E-Paper
Advertisement

Guntur: అంబటి రాంబాబుకు కష్టాలు.. మళ్లీ అరెస్టు తప్పదా? ఉలిక్కిపడిన వైసీపీ నేతలు

Guntur: అంబటి రాంబాబుకు కష్టాలు.. మళ్లీ అరెస్టు తప్పదా? ఉలిక్కిపడిన వైసీపీ నేతలు
Advertisement

Guntur: ఏపీలో వైసీపీ నేతలకు కష్టాలు మొదలయ్యాయి. ఏదో విధంగా తమ నోటికి పని చెప్పి అడ్డంగా బుక్కవుతున్నారు. సీఎం చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యల కేసులో బయటపడిన ఆయన, కొత్త సమస్య మొదలైంది. తాజాగా అంబటిపై మరొక కేసు నమోదు కావడంతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగింది?

వైసీపీ నేత అంబటి రాంబాబుకు మళ్లీ కష్టాలు

Advertisement

వైసీపీ నేతలు రూటు మార్చారు. గడిచిన రెండేళ్లు కాస్త సైలెంట్ అయిన నేతలు దూకుడు పెంచారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలతో ప్రజా సమస్యలపై ఇప్పుడిప్పుడే రోడ్డు ఎక్కుతున్నారు. అదే సమయంలో ప్రజలకు ఇబ్బంది కూడా కలిగిస్తున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కష్టాలు తీరేలా కనిపించలేదు.

ఆయనపై గుంటూరులోని నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేం జరిగింది? తన ఇంటిపై దాడికి నిరసనగా దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు అంబటి రాంబాబు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు అయ్యింది.

Advertisement

ఆయనపై గుంటూరు పోలీసులు కేసు నమోదు, షాకైన వైసీపీ నేతలు

అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష చేయడమే కాకుండా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. ఫలితంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అంబటిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కొందరు నేతలు ఆయనకు అనుకూలంగా మాట్లాడగా, మరికొందరు ఆయన చేసింది ముమ్మాటికీ తప్పేనని అంటున్నారు. ప్రభుత్వాలు మారిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండాలని, వైసీపీ ప్రభుత్వం మాదిరిగా చేస్తే పోలీసులు సైలెంట్‌గా ఉంటారని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా విషయాలు పోలీసులను మెతక వైఖరి అవలంభిస్తున్నారని హైకోర్టు చీవాట్లు పెడుతోందని గుర్తు చేస్తున్నారు.

ALSO READ: ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ.. ఎందుకంటే?

కొందరు మాత్రం కావాలని అంబటిని టార్గెట్ చేశారని అంటున్నవాళ్లు లేకపోలేదు.  ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకెంతమందిపై కేసులు నమోదు అవుతాయోనని అంటున్నారు. తాజాగా నమోదైన కేసులో అంబటి రాంబాబు ఇంకా నోరు విప్పలేదు. సోషల్‌మీడియాలో కూడా ఆయన స్పందించ లేదు.  ఈ వ్యవహారంపై ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

Related News

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు

కాకినాడ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్.. చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్.. అసలు సూత్రధారి అతడే!

ప్రియురాలి పీక కోసి.. బిల్డింగ్‌పై నుంచి దూకేసిన ప్రియుడు

Big Stories

Advertisement
×