E-Paper
Advertisement

సింగిల్ ఛార్జింగ్‌తో 343 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!

సింగిల్ ఛార్జింగ్‌తో 343 కి.మీ రేంజ్.. కొత్త ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!
Advertisement

New Ultraviolette X-47 Venom: ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ మరో కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఆధారంగా నిలవనున్న కొత్త VX-100 ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన X-47 వెనమ్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.2.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ.4.12 లక్షలుగా ఉంది. మొదటి 5,000 మంది కొనుగోలుదారులకు మాత్రమే ఈ ధరలు వర్తిస్తాయి. ఆ తర్వాత వేరియంట్‌ను బట్టి ధరలు రూ.35,000 వరకు పెరగనున్నాయి.

కొత్త ప్లాట్‌ ఫామ్‌తో తగ్గిన బరువు

X-47 వెనమ్‌ లో కీలక మార్పు కొత్త VX-100 ప్లాట్‌ఫామ్. దీని వల్ల బైక్ బరువు తగ్గడంతో పాటు ప్రయాణ పరిధి కూడా పెరిగిందని కంపెనీ తెలిపింది. 7.5kWh బ్యాటరీతో వచ్చే బేస్ వేరియంట్ బరువు 180 కిలోలు. పాత 7kWh మోడల్‌తో పోలిస్తే ఇది 17 కిలోలు తక్కువ. 11kWh బ్యాటరీ కలిగిన టాప్ రీకాన్ వేరియంట్ బరువు 195 కిలోలు కాగా, గత మోడల్ కంటే 13 కిలోలు తగ్గింది.

సింగిల్ ఛార్జ్ తో 343 కి.మీ రేంజ్

Advertisement

కొత్త మోడల్‌లో బ్యాటరీ, మోటార్, మోటార్ కంట్రోలర్‌ను మరింత అప్ డేట్ చేసినట్లు అల్ట్రావయోలెట్ వెల్లడించింది. టాప్ వేరియంట్ గరిష్ఠంగా 343 కిలోమీటర్ల క్లెయిమ్ చేసిన రేంజ్‌ ను అందిస్తుంది. బేస్ వేరియంట్ రేంజ్ 227 కిలోమీటర్లుగా ఉంది.

వేగం, పనితీరులోనూ కీలక మార్పులు

రీకాన్ వేరియంట్ గరిష్ఠంగా 40hp పవర్‌ ను, 90Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. బైక్ 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని 2.7 సెకన్లలో, 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ వెల్లడించింది. బాలిస్టిక్ రైడ్ మోడ్‌ను బ్యాటరీ ఛార్జ్ 10 శాతం వరకు ఉపయోగించుకోవచ్చు. రీజెనరేటివ్ బ్రేకింగ్ 99 శాతం ఛార్జ్  దగ్గర కూడా పనిచేస్తుంది.

క్రూయిజ్ కంట్రోల్.. 7 అంగుళాల TFT స్క్రీన్

Advertisement

కొత్త X-47 వెనమ్‌లో క్రూయిజ్ కంట్రోల్, కెమెరా పార్కింగ్ అసిస్టెన్స్, 7 అంగుళాల TFT డిస్‌ప్లే లాంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఇవి టాప్ మూడు వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ లాంటి రైడర్ అసిస్టెన్స్ వ్యవస్థలను కూడా అందించారు. హై వేరియంట్లలో రాడార్ ఆధారిత UV హైపర్‌ సెన్స్, ఇంటిగ్రేటెడ్ డాష్‌ క్యామ్ లాంటి అదనపు ఫీచర్లు ఉంటాయి.

నాలుగు వేరియంట్లు.. నవంబర్‌లో డెలివరీలు

X-47 వెనమ్, వెనమ్+, వెనమ్ రీకాన్, వెనమ్ రీకాన్+ పేర్లతో నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.   బ్యాటరీ సామర్థ్యం, ఛార్జర్, కలర్ ను బట్టి ధర మారుతుంది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు నవంబర్‌లో మొదలుకానున్నాయి.

Read Also: డుకాటి ఫార్ములా 73 విడుదల, లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

Tags

Related News

మారుతి విక్టోరిస్ ఆరం ఎడిషన్ వచ్చేసింది.. జస్ట్ రూ.22,990కే కొత్త యాక్సెసరీస్ కిట్!

డుకాటి ఫార్ములా 73 విడుదల, లుక్ చూస్తే మతిపోవాల్సిందే!

TFT డిస్‌ ప్లే, క్విక్‌షిఫ్టర్‌.. అదిరిపోయే ఫీచర్లతో పల్సర్ NS200 గ్రాండ్ ఎంట్రీ!

వెదురుతో పెట్రోల్.. 10 నిమిషాల్లోనే తయారీ, లీటర్ ధర ఎంతో తెలుసా?

కార్లలో ఇకపై బ్లాక్ బాక్స్.. ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేస్తుందట, ఇదిగో ఇలా..

బేయాన్ To 0 ఆల్ఫా.. డిసెంబర్ లో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న 4 క్రేజీ SUVలు!

ఇక క్లచ్ పట్టాల్సిన అవసరం లేదు.. కవాసకీ కొత్త అడ్వెంచర్ బైక్‌ భలే ఉందిగా..

Big Stories

Advertisement
×