E-Paper
Advertisement

సింపుల్ వేవ్ ఈవీలపై సూపర్ ఫెస్టివ్ ఆఫర్లు, బాబోయ్.. అంత తగ్గింపా?

సింపుల్ వేవ్ ఈవీలపై సూపర్ ఫెస్టివ్ ఆఫర్లు, బాబోయ్.. అంత తగ్గింపా?
Advertisement

Simple Energy Offers: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని TFT వేరియంట్లపై రూ.10,000 పండుగ తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్‌ తో రెండు వేరియంట్ల ధరలు తగ్గనున్నాయి. పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ డిస్కౌంట్ కొంత ఊరటనివ్వనుంది.

రెండు వేరియంట్లపై రూ.10 వేల తగ్గింపు

సింపుల్ ఎనర్జీ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా సింపుల్ వేవ్ 3.7 kW TFT, 5 kW TFT వేరియంట్లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ ఆఫర్ 2026 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. అయితే, ఈ ఆఫర్.. సౌత్ ఇండియాలో అందుబాటులో లేదు. ఉత్తర, తూర్పు, మధ్యప్రదేశ్, గుజరాత్‌లోని ప్రధాన మార్కెట్లకు ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.

తగ్గింపు తర్వాత కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

సింపుల్ వేవ్ 3.7 kW TFT వేరియంట్ ఎక్స్‌ షోరూమ్ ధర రూ.1,74,999గా ఉంది. రూ.10,000 తగ్గింపు తర్వాత దీని ధర రూ.1,64,999కి చేరింది. మరోవైపు, హై పర్ఫార్మెన్స్ సింపుల్ వేవ్ 5 kW TFT వేరియంట్ ధర రూ.1,89,999 నుంచి రూ.1,79,999కి తగ్గింది. ఈ రెండు మోడళ్లపై తగ్గింపును అందించడం ద్వారా పండుగ సీజన్‌ లో ఎక్కువ మంది వినియోగదారులకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ఈ బెనిఫిట్స్ నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా..

సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ 2026 సెప్టెంబర్ 2న తొలిసారిగా లాంచ్ చేసింది. రోజువారీ ప్రయాణాలు, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించింది. ఈ స్కూటర్ మూడు ప్రధాన వేరియంట్లు ఉండగా, మొత్తం ఆరు ప్రొడక్షన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం, స్క్రీన్ టెక్నాలజీ, కనెక్టెడ్ ఫీచర్ల ఆధారంగా వినియోగదారులు తమకు అనుకూలమైన మోడల్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

సీటు కింద 70 లీటర్ల స్టోరేజ్

Advertisement

సింపుల్ వేవ్‌లో వినియోగదారుల సౌకర్యానికి  ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 920 మిల్లీమీటర్ల పొడవైన సీటును అందించారు. నిటారుగా, సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించేలా దీని ఎర్గోనామిక్స్‌ను రూపొందించారు. ముఖ్యంగా సీటు కింద 70 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉండటం ఈ స్కూటర్‌ లోని ప్రధాన ప్రత్యేకతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులను తీసుకెళ్లేవారికి ఈ స్పేస్ ఉపయోగపడుతుంది.

Read Also: సింగిల్ ఛార్జింగ్‌తో 343 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

Tags

Related News

డెంజా లాంచ్ డేట్ ఫిక్స్.. 600 కి.మీ. రేంజ్‌ తో అదరగొట్టేలా!

మారుతి విక్టోరిస్ ఆరం ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ రూ.22,990కే కొత్త యాక్సెసరీస్ కిట్!

సింగిల్ ఛార్జింగ్‌తో 343 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

డుకాటి ఫార్ములా 73 విడుదల, లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

TFT డిస్‌ ప్లే, క్విక్‌షిఫ్టర్‌.. అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ NS200 గ్రాండ్ ఎంట్రీ!

వెదురుతో పెట్రోల్.. 10 నిమిషాల్లోనే తయారీ, లీటర్ ధర ఎంతో తెలుసా?

కార్లలో ఇకపై బ్లాక్ బాక్స్.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేస్తుందట, ఇదిగో ఇలా..

Big Stories

Advertisement
×