E-Paper
Advertisement

EV Summer Tips: సమ్మర్ లో ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? ఏసీ విషయం లో జాగ్రత్త!

EV Summer Tips: సమ్మర్ లో ఎలక్ట్రిక్ కారు వాడుతున్నారా? ఏసీ విషయం లో జాగ్రత్త!
Advertisement

వేసవిలో డ్రైవింగ్ చేసే సమయంలో చాలా మంది ఏసీ వేసుకుంటారు. చల్లగా ప్రయాణం చేయాలనుకుంటారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల కోసం, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ బ్యాటరీ ద్వారా పవర్ తీసుకుంటుంది. ACని వాడితే, దాని ప్రయాణ రేంజ్ ఆటో మేటిక్ గా తగ్గుతుంది. సో, బ్యాటరీ లైఫ్ కాపాడటానికి, సౌకర్యంగా ఏసీ ని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో మీ ఎలక్ట్రిక్ కారులో ఏసీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ కారును ప్రీ కూల్ చేయండి

కారులో ఏసీ ఆన్ చేయడానికి ముందు కొన్ని నిమిషాలు విండోస్ ఓపెన్ చేసి వెంటిలేట్ చేయాలి.  కారు లోపల ఉన్న వేడి గాలి బయటకు వెళ్లడానికి సాయపడుతుంది. ఆ తర్వాత ఏసీ వేస్తే, త్వరగా క్యాబిన్ అంతా కూల్ అవుతుంది. బ్యాటరీ పవర్ మరింత సేవ్ అవుతుంది.

⦿ రీసర్క్యులేషన్ మోడ్‌ ఉపయోగించండి

Advertisement

ఎయిర్ రీసర్క్యులేషన్ మోడ్‌ ను ఉపయోగించుకోవాలి. ఎక్కువ ఎండలో కారు లోపల చల్లని గాలి బయటకు వెళ్లడానికి  రీసర్క్యులేషన్ మోడ్‌ ను ఉపయోగించడం మంచిది. ఇది కారు లోపలికి చల్లని గాలిని ప్రసరించేలా చేస్తుంది. కారు లోపలి వేడిని బయటకు పంపిస్తుంది. ఈ మోడ్ మెరుగైన గాలి నాణ్యతను కాపాడటమే కాకుండా క్యాబిన్ అంతా చల్లగా ఉండేలా చేస్తుంది.  చల్లదనాన్ని ఏర్పాటు చేస్తుంది.

⦿ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ ఉపయోగించండి

EVలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటే, దానిని ఉపయోగించుకోవాలి. మీకు కావలసిన ఉష్ణోగ్రతను ముందే సెట్ చేయాలి. సిస్టమ్ ఆటో మేటిక్ గా గాలి ప్రవాహాన్ని,  ఫ్యాన్ వేగాన్ని అడ్జెట్ చేస్తుంది. ఈ స్మార్ట్ సిస్టమ్ కారు లోపల, బయట మారుతున్న వాతావరణం ఆధారంగా ఆటో మేటిక్ గా ఛేంజెస్ చేసుకుంటూ పవర్ ను ఆప్టిమైజ్ చేస్తుంది.

⦿ ఆన్ ఆఫ్ సైకిల్స్ ను నివారించండి

Advertisement

ఎయిర్ కండిషనర్‌ ను తరచుగా ఆన్, ఆఫ్ చేయకూడదు.  EVలోని AC కంప్రెసర్ పవర్ ద్వారా శక్తిని పొందుతుంది. తరచుగా ఆన్, ఆఫ్ చేయడం వల్ల బ్యాటరీ మీద లోడ్ ఎక్కువగా పడుతుంది. బ్యాటరీ త్వరగా అయిపోతుంది. ఏసీని నిరంతరం ఆన్, ఆఫ్ చేయడం కంటే తక్కువ మొత్తంలో ఆన్ లో ఉంచడం మంచిది.జ

⦿ నార్మల్ టెంపరేచర్ లో ఏసీని ఉంచండి   

ఎయిర్ కండిషనర్‌ ను మరీ ఎక్కవ చల్లదనం వచ్చేలా కాకుండా నార్మల్ టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ కూలింగ్ వల్ల ఎక్కువ పవర్ ఖర్చు అవుతుంది. అందుకే, కారులో ఉన్న వారికి సౌకర్యంగా ఉండేలా ఏసీ సెట్ చేసుకుంటే సరిపోతుంది.

మొత్తంగా వేసవిలో ఎలక్ట్రిక్ వాహనంలో ఎయిర్ కండిషనర్‌ ను సరిగ్గా ఉపయోగించడం వల్ల బ్యాటరీ పవర్ ను  ఆదా చేసుకోవచ్చు. AC ఆన్ చేసే ముందు కారును వెంటిలేట్ చేయడం, రీసర్క్యులేషన్ మోడ్‌ను ఉపయోగించడం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను ఉపయోగించడం, తరచుగా ఆన్, ఆఫ్ సైకిల్‌లను నివారించడం, నార్మల్ టెంపరేచర్ సెట్టింగ్‌ ను ఉపయోగించడం వల్ల EV కారు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

Read Also: వేసవిలో కారు ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుందా? ఈ జాగ్రత్తలు పాటించండి!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×