రాత్రి: ఇవి కూడా మనం చేసే కర్మలకు సాక్ష్యులుగా ఉంటాయట. మనుషులు ఎలాంటి తప్పులు చేసిన విధికి సాక్ష్యంగా చెప్తుంటాయని పండితులు చెప్తుంటారు.

కర్మలకు సాక్ష్యులుగా ఉండే వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయట. ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం అసాధ్యమట. దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని  మనుషులు భ్రమపడుతుంటారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమల శ్రీవారికి ప్రతిరోజు జరిగే ప్రత్యేక సేవలెంటో తెలుసా..? వాటిలో  ఎలా పాల్గొనాలంటే..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×