E-Paper
Advertisement

ఈవీని ప్రతిసారి 100% ఛార్జ్ చేయడం మంచిదేనా? ఈ తప్పు అస్సలు చేయకండి!

ఈవీని ప్రతిసారి 100% ఛార్జ్ చేయడం మంచిదేనా? ఈ తప్పు అస్సలు చేయకండి!
Advertisement

EV Charging Tips: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణానికి ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈవీ కొనుగోలు చేసిన తర్వాత బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలి? అనే విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండటం లేదు. ముఖ్యంగా ప్రతిసారీ బ్యాటరీని 100 శాతం వరకు ఛార్జ్ చేయాలా? అనే ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. అయితే, వెహికల్ లో ఉపయోగించిన బ్యాటరీ టెక్నాలజీ, కంపెనీ సూచనలు, రోజువారీ ప్రయాణ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రతిసారీ 100% అవసరం లేదు!

రోజువారీ ప్రయాణాలకు ఈవీని ఉపయోగించే వారికి ప్రతిసారీ 100 శాతం ఛార్జ్ చేయాల్సిన అవసరం సాధారణంగా ఉండదు. ముఖ్యంగా ఎక్కువ భాగం లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించే ఈవీల్లో బ్యాటరీని పూర్తిగా నింపకుండా కాస్త ఖాళీ ఉంచడం మంచిది. చాలా సందర్భాల్లో రోజువారీ వినియోగానికి అవసరమైనంత ఛార్జ్ ఉంచుకోవడం సరిపోతుంది. అయితే ఎంత శాతం వరకు ఛార్జ్ చేయాలనేది వాహన తయారీదారు ఇచ్చే సూచనలను బట్టి పాటించడం మంచిది.

లాంగ్ ట్రిప్ ఉంటే 100% ఓకే!

Advertisement

దూర ప్రయాణానికి వెళ్లాల్సి ఉన్నప్పుడు మాత్రం బ్యాటరీని 100 శాతం వరకు ఛార్జ్ చేసుకోవడం మంచిది. మార్గం మధ్యలో ఛార్జింగ్ స్టేషన్ కోసం వెతకాల్సిన అవసరం తగ్గుతుంది. ముఖ్యంగా ఛార్జింగ్ సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు పూర్తి ఛార్జ్ మంచిది. అయితే, ప్రయాణం లేనప్పుడు ప్రతిరోజూ బ్యాటరీని 100 శాతం వరకు నింపి, అదే స్థాయిలో ఎక్కువసేపు ఉంచడం అవసరం లేకపోవచ్చు.

బ్యాటరీని పూర్తిగా అయిపోకుండా చూసుకోండి!

100 శాతం ఛార్జింగ్ గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో.. బ్యాటరీ పూర్తిగా ఖాళీ అయ్యే విషయంలో కూడా అంతే జాగ్రత్త అవసరం. బ్యాటరీని తరచుగా పూర్తిగా అయిపోయేలా చేసి, మళ్లీ ఛార్జ్ చేయడం కంటే అవసరానికి ముందే ఛార్జింగ్ పెట్టుకోవడం మంచిది. అంతేకాదు, వెహికల్ ఎక్కువ రోజులు ఉపయోగించకుండా ఉంచాల్సి వస్తే బ్యాటరీని పూర్తిగా ఖాళీగా లేదంటే, ఫుల్ ఛార్జ్ చేసి వదిలేయకుండా కంపెనీ సూచించిన స్థాయిలో ఉంచడం మంచిది.

అవసరాన్ని బట్టి ఫాస్ట్ ఛార్జింగ్!

Advertisement

ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఈవీ యజమానులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జ్ పొందే అవకాశం ఉంటుంది. అయితే, రోజువారీ అవసరాలకు సాధారణ ఛార్జింగ్ సదుపాయం ఉంటే దానినే ఎక్కువగా ఉపయోగించడం ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ఎప్పుడు ఉపయోగించాలనే విషయంలో కూడా వాహన తయారీదారు సూచనలను పాటించడం మంచిది.

కంపెనీ సూచనలే ఫైనల్!

ప్రతి ఈవీకి ఒకే రకమైన బ్యాటరీ ఉండదు. బ్యాటరీ కెమిస్ట్రీ, థర్మల్ మేనేజ్‌మెంట్, ఛార్జింగ్ సిస్టమ్ లాంటి అంశాల్లో వాహనాల మధ్య తేడాలు ఉంటాయి. అందుకే ఇంటర్నెట్‌ లో కనిపించే సాధారణ సూచనల కంటే మన కారు, స్కూటర్ తయారీదారు ఇచ్చిన ఛార్జింగ్ పద్దతులను పాటించడం మంచిది. ప్రతిసారీ 100% ఛార్జ్ చేయడం కంటే, లాంగ్ డ్రైవ్‌కు వెళ్లే సమయంలో 100% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. సరైన ఛార్జింగ్ పద్దతులు పాటిస్తే ఈవీ బ్యాటరీని ఎక్కువ కాలం హెల్దీగా ఉంచుకోవచ్చు.

Read Also: ధర తక్కువ.. సేఫ్టీలో నో కాంప్రమైజ్.. రూ.10 లక్షల్లో బెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు ఇవే!

Tags

Related News

10 ఏళ్ల తర్వాత కూడా అదిరిపోయే రీసేల్ వ్యాల్యూ.. ఈ కార్లకు ఎప్పుడూ డిమాండే!

ధర తక్కువ.. సేఫ్టీలో నో కాంప్రమైజ్.. రూ.10 లక్షల్లో బెస్ట్ 5 స్టార్ రేటింగ్ కార్లు ఇవే!

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×