E-Paper
Advertisement

రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని కావడం కష్టమే.. రాంచందర్ రావు సెటైర్లు

రాహుల్ గాంధీ ఇప్పట్లో ప్రధాని కావడం కష్టమే.. రాంచందర్ రావు సెటైర్లు
Advertisement

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో : కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి తమ పార్టీ నేత అని, కానీ బొగ్గు దొంగలు మాత్రం కాంగ్రెస్ లీడర్లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ప్రధానిగా రాహుల్ గాంధీని చేయాలని చూస్తున్నారని, కానీ ఆయన ఇప్పట్లో ల్యాండ్ అవ్వడం కష్టమని ఎద్దేవాచేశారు. రాహుల్.. గాంధీ పేరును చోరీ చేశారని మండిపడ్డారు. రేపో మాపో ప్రియాంక తనయుడు రెహాన్ వాద్రాకు కూడా గాంధీ అని పెడతారని చురకలంటించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అవ్వడం ఖాయమని రాంచందర్ రావు ధీమా వ్యక్తంచేశారు.

పొన్నం ప్రభాకర్ కు సవాల్..

Advertisement

గుజరాత్, రాజస్తాన్ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఆయన పేర్కొన్నారు. అస్సాంలో ముస్లిం డామినేటెడ్ స్థానంలో బీజేపీ గెలిచిందని గుర్తుచేశారు. లోక్ తంత్ర్ బచావో అరాచక్ కో హటావో అనే పేరుతో నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ లో పాదయాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు మరో 5 చోట్ల పాదయాత్రలు ఉంటాయని తెలిపారు. ఓట్లు డిలీట్ అయిన 10 మందిని అయినా తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరానని, కానీ మంత్రి ఇప్పటిదాకా ఎవరినీ తీసుకురాలేదని చురకలంటించారు.

ఓటు చోరీ చేస్తే రాహుల్ , రేవంత్ రెడ్డి ఎందుకు గెలుస్తారు..?

Advertisement

ఎస్ఐఆర్ పై ప్రజలను ఎందుకు కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నారని రాంచందర్ రావు ప్రశ్నించారు. బెంగాల్ లో చొరబాటుదార్ల ఓట్లు తీసేశామని, అది తప్పా? అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ లో హిందువులను ఊచకోత కోస్తున్న అంశంపై ఎవరు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తాము బంగ్లాదేశ్ లో మాదిరిగా అరాచకం చేయకుండా తిరిగి వారి దేశాలకు వారిని పంపిస్తున్నామని రాంచందర్ రావు వెల్లడించారు. నిజంగా ఓటు చోరీ చేస్తే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎందుకు గెలుస్తారని ప్రశ్నించారు. ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ కి వెళ్లడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో కేంద్రం ఆదుకోవాలని చెబుతున్నారే తప్పితే.. జరిగిన నష్టంపై రిపోర్ట్ తయారు చేసి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకోమని గగ్గోలు పెడితే ఎలా అని రాంచందర్ రావు ఫైరయ్యారు.

కాంగ్రెస్ అసలు ప్లానింగ్ లేదు..

ఎల్ నినో వంటి పరిస్థితుల్లో రైతులపై బీఆర్ఎస్ కపట ప్రేమ ప్రదర్శిస్తోందని, అసలు ఆ పార్టీ నేతలకు ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఫైరయ్యారు. రాంగ్ ప్లానింగ్ తో ప్రాజెక్ట్ లు కట్టారని, ఇప్పుడున్న కాంగ్రెస్ అసలు ప్లానింగ్ లేకుండా  ముందుకెళ్తోందని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ చేసిన స్కామ్స్ చాలా ఉన్నాయని, వాటి గురించి మాట్లాడితే ఎంతో సమయం పడుతుందన్నారు. ఢిల్లీలో దేశానికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తూ.. తిరంగా ర్యాలీ చేస్తామంటే పర్మిషన్ ఎందుకు ఇస్తామని రాంచందర్ రావు ప్రశ్నించారు. జార్జ్ సోరస్ ఫండ్ తో తిరంగా ర్యాలీకి కొందరు యత్నించారన్నారు.  ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి పెట్టే సమావేశాలు కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాత్రమేనని, ఎల్ నినోపై కాదని, ఒకవేళ ఎల్ నినోపై సమావేశం పెట్టినా.. అందులో ఆ అంశం తప్పా ఎన్నికల అంశంపైనే చర్చిస్తారని రాంచందర్ రావు విమర్శించారు.

ఎల్ నినోపై అఖిలపక్ష సమావేశం పెట్టాలి..

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించాలని, తాము కూడా తమ సలహాలు, సూచనలు అందిస్తామన్నారు. ఏపీ మున్సిపల్ ఎన్నికలపై స్పందించిన రాంచందర్ రావు.. ఎన్నికలు ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని కోరారు. ఎన్నికల్లో హింస మంచి పద్ధతి కాదన్నారు. ఇకపోతే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు మద్దతివ్వాలా? వద్దా? అనేది హైకమాండ్ చూసుకుంటుందని తెలిపారు. జనసేన ఒక పొలిటికల్ పార్టీ అని, వారి పొలిటికల్ స్ట్రాటజీ వారికి  ఉంటుందని వెల్లడించారు.

Also Read: వయసు మారితే బాడీ లాంగ్వేజ్ కూడా మారాల్సిందే – రాగ్ మయూర్!

Tags

Related News

సీఎం రేవంత్ ‘విజన్ 6 మంత్ర’.. ఎమ్మెల్యే, ఎంపీలకు ఇచ్చిన టాస్క్‌ ఇదే?

‘కరువుపై బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం’.. కేటీఆర్, హరీశ్ రావుపై మంత్రి అడ్లూరి ఫైర్!

అమ్మాయిలూ.. అప్రమత్తంగా ఉండండి, హైదరాబాద్‌లోని ఆ ఆఫీసులో ఏం జరిగిందంటే?

2029లో ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం!- సీఎం రేవంత్

అడవిలో వేటాడే పులి మనమే.. ఫేక్ సమ్మిట్‌లను అడ్డుకుంటాం: కవిత

దక్షిణాది రాష్ట్రాల భద్రతకు బిగ్ ప్లాన్.. ఉమ్మడి సెక్రటేరియట్‌కు రేవంత్ పిలుపు!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ ప్లాన్! భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×