E-Paper
Advertisement

Jacket for Bike Riders: రైడర్ల కోసం క్రేజీ రైనాక్స్ డెల్టా GT జాకెట్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Jacket for Bike Riders: రైడర్ల కోసం క్రేజీ రైనాక్స్ డెల్టా GT జాకెట్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

భారతీయ రైడర్లు ప్రయాణాల సమయంలో రైడింగ్ జాకెట్లు, ప్యాంట్లు వేసుకుంటారు. రైడింగ్ లో ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగితే దెబ్బల నుంచి కాపాడటంతో పాటు సూర్యుడి నుంచి తగిలే అతినీల లోహిత కిరణాల నుంచి ఈ సూట్ రక్షణ కలిగిస్తుంది. తాజాగా చక్కటి ఫీచర్లతో కూడిన రైడింగ్ జాకెట్ ను అందుబాటులోకి వచ్చింది. రైనాక్స్ డెల్టా GT పేరుతో పరిచయం అయ్యింది. ఇది రైనాక్స్  స్పిరిటెడ్ రోడ్ రైడింగ్ పేరుతో వీ సూట్ తీసుకొచ్చింది. ఇది CE లెవల్ 2 ఆర్మర్ ప్రొటెక్షన్ తో మంచి అర్బన్, వీకెండ్ రన్ జాకెట్‌ గా ఉపయోగపడనుంది.

రైనాక్స్ డెల్టా GT తయారీ  

ఇతర రైనాక్స్ జాకెట్ల కంటే డెల్టా GT చాలా మెరుగ్గా ఉంటుంది.  ప్రొఫైల్, కట్, కుట్టు చక్కగా ఉంటాయి. స్లీవ్‌ల ఆకారం కూడా బాగుంటుంది. దీనికి స్పోర్టీ కట్ ఉంది. ఫిట్‌ ను సర్దుబాటు చేయడానికి వెల్క్రో పట్టీలు అవసరం లేదు. భద్రతా పరంగా, షోల్డర్ ప్యానెల్స్‌ పై 600D పాలిస్టర్ రిప్‌ స్టాప్ మెటీరియల్ ఉంది. షెల్ కూడా రాపిడి నిరోధకతను అందించడానికి 600D పాలిస్టర్‌తో తయారు చేయబడింది. భద్రత కోసం అదనంగా జాకెట్ వెనుక భాగంలో ఒక హంప్ ఉంది. స్పోర్ట్స్‌ బైక్  విండ్‌ స్క్రీన్ వెనుక ఉంచినప్పుడు అది ఏరోడైనమిక్స్‌ కు సహాయపడటమే కాకుండా, క్రాష్ సమయంలో రోడ్డుపైకి జారిపోతే హెల్మెట్, రోడ్డు ఉపరితలం మధ్య కొంత దూరం ఉంచడానికి సహాయపడుతుంది. ఇది రేస్ సూట్లలో చూసే దానికి సమానంగా ఉంటుంది.

Advertisement

ఇక డెల్టా GT వెనుక, భుజం, మోచేతులకు CERROS జీరో-G లెవల్ 2 ప్రొటెక్టర్లను కలిగి ఉంటుంది. ఛాతీ మీద CERROS ఆక్స్‌ టెక్ లెవల్ 2 ప్రొటెక్టర్లు ఉన్నాయి. ఇవి జీరో-G లాగానే దేశంలో తయారు చేయబడ్డాయి. మంచి వెంటిలేషన్‌ను అందించేలా రూపొందించబడ్డాయి.

రైనాక్స్ డెల్టా GT ఫీచర్లు

వేడి, తేమతో కూడిన వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని, మంచి మెష్ ప్యానెల్స్ ఉంటాయి. దేశంలో వేసవికాలం ప్రారంభం కావడంతో, ఈ ప్యానెల్లు రైడర్ ను చల్లగా ఉంచడంలో సాయపడుతాయి.  జాకెట్ బయట రెండు పాకెట్లు, లోపల ఒకటి ఉంటుంది. ఇవి కీక్స్, వాలెట్ లాంటి వస్తువులను పెట్టుకోవచ్చు. చీకటిలో విజుబులిటీని మెరుగుపరచడానికి జాకెట్ వెనుక,  భుజాల మీద రిఫ్లెక్ట్ అయ్యే ప్యానెల్స్ ను కలిగి ఉంటుంది.

Advertisement

Read Also: సమ్మర్ లో మీ కారు కూల్ గా ఉండాలంటే, ఈ స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయిపోండి!

ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే?

ఆఫీస్ కు ప్రయాణించేటప్పుడు, వీకెంట్ లో బైక్‌పై త్వరగా బయల్దేరాలి అనుకున్నప్పుడు రైనాక్స్ డెల్టా GT బాగా ఉపయోగపడుతుంది.  ఈ జాకెట్ కారణంగా రోజువారీ దుస్తులు, చిరిగిపోకుండా కాపాడుతుంది. వెంటిలేషన్ వ్యవస్థ ప్రభావంతో ఎన్నిసార్లు ఉతికినా రంగు మారదు. కఠినమైన UV కిరణాల నుంచి కూడా కాపాడుతుంది.

Read Also:  లో మెయింటెనెన్స్, 70 కి.మీ మైలేజ్.. చీప్ అండ్ బెస్ట్ హీరో బైక్స్ ఇవే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×