E-Paper
Advertisement

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?
Advertisement

e-HRMS Telangana: రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ సంస్కరణల్లో భాగంగా ఒక కీలకమైన ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సేవా వివరాల నిర్వహణ కోసం ఎలక్ట్రానిక్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ఈ-హెచ్‌ఆర్‌ఎమ్‌ఎస్) విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో తక్షణమే అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

నూతన విధానం..

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో జారీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు ఫిజికల్ గా ఉండటం వల్ల సేవా వ్యవహారాల పరిష్కారంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీనికి శాశ్వత పరిష్కారంగా, పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో అంతర్భాగంగా ఈ నూతన డిజిటల్ మాడ్యూల్‌ను అభివృద్ధి చేశారు. ఉద్యోగుల సెలవులు, వార్షిక ఇంక్రిమెంట్లు, బదిలీలు, పదోన్నతులు, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు, స్థిరాస్తి ప్రకటనలు, విజిలెన్స్ వ్యవహారాలు, రిటైర్మెంట్‌కు సంబంధించిన అన్ని రకాల ఫైళ్లను ఆన్‌లైన్ వర్క్‌ఫ్లో పద్ధతిలోనే పరిశీలించి, ఆమోదించనున్నారు.

అధికారుల నిఘా..

Advertisement

ఈ డిజిటల్ విధానంపై ఇప్పటికే జిల్లా ట్రెజరీ అధికారులు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో వచ్చే సాంకేతిక సమస్యల పరిష్కారానికి జిల్లాల వారీగా నోడల్ అధికారులను నియమించారు. అంతేకాకుండా, ఐఎఫ్ఎంఐఎస్ హెల్ప్‌లైన్ నంబర్ 7042420033 లేదా 7075057210 ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ పర్యవేక్షకురాలిగా వ్యవహరిస్తారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also read: ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

Tags

Related News

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

వాహనారులకు అలర్ట్.. హైదరాబాద్ సిటీలో సద్దుల బతుకమ్మ పండగ, వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

Big Stories

Advertisement
×