E-Paper
Advertisement

Full-face Helmet: SMK నుంచి మరో రెండు క్రేజీ హెల్మెట్లు లాంచ్, వీటి ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Full-face Helmet: SMK నుంచి మరో రెండు క్రేజీ హెల్మెట్లు లాంచ్, వీటి ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

SMK Full-face Helmet: బడ్జెట్ ధరలో వినియోగదారులకు నాణ్యమైన హెల్మెట్లను అందించడంలో ముందుంటుంది SMK సంస్థ. ఇతర కంపెనీలతో పోల్చితే, తక్కువ ధరతో, అదిరిపోయే ఫీచర్లతో క్రేజీ హెల్మెట్లను మార్కెట్ కు పరిచయం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఇండియన్ మార్కెట్ లోకి రెండు ఫుల్ ఫేస్ హెల్మెట్లను లాంచ్ చేసింది. ఇంతకీ వాటి పేర్లు ఏంటి? వాటి ప్రత్యేతలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

SMK నుంచి మరో రెండు హెల్మెట్లు విడుదల

SMK సంస్థ భారతీయ మార్కెట్ లోకి రెండు హెల్మెట్లను విడుదల చేసింది. NOVA ఫుల్ ఫేస్ హెల్మెట్ సిరీస్‌ పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. NOVA సాలిడ్, NOVA ట్రాక్ పేరుతో లాంచ్ చేసింది. NOVA సాలిడ్ హెల్మెట్ ధర రూ. 4,000 నిర్ణయించగా, NOVA ట్రాక్ ధర రూ. 4,300 నుంచి ప్రారంభం కానుంది. ఈ రెండు వేరియంట్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న అధీకృత SMK డీలర్లు, మోటార్‌ సైకిల్ యాక్సెసరీ స్టోర్లలో XS నుంచి XXL పరిమాణాలలో అందుబాటులో ఉన్నాయి. గ్లోస్, మ్యాట్ ఫినిష్ ఎంపికలతో లభిస్తున్నాయి.

NOVA సిరీస్ హెల్మెట్ల ప్రత్యేకత ఏంటంటే?

NOVA సిరీస్ ఎనర్జీ ఇంపాక్ట్ రెసిస్టెంట్ థర్మోప్లాస్టిక్ షెల్ ఉపయోగించి నిర్మించబడింది. ఇంపాక్ట్ అబ్జర్వ్ కోసం మల్టీ డెన్సిటీ EPS లైనర్ ను కలిగి ఉంటుంది. ఈ హెల్మెట్లు ECE 22.06, DOT,  ISI భద్రతా సర్టిఫికేషన్ ను కలిగి ఉన్నాయి. ఇవి భారతీయ, అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి.

NOVA సిరీస్ హెల్మెట్స్ ఫీచర్లు

NOVA సిరీస్ హెల్మెట్ల ఫీచర్ల విషయానికొస్తే.. ఇవి ఆప్టికల్‌ గా సరైన, స్క్రాచ్ రెసిస్టెంట్ వైజర్, ఫాగింగ్‌ ను తగ్గించడానికి పిన్‌ లాక్ 30 ఇన్సర్ట్‌ తో వస్తాయి. సులభంగా తొలగించడానికి వైజర్‌ లో క్విక్ రిలీజ్ మెకానిజం కూడా ఉంది. వెనుక ఎగ్జాస్ట్ అవుట్‌ లెట్‌ తో పాటు చిన్, టాప్ ఎయిర్ వెంట్స్ ద్వారా వెంటిలేషన్ మెయింటెనెన్స్ అవుతుంది. అయితే, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి నోస్ డిఫ్లెక్టర్, విండ్ ప్రొటెక్టర్ ను కలిగి ఉన్నాయి.

Read Also: టాటా పంచ్ To మహీంద్రా XUV 3XO.. రూ. 10 లక్షల లోపు బెస్ట్ SUV కార్లు ఇవే!

ఇక హెల్మెట్స్ లోపలి భాగంలో శ్వాసకు ఇబ్బంది కలగకుండా, హైపోఅలెర్జెనిక్ లైనర్ ఉంటుంది. ఇది బయటకు తీయడంతో పాటు ఉతికేందుకు అనుకూలంగా ఉంటుంది. ఈ హెల్మెట్లు కళ్ళజోడు, ఫ్రెండ్లీ డిజైన్, క్విక్ రిలీజ్ చిన్ స్ట్రాప్‌ను కూడా కలిగి ఉంటుంది. మెరుగైన ఫిట్ కోసం రెండు షెల్ సైజులలో అందించబడతాయి. NOVA సాలిడ్ సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లు,  క్లీనర్ డిజైన్‌ తో వస్తుంది. అయితే NOVA ట్రాక్ మరింత అగ్రెసివ్ గా ఉండే గ్రాఫిక్స్, కాంట్రాస్ట్ కలర్ స్కీమ్ లను కలిగి ఉంటుంది.

Read Also: బైక్ ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుందా? జస్ట్ ఇలా చేస్తే కూల్ గా ఉంటుంది!

Related News

టాటా ఈవీలకు చైనా టెక్నాలజీ.. ఇండియన్ ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్‌ షేకవ్వక తప్పదా?

భారత ఆటో రంగంలో సరికొత్త అధ్యాయం.. ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ విడుదల!

అవెంజర్ స్ట్రీట్ కొంటే బెటరా? క్రూజ్ కొంటే బెటరా? రెండింటిలో ఏది బెస్ట్?

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్స్ వచ్చేశాయ్.. ధర మరీ అంత తక్కువా?

ఇండియన్ మార్కెట్ లోకి యమహా NMax 155 ఎంట్రీ, ఫీచర్లు చూస్తే షాక్!

టీవీఎస్, బజాజ్ జోరు.. ఓలా బేజారు.. ఈవీ స్కూటర్ అమ్మకాల్లో టాప్ 5 మోడల్స్ ఇవే!

ఒకే ఇంజిన్.. రెండు బైక్స్.. బుల్లెట్ 650 vs క్లాసిక్ 650 డిఫరెన్స్ ఇవే!

అవెంజర్ లవర్స్ కు గుడ్ న్యూస్.. రెండు రంగుల్లో స్ట్రీట్ 220 మళ్లీ ఎంట్రీ!

Big Stories

×