E-Paper
Advertisement

Commissioner Srujana: ఏడాదిలో ఫ్లై ఓవర్లు పూర్తి కావాలి.. హెచ్ సిటీ పనులకు సైబరాబాద్ కమిషనర్ సృజన డెడ్ లైన్

Commissioner Srujana: ఏడాదిలో  ఫ్లై ఓవర్లు పూర్తి కావాలి.. హెచ్ సిటీ పనులకు సైబరాబాద్ కమిషనర్ సృజన డెడ్ లైన్
Advertisement

Commissioner Srujana: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐటీ కారిడార్ లో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు చేపట్టన రెండు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణ పనులు వచ్చే సంవత్సరం మే మాసం కల్లా పూర్తి చేయాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన డెడ్ లైన్ విధించారు. త్రిబుల్ ఐటీ జంక్షన్ వద్ద జరుగుతున్న హెచ్ సిటీ ఫ్లైఓవర్ పనులను కమిషనర్ గురువారం పరిశీలించారు. కమిషనర్ మొత్తం పనుల పురోగతి, నిర్మాణ ప్రక్రియను సమీక్షించి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. డీఎల్ఎఫ్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులను వచ్చే సంవత్సరం మర్చి కల్లా, అలాగే ఐఎస్ బీ నుంచి డీఎల్ఎఫ్ వరకు, ఐఎస్ బీ నుంచి గచ్చిబౌలీ వరకు నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులను వచ్చే సంవత్సరం మే మాసం లోపు పూర్తి చేయాలని ఆదేవించారు.

Also  ReadVivo iQOO Z11x 5G Phone: భారత్ లో iQOO Z11x 5G ఫోన్ లాంచ్.. ఈ కార్డులపై రూ.2 వేల వరకు ఆఫర్

నవంబర్ లోపు పూర్తి చేయాలి

Advertisement

అదనంగా గచ్చిబౌలి–లింగంపల్లి అండర్‌పాస్ పనులను వచ్చే సంవత్సరం నవంబర్ లోపు పూర్తి చేయాలని సూచించారు. పనులను మరింత వేగంగా చేపట్టి సమయాన్ని ఆదా చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు.అలాగే పనులు పూర్తైన వెంటనే కూల్చివేత వ్యర్థాలు,తవ్విన మట్టిని వెంటనే తొలగించాలని కూడా కాంట్రాక్టర్లకు సూచించారు.ఫ్లైఓవర్ పనులు పూర్తైన తర్వాత వాటిపై అందంగా కనిపించేలా పెయింటింగ్‌ల కోసం ప్రత్యేకమైన ఆహ్లాదకరమైన థీమ్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేయాలని కూడా కమిషనర్ అధికారులకు సూచించారు.

Also  Read: Lord Krishna: శ్రీ కృష్ణుడికి నిజంగా 16 వేల మంది భార్యలా..? అసలు నిజం ఏంటో తెలుసా

Related News

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Big Stories

Advertisement
×